న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌


న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌

న్యూడెమోక్రసీ

23-09-2021

సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడు, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శి కా॥ ముఖ్తార్ పాష కరోనాతో మరణించి రేపటికి (సెప్టెంబర్ 24) సంవత్సరం అవుతుంది. ఈ సందర్భంగా సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ ఇల్లందులో కా॥ ముఖ్తార్ పాష వర్ధంతి సభను జరుపుతున్నది. ఈ సందర్భంగా ఆ పార్టీ పత్రిక రైజింగ్ న్యూ డెమాక్రసీ లో ప్రచురించిన ఆర్టికల్...

సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడుగా, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమ బాధ్యతలు చూస్తున్న కా॥ ముఖ్తార్ పాష 2020 సెప్టెంబర్ 24న, కార్పోరేట్ క్రూర కరోనాతో అమరుడైన విషయం తెలిసిందే.
కామ్రేడ్ పాష ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీలో ʹʹప్రతిఘటన పోరాట పంథాను" సజీవంగా ఉంచడంలో ముఖ్యుడిగా ఉన్నాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విప్లవ కార్మికోద్యమంలో అంచలంచెలుగా అగ్రనాయకుడిగా ఎదిగాడు. కమ్యూనిస్టు సిద్ధాంతంపై జరిగిన దాడి.. ఆచరణలో వచ్చిన మార్పులు, అంతర్గతంగా తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ 40 ఏండ్లకు పైగా ప్రజాక్షేత్రంలో దృడంగా నిలబడి విప్లవ కమ్యూనిస్టు నాయకుడిగా నిలదొక్కుకున్నాడు. ఈ కామ్రేడ్ త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావడానికి అవసరమైన కర్తవ్యాలను నిర్దేశించుకొనుటకు సెప్టెంబర్ 24న, ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం.

కా॥ ముఖ్తార్ పాషకు నివాళి అర్పించడం అంటే దీర్ఘకాలిక ప్రజా యుద్ద (సాయుధ పోరాట) పంధా రాజకీయాలను కాపాడుకోవడమే.. గోదావరిలోయ ప్రతిఘటన పోరాట పంథాను అనుసరించడం, ముందుకు తీసుకెళ్ళడం.. ఆదివాసీ భూమి, హక్కుల రక్షణకు సాయుధ ఆత్మరక్షణ దళాల పనిని కొనసాగించడం.. విస్తరించడం.

కా॥ పాష పోడు వ్యవసాయ భూముల రక్షణ కొరకు, ఏజెన్సీ ప్రజల అభివృద్ధి కోసం జరిగిన అనేక పోరాటాలను రూపకల్పన చేసాడు. నాయకత్వం వహించాడు. పారిశ్రామిక కార్మికుల హక్కులను కాపాడుకొనుటకు జరిగిన మిలిటెంట్ పోరాటాలకు బాద్యుడిగా ఉన్నాడు. కార్పోరేట్ కంపెనీల దోపిడీని తీవ్రతరం చేయుటకు, కేంద్ర ప్రభుత్వం చేసిన ʹʹకార్మిక చట్టాల సవరణనుʹʹ వ్యతిరేకించాడు. మాసా వేదిక నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించాడు. మూడు - వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను బలపర్చాడు. రాజ్యాంగంలో పొందుపర్చిన 5వ, 6వ షెడ్యూల్ ఏరియాలో ఖనిజ దోపిడీని అడ్డుకోవడం, గిరిజన హక్కులు, చట్టాలు కాపాడుకోవాలంటే త్యాగాలకు సిద్ధపడాలని బోధించాడు.

ఈ నేపథ్యంలో విప్లవకారుల (పార్టీల) ఐక్యత నేడు అనివార్య మవుతుంది. విప్లవోద్యమాన్ని పురోగింపజేయాలి అంటే మితవాద, రివిజనిస్టు ధోరణులను ఎండగట్టడం విప్లవ శ్రేణుల కర్తవ్యంగా ఉండాలి. నేటి పరిస్థితులకు అనుగుణంగా వివిధ రాజకీయ పక్షాలతో, సమస్య ప్రాతిపదికన విశాల ఐక్యకార్యాచరణ తక్షణ కర్తవ్యంగా ప్రజల ముందున్నది. బి.జెపి, టీ.ఆర్.ఎస్ ప్రభుత్వాలు, హిందూత్వ భావజాలంతో కుమ్మక్కైన కార్పోరేట్ కంపెనీలు ప్రజలను దోచుకుంటున్న విధానాలను బట్టబయలు చేయాలి.

దుడ్డు లేకపోతే గొర్రె కూడా కరుస్తుందనేది నానుడి.ఆదివాసీలు, గిరిజనులు, దళితులు ఐక్యం కావాలి. అడవిలో ఫారెస్టు సిబ్బంది దూకుడుకు కళ్ళెం వేయాలి. పంట భూములు గుంజుకుంటున్న వారిని, బెదిరించి లూటీ చేస్తున్న వారిని అదుపులో పెట్టాలి. లంచాలు ఇవ్వకండి - బెదిరింపులకు లొంగకండి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల, గిరిజనుల హక్కులను హరించి, పోడు భూములను గుంజుకొని అడవి నుండి వెళ్ళగొట్టడానికి కుట్రలు చేస్తున్నాయి. అందులో భాగంగానే సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ఇతర విప్లవ సంస్థలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. లక్షల రూపాయలను ఖర్చుపెట్టి కోవర్టులను, ఇన్ఫార్మ‌ర్లను తయారు చేసుకున్నారు. రహ‌స్య నాయకులను అరెస్టు చేస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రహ‌స్య నాయకులుగా ఉన్న సీపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర, జిల్లా నాయకులైన కామ్రేడ్స్ కుర్సం అశోకన్న, పూనెం రమేషన్నల సమాచారం పేరుతో అర్థరాత్రి ఆదివాసీ గ్రామాలకు పోలీసులు వచ్చి సోదాలు చేయడం, ఆదివాసి మహిళలను అవమాన పర్చడం నిత్యకృత్య మయ్యాయి. మదగూడెం, పందిపంపుల, కొత్తూరు, ఎల్లపరం, సిద్దారు, అబ్బుగూడెం, సీతాయిగూడెం తదితర గ్రామాలల్లో మహిళలు చేసిన తెగింపు పోరాటాలు విప్లవ శ్రేణులకు ప్రేరణ, ఉత్తేజాన్ని ఇచ్చాయి.

విప్లవ అమర వీరులు కామ్రేడ్స్ తాటి ముత్తన్న, రామనర్సయ్య, దొరన్న ధర్మన్న, ఎల్లన్న, బాటన్న, కొండన్న- మాధవన్న, పగడాల వెంకన్న తదితర అనేక మంది అమరులు మన ప్రతిఘటన పోరాటపంథాకు ఆనాడే బాటలు వేసారు. రావులపాలెం, కాచనపల్లి, కులాలపల్లి, మున్నీ, చీకటిగండ్లు, చిలకల గుట్టలు, రోళ్ళగడ్డ, లదాయిగడ్డ, మిట్టపల్లి, బక్కచింతలపల్లి, మేళ్ళ మడుగులలో చిందిన రక్తం మన విప్లవ కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది.

ఈ విప్లవ వీరుల త్యాగాల చాలల్లో నేలకొరిగిన విప్లవ కేరటమే కా! ముఖ్తార్ పాష, ఏజెన్సీ ప్రజలను, పారిశ్రామిక కార్మికులను సమీకరించిన కా! పాష స్ఫూర్తిని సజీవంగా నిలబెడదాం. కా॥ చంద్ర పుల్లారెడ్డి నాయకత్వాన రూపొందించబడిన గోదావరిలోయ ప్రతిఘటనో ద్యమంలో నేలకొరిగిన విప్లవోద్యమ ముద్దుబిడ్డల త్యాగాలను ఎలుగెత్తి చాటుదాం.

• కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే!
• అమర వీరులకు విప్లవ జోహార్లు!
• గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలు వర్ధిల్లాలి!
• నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి!

Keywords : cpi ml new democracy, Mukhtar pasha, martyr, illandu, meeting, Revolutionary
(2023-05-31 05:12:01)No. of visitors : 904

Suggested Posts


న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ‌

లింగన్నను పోలీసులు కాల్చి చంపిన సమయంలో అక్కడికి చేరుకున్న చుట్టు పక్క గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ అన్నను అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ పోలీసులపైకి వెళ్ళారు. కొద్ది దూరం పోలీసులను తరిమి కొట్టారు. ఈ సమయంలో పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజలు వెన్ను చూపలేదు.

ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹ

న తండ్రిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని బుధవారంనాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు లింగన్న కుమారుడు హరిఆరోపించారు.

న్యూ డెమాక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలి..హైకోర్టు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని

నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్

46 వ ఎమర్జెన్సీ దినం సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ "ఎమర్జెన్సీ నాడు - నేడు" అనే అంశం పై జూన్ 26 న ఆన్లైన్ బహిరంగ సభ ను నిర్వహించింది.ఈ సభ కు సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరావు

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!

అనేక దశాబ్దాలుగా పొడుగొట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న పోడు రైతులను ఈనాడు పెద్ద ఎత్తున పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో మోహరించి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


న్యూడెమోక్రసీ