Assam: ఇళ్ళు ఖాళీ చేయాలని ప్రజలపై పోలీసుల దాడి ‍- పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి !

23-09-2021

అస్సాంలో దరాంగ్‌ జిల్లా ధోల్పూర్‌ రణరంగంగా మారింది. 1970ల నుండి ధోల్పూర్ లో ఉంటున్న ప్రజలపై గురువారంనాడు దాడులు చేసిన పోలీసులు వాళ్ళ ఇళ్ళను కూల్చి వేశారు. అడ్డుచెప్పిన ప్రజలను లాఠీలతో చితకబాదారు. పోలీసులు ప్రజల వెంటపడి మరీ కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకవైపు ఇళ్ల కూల్చివేత, మరో వైపు తమ‌పై పోలీసుల దాడి స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసులపై తిరగబడ్డారు. రాళ్ల దాడి చేశారు. దీంతో స్థానికులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇదే ఘటనలో 9 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయని దరాంగ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుశాంత బిస్వా శర్మ చెప్పారు.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమ్ముడు దరాంగ్ పోలీసు సూపరింటెండెంట్ సుశాంత బిస్వా శర్మ, ఆయుధాలు ధరించి స్వయంగా పోలీసులను ఉసిగొల్పాడని, పోలీసులు లాఠీలతోనే కాక రాళ్ళతో కూడా తమపై దాడికి తెగబడ్డారని ఆందోళనకారులు పేర్కొన్నారు.

ఈ సంఘటన యొక్క ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అక్కడ పోలీసులు నియోగించుకున్నవిజయ్ శంకర్ బనియా అనే ఫోటోగ్రాఫర్, కింద పడి ఉన్న ఓ వ్యక్తిని ఎగెరెగిరి తన్నడం( ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది), కిందపడి ఉన్న వ్యక్తి ఛాతిలో బుల్లెట్ గాయంతో రక్తం కారుతున్న దృశ్యాలు, చెట్ల వెనుక నుండి ప్రజల‌పై వందలాది మంది పోలీసులు కాల్పులు జరుపుతున్నట్లు, వీధిలో చొక్కా మరియు లుంగీ ధరించిన ఓ వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టి కొడుతుండటం వీడియోలో కనిపిస్తున్నది.

ఈ సంఘటన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గౌహతిలో మాట్లాడుతూ ప్రజలను ఖాళీ చేయించడం కొనసాగుతుందని ప్రకటించారు. "ఆక్రమణదారుల నుండి భూమిని క్లియర్ చేసే బాధ్యతను పోలీసులకు అప్పగించాము. పని పూర్తయ్యే వరకు వారు దానిని కొనసాగిస్తారు. చీకటి పడగానే తొలగింపు ఆగిపోతుంది రేపు మళ్లీ ప్రారంభమవుతుంది," అన్నారాయన.

అస్సాం ప్రభుత్వం, పోలీసుల దుర్మార్గ చర్యను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఖండించారు. "అస్సాం రాష్ట్రంలోని మా సోదర సోదరీమణులకు నేను సంఘీభావంగా ఉన్నాను. ప్రభుత్వం కావాలనే ప్రజలపై ఇలాంటి హింసాయుత చర్యలకు పాల్పడుతోందిʹʹ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

నిరసనకారులపై పోలీసు కాల్పుల "అనాగరిక చర్య" పై న్యాయ విచారణ జరిపించాలని అసోం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా డిమాండ్ చేశారు. "ముఖ్యంగా కోవిడ్ పరిస్థితులలో ప్రజలపై ఇలాంటి చర్య అమానుషమైనది," అన్నారాయన.

మహమ్మారి పరిస్థితులలో ఇళ్ళు ఖాళీ చెయించడానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందని, 1970 ల నుండి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ధోల్పూర్ నివాసితులను తరిమికొట్టడానికి శర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పద్ధతిలో ప్రవర్తిస్తోందని భూపేన్ కుమార్ బోరా మండిపడ్డారు.

2016 లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు పదేపదే వేధింపులకు గురవుతున్నారని బోరా ఆరోపించారు.

పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన ఈ సంఘటనపై గౌహతి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా విచారణకు ఆదేశించింది.

Keywords : assam, police firing, Sushanta Biswa Sarma,Himanta Biswa Sarma, Two killed in police firing on Assam "encroachers", video shows official photographer hitting dead man
(2024-04-24 21:46:23)



No. of visitors : 912

Suggested Posts


ఇది సిరియా కాదు భారతదేశ చిత్రపటం! క్రూరత్వం కూడా సిగ్గుపడే సన్నివేశం

వీడియో మొదటి ఫ్రేమ్‌లో ఏడుగురు పోలీసులు కనిపిస్తారు. అంతకంటే ఎక్కువమంది ఉండవచ్చు. పోలీసులందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నారు. విభిన్న శబ్దాలు వస్తున్నాయి.

ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్

ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్‌ త్వరగా పూర్తవుతుందని అన్నారు...

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.

అస్సాం జనాభా 3.3 కోట్లకి పైమాటే. అందులో 3.29 కోట్ల మంది ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పత్రంలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3.11 కోట్ల మంది పేర్లు ముఖ్య జాబితాలో చేరాయి. మిగతావి తిరస్కరనకి గురయ్యాయి. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నలభై లక్షల ఏడు వేల ఏడు మంది పేర్లు ఉన్నాయి.

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్ భట్టాచార్జీ ఎలియాస్ కాంచన్ దా ను అస్సాంలోని కాచర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.

అవును మేము గుండాలమే హిందువులు చర్చిలకు వెళ్తే దాడులు చేస్తాం....భజరంగ్ దళ్ నేత‌

ʹʹఅవును మేము గుండాలమే చర్చిలకు వెళ్ళే హిందువుల మీద దాడులు చేస్తాంʹʹ అని అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత మిథు నాథ్ రెచ్చిపోయాడు. కాచర్ జిల్లా సిల్‌చార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిథు నాథ్ ఈ విధమైన గుండా భాషను మాట్లాడాడు.

సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !

మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు 50 మందికి పైగా గాయపడ్డారు. అసోం, కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ కూడా గాయాలపాలయ్యారు. అస్సాం పోలీసులు తమపై గ్రైనేడ్లు ప్రయోగించడం వల్ల తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని మిజోరాం పోలీసులు తెలిపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


Assam: