ఇది సిరియా కాదు భారతదేశ చిత్రపటం! క్రూరత్వం కూడా సిగ్గుపడే సన్నివేశం

24-092021

వీడియో మొదటి ఫ్రేమ్‌లో ఏడుగురు పోలీసులు కనిపిస్తారు. అంతకంటే ఎక్కువమంది ఉండవచ్చు. పోలీసులందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నారు. విభిన్న శబ్దాలు వస్తున్నాయి. వాటిలో కాల్పులు జరుగుతున్న శబ్దం కూడా ఉంది. కెమెరా ఫ్రేమ్ కాస్త వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు ఏడుగురు పోలీసులు కనిపించారు. బుల్లెట్‌ల శబ్దం తీవ్రమవుతుంది. ఒక పోలీసు గాలిలో కాల్పులు జరుపుతున్నాడు. ఒకరి చేతిలో ఉన్న తుపాకీ కిందపడిపోయింది. ఛాతీ ఎత్తులో ఒక పోలీసు బుల్లెట్‌తో కాల్చాడు. అటువైపు నుంచి ఇద్దరు ముగ్గురు పోలీసులు పరుగులు తీస్తున్నారు. ఒక వ్యక్తి అతని ముందు నడుస్తున్నాడు. అతను వాలు కిందికి వస్తూ వేగంగా పరిగెడుతున్నాడు, కానీ ముందు నుండి పోలీసులు కూడా వేగంగా అతని వైపు కదులుతున్నారు. ఇప్పుడు వీడియో ఫ్రేమ్‌లో అనేక మంది పోలీసులు కనిపిస్తున్నారు. ఒక పోలీసు ఆ వ్యక్తిపై తుపాకీ గురిపెట్టినట్టు కనిపిస్తుంది. లాఠీ ఎత్తినట్లు కనిపిస్తోంది. మరికొంత మంది పోలీసుల చేతిలో లాఠీలు ఉన్నాయి. పారిపోతున్న వ్యక్తి చేతిలో కూడా లాఠీ కనిపిస్తుంది. కాల్పుల శబ్దం వస్తోంది. నిరాయుధుడిగా పారిపోతున్న వ్యక్తి కింద పడిపోవడం కనిపించింది. వీడియో 9 సెకన్లు అయింది. కేవలం 9 సెకన్లలో చాలా జరుగుతున్నట్లు మీరు చూస్తారు. తనను తాను గొప్ప సహనంతో కూడిన దేశమని రాత్రింబవళ్ళు వర్ణించుకునే ఇలాంటి దేశాన్ని మీరు అనేక వేల సంవత్సరాలలో చూసివుండరు.

ఇప్పుడు మీరు తదుపరి ఆరు సెకన్లలో చూసేది భయపెట్టేది కాదు. మీకు క్రూరత్వం, అనాగరికత అనిపించేది మరొకరికి రాజ్యాంగ విధి కావచ్చు. అందరినీ సమానంగా చూసే రాజ్యాంగం. వీడియో 9 నుండి 15 సెకన్ల మధ్య, పడిపోయిన, చనిపోయిన వ్యక్తిపై అనేక మంది పోలీసులు విరుచుకుపడ్డారు. కర్రలతో కొట్టడం. కాల్పుల శబ్దాలు కూడా వస్తున్నాయి. ప్రజల గొంతులు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ని కాపాడే ప్రతిదాన్ని చెరిపేసే ఈ ప్రకరణలో ఒక కెమెరా పూర్తి ప్రక్రియను అదృశ్యమైపోకుండా చిత్రిస్తోంది. ఆ కెమెరా కొంత దగ్గరికి రాగానే కొంతమంది పోలీసులు కెమెరా నుండి పక్కకు వెళ్లిపోతారు.

ఒకతను అబ్బాయిలా కనిపిస్తాడు. అతను యూనిఫాంలో లేడు. బెల్ట్ సహాయంతో ఒక బ్యాగ్ అతని భుజం నుండి వేలాడుతోంది. అతను తన మెడకు తెలుపు, ఎరుపు రంగు గమ్‌చాను చుట్టుకున్నాడు. ఈ గమ్‌చా అస్సాం గుర్తింపు. ఈ అబ్బాయి చేతిలో కెమెరా కూడా ఉంది. ఇప్పటివరకు వీడియో 26 సెకేండ్లు అయింది. పోలీసుల, ఈ బాలుడి క్రూరత్వాన్ని ఒక్కో ఫ్రేమ్‌లో చూడగలిగేలా పాజ్ చేసాను. యూనిఫామ్ లేని యువకుడు శవం వైపు వేగంగా పరుగెత్తుతాడు, చనిపోయిన వ్యక్తి ఛాతీపై దూకాడు. చాలా ఎత్తు నుండి దూకుతాడు. ఒలింపిక్స్‌లో ఎవరో ఇలా దూకడం నేను చూశాను. పేరు గుర్తులేదు. అయినా పేరు ఎవరు చూశారు? దుంకిన తర్వాత బాలుడు త్వరగా కెమెరా వైపు తిరుగుతాడు. అప్పుడు ఒక సైనికుడు తన లాఠీతో చనిపోయిన వ్యక్తిని కొట్టాడు. చనిపోయిన వ్యక్తి ప్రతీకారం తీర్చుకోడు. చనిపోయిన వ్యక్తిని కొట్టాడు. కెమెరాతో ఉన్న వ్యక్తి తనను తాను సిద్ధం చేసుకుని ఈసారి మెడ మీద దూకుతాడు. కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కు తిరిగి చనిపోయిన వ్యక్తి దగ్గరికి చేరుకుని ఈసారి అతని ఛాతీని పిడికిలితో కొట్టాడు. అలా కొట్టకుండా ఒక పోలీసు అతన్ని ఆపుతాడు. అక్కడి నుండి పక్కకి జరుపుతాడు. యిప్పటివరకు వీడియో 35 సెకన్లు అయింది.

ఇప్పుడు పోలీసులందరూ కెమెరా ఫ్రేమ్‌కు దూరంగా ఉన్నారు. ఇంత జరిగినప్పటికీ రికార్డింగ్ కెమెరా పట్టుకున్న చేతిలో వణుకు లేదు. స్థిరంగా ఉంది. కాల్పుల శబ్దాలు వస్తున్నాయి. చాలా మంది అరుస్తున్న శబ్దాలు కూడా వెనుక నుండి వస్తున్నాయి. అక్కడ ఒక శవం పడి ఉండటం కనిపించింది. పడిపోయే ముందు విశ్రాంత భంగిమలో ఉండటానికి సాధన చేస్తున్నట్లుగా. మరో వ్యక్తి మృతదేహం వైపు నడుస్తూ కనిపించాడు. అతను జీన్స్ ప్యాంటు వేసుకొని వున్నాడు. పూర్తి చేతుల చొక్కా. యూనిఫాంలో లేడు. రికార్డింగ్ చేసే అతను. అతని భుజం నుండి ఒక బ్యాగ్ వేలాడుతోంది. ఇదంతా రికార్డ్ చేస్తున్న కెమెరా శవం వైపు కదులుతుంది, శవం వద్ద ఆగుతుంది. 46 సెకన్లు గడిచాయి.

అతని మరణం ఇప్పుడు అన్ని సందేహాలకు అతీతమైంది. ఆ వ్యక్తి బనియన్ వేసుకున్నాడు. కుర్తా పోలీసులతో పరుగులో ఎక్కడో పడిపోయుంటుంది లేదా అతను ఇంట్లోనే చొక్కా వదిలేసి ఉండాలి. అతని ఛాతీపై ఒక గుండ్రని వలయం కనిపిస్తుంది. దీనిలో ఎవరో ఎరుపు రంగును నింపారు. బుల్లెట్ ఛాతీలో రంధ్రం చేసుకొని దాటినట్లు కనిపిస్తోంది. రక్తం చిందినట్లు కూడా కనిపించదు. అతడిని చంపడానికి అవసరమైనంత వరకు బుల్లెట్ గుచ్చుకుంది. రక్తపు మరకలు కాకుండా, బనియన్ శుభ్రంగా సురక్షితంగా ఉంటుంది. అది ఏ కంపెనీ బనియనో దూరం నుండి తెలియదు. అతని లుంగీ పై వరకు మడచి ఉంది. ఆకుపచ్చ రంగులో ఉంది. ఎడమ కాలులో రక్తం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. తల దగ్గర ఒక గమ్‌చా పడివుంది. ఇప్పటివరకు వీడియో 52 సెకన్లు అయింది.

54 సెకన్లు అయిన వెంటనే, అదే వ్యక్తి అధిక వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి చనిపోయిన వ్యక్తి ఛాతీపై బలంగా దూకుతాడు. అతను ఎంత వేగంగా వచ్చి దూకుతాడంటే తానే కింద పడిపోతాడు. మళ్లీ తిరిగి వచ్చి అతని ఛాతీపై గట్టిగా కొట్టాడు. అతడిని ఆపడం లాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వీడియో కూడా 59 సెకన్లు అయింది. ఒక పోలీసు మృతదేహంపైకి ఎగిరెగిరి ఆ వ్యక్తిని తన్నాడు, పిడిగుద్దులు కురిపిస్తున్న వ్యక్తిని దూరం తీసుకెళ్తాడు. శవం ఒంటరిగా పడి ఉంది. 1 నిమిషం 12 సెకన్లు అయింది.

ఈ 1 నిమిషం 12 సెకన్ల వీడియో చూడవచ్చు. నేను చూడలేనేమో అని అనుకున్నాను. మీరు కూడా చూడవచ్చు. మీరు ప్రతిరోజూ ఇలాంటి వీడియోలను తప్పక చూస్తూ ఉండాలి.

దీనిలో ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. పోలీసులు ప్రజలను చంపేస్తున్నారు. మీరు ఇప్పటికే చనిపోయున్నారు. పోలీసులు చూసేవాళ్లని చంపుతున్నారని మీరు గ్రహించలేరు. ఈ విధంగా చనిపోవడం ఎవరి వంతైనా కావచ్చునని ఇది చెబుతోంది.

అస్సాం పోలీసుల ప్రకారం, మీరు వీడియోలో చూసిన చనిపోయిన వ్యక్తి ఒక వృద్ధుడి నుండి రూ .75,000 లాక్కొని పారిపోతుంటే పోలీసులు అతడిని పట్టుకున్నారు కానీ పోలీసుల అదుపు నుండి కూడా తప్పించుకునేసరికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. అతడిని చికిత్స కోసం నాగావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రూ.56000 రికవరీ చేశారు. ఈ సమాచారం మొత్తం న్యూస్ ఏజెన్సీ PTI నుండి దొరికింది. పోలీసు స్టేట్‌మెంట్ అవసరం అవుతుంది. మీరు వీడియోలో చూసినది అబద్ధం కావచ్చు. నిజం చెప్పడానికి పోలీసులకు మాత్రమే లైసెన్స్ ఉంది.

ఈ దేశంలో కోర్టు ఉంది. అనేక రకాల న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టం వుంది. చట్ట ప్రక్రియ వుంది. మీరందరూ అలా నమ్మాలి. పోలీసులు చెప్పినదే నమ్మండి. లేకపోతే మీరు 1 నిమిషం 12 సెకన్ల నిడివికన్నా తక్కువ వీడియోలో మీ సంగతి చూస్తారు. యిది విశ్వ గురువు భారతదేశం.

నేను వీడియో షేర్ చేయలేదు. మహత్తర ఫేస్ బుక్ కమ్యూనిటీ నియమాలను ఉల్లంఘించడం సరికాదు. రాజ్యాంగ నియమాలు ఇలా ఉల్లంఘించబడుతున్నప్పుడు, ఫేస్‌బుక్ కమ్యూనిటీ నియమాలను రక్షించడంలోనే ప్రతి ఒక్కరి రక్షణ ఉంటుంది. అంబేద్కర్ జయంతిని జరుపుకునేటప్పుడు మనం రాజ్యాంగం మినహా సమాజ నియమాలను పాటిద్దాం. ఆమెన్. జై హింద్.

(NDTV జర్నలిస్టు రవీష్ కుమార్ ఫేస్ బుక్ నుంచి)
అనువాదం : పద్మ కొండిపర్తి

Keywords : assam, police firing, Man Beaten With Sticks,
(2024-04-21 02:44:38)



No. of visitors : 2948

Suggested Posts


ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్

ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్‌ త్వరగా పూర్తవుతుందని అన్నారు...

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.

అస్సాం జనాభా 3.3 కోట్లకి పైమాటే. అందులో 3.29 కోట్ల మంది ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పత్రంలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3.11 కోట్ల మంది పేర్లు ముఖ్య జాబితాలో చేరాయి. మిగతావి తిరస్కరనకి గురయ్యాయి. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నలభై లక్షల ఏడు వేల ఏడు మంది పేర్లు ఉన్నాయి.

మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్ కుమార్ భట్టాచార్జీ ఎలియాస్ కాంచన్ దా ను అస్సాంలోని కాచర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.

Assam: ఇళ్ళు ఖాళీ చేయాలని ప్రజలపై పోలీసుల దాడి ‍- పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి !

అస్సాంలో దరాంగ్‌ జిల్లా ధోల్పూర్‌ రణరంగంగా మారింది. 1970ల నుండి ధోల్పూర్ ఉంటున్న ప్రజలపై గురువారంనాడు దాడులు చేసిన పోలీసులు వాళ్ళ ఇళ్ళను కూల్చి వేశారు. అడ్డుచెప్పిన ప్రజలను లాఠీలతో చితకబాదారు. పోలీసులు ప్రజల వెంటపడి మరీ కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకవైపు ఇళ్ల కూల్చివేత, మరో వైపు తమ‌పై పోలీసుల దాడి స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు

అవును మేము గుండాలమే హిందువులు చర్చిలకు వెళ్తే దాడులు చేస్తాం....భజరంగ్ దళ్ నేత‌

ʹʹఅవును మేము గుండాలమే చర్చిలకు వెళ్ళే హిందువుల మీద దాడులు చేస్తాంʹʹ అని అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత మిథు నాథ్ రెచ్చిపోయాడు. కాచర్ జిల్లా సిల్‌చార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిథు నాథ్ ఈ విధమైన గుండా భాషను మాట్లాడాడు.

సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !

మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు 50 మందికి పైగా గాయపడ్డారు. అసోం, కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ కూడా గాయాలపాలయ్యారు. అస్సాం పోలీసులు తమపై గ్రైనేడ్లు ప్రయోగించడం వల్ల తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని మిజోరాం పోలీసులు తెలిపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇది