అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు


అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

అవును,దళిత

26-09-2021

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఆమె చనిపోయిన తర్వాత బలవంతంగా దహనం చేయడానికి ముందు, నిందితులు ఈ విషయం తమ‌తో స్పష్టంగా చెప్పారని సాక్షులను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఈ నెల ఆగస్టులో ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓల్డ్ నంగాల్ లో ఒక శ్మశానవాటికలో శ్రాద్ద కర్మలునిర్వహించే పూజారి పూజారి రాధే శ్యామ్, మరో ముగ్గురు కుల్దీప్ సింగ్, లక్ష్మీ నారాయణ్, సలీం అహ్మద్ లు ఓ దళిత బాలికపై అత్యాచారం చేసి హత్యచేసి దహనం చేశారు. ఈ కేసులో ఇద్దరు సాక్షులు కోర్టుకు వాగ్మూలం ఇచ్చారు. ఆ బాలిక దళిత్ అవ్వడం వల్లనే అత్యాచారం చేసి చంపేసినట్టు తమతో చెప్పారని సాక్షులు స్పష్టం చేశారు.

ʹʹఒక స్థానిక నివాసి నుండి ఆ రోజు సాయంత్రం ఫోన్ కాల్ ద్వారా ఈ సంఘటన గురించి తెలుసుకున్నాను. అతను ఒక దళిత బాలికను అత్యాచారం చేశారని, ఆమె శరీరాన్ని దహనం చేశార‌ని చెప్పాడు. నేను శ్మశానవాటికకు చేరుకున్నాను, అక్కడ జనం గుమిగూడారు. మృతదేహం పైర్ మీద కాలిపోతోంది. నలుగురు నిందితులు పూజారి రాధే శ్యామ్ (55) కుల్దీప్ సింగ్ (63), లక్ష్మీ నారాయణ్ (48) మరియు సలీం అహ్మద్ (49) నా సహాయం కోరారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశామని చెప్పారు. ఎందుకలా చేశారని నేను ప్రశ్నించినప్పుడు ఆమె దళిత బాలిక కాబట్టే అలా చేశాం అని పూజారి శ్యామ్ మరియు కుల్దీప్ చెప్పారు ʹʹ అని మొదటి సాక్షి కోర్టుకు తెలిపారు.

ʹʹఇతరులతో కలిసి, కాలిపోతున్న మృతదేహంపై నీటిని పోయడానికి ప్రయత్నించాను. కాని పోలీసులు మాపై లాఠీ ఛార్జ్ చేశారు. స్థానిక ఎసిపి, ఎస్‌హెచ్ఓ, కేసు యొక్క ఐఓ సంఘటన స్థలంలో ఉన్నారుʹʹ అని సాక్షి తెలిపాడు.

రెండవ సాక్షి కోర్టులో తన వాగ్మూలం ఇస్తూ తనకు దాదాపు ఐదు సంవత్సరాల పాటు బాధితురాలిని తెలుసునని చెప్పాడు.ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటన గురించి అతనికి మరో వ్యక్తి ఫోన్ చేసి కూడా చెప్పాడు. అతను శ్మశానవాటికకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న‌ సలీమ్‌ను గుర్తించాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా అమ్మాయిని ఎందుకు దహనం చేస్తున్నారని సలీమ్ ను ఈ సాక్షి అడిగాడు. అప్పుడు ఆ నిందితులు అతడిని జనం నుంచి దూరంగా తీసుకెళ్ళి, తాము బాలికపై అత్యాచారం చేశామని, పొరపాటున ఆమెను దహనం చేశామని చెప్పారు.

స్మశానంలో ఉన్న కూలర్ నుంచి నీళ్లు తెచ్చుకునే సమయంలో విద్యుదాఘాతంతో బాలిక మరణించిందని నిందితులు ముందు దబాయించారు.తల్లితండ్రులు అడ్డుకుంటున్నా వినకుండా బాలికను దహనం చేశారు.

ప్రధాన నిందితుడు పూజారి రాధే శ్యామ్ పోలీసులకు ఇచ్చిన ప్రకటన ప్రకారం... గతంలో కూడా ఈ బాలిక లైంగిక వేధింపులకు గురైందని, శ్యామ్ మరియు కుల్దీప్ అత్యాచారం చేయగా ఆమె ఊపిరాడక చనిపోయిందని పోలీసు చార్జ్ షీట్ పేర్కొంది. నిందితులు బాలికను దహనం చేసి, నేరం సమయంలో ఉపయోగించిన బెడ్‌షీట్, అశ్లీల కంటెంట్ చూడటానికి శ్యామ్ ఉపయోగించిన మొబైల్ ఫోన్, ఆ బాలిక‌ వస్తువులు వంటి కీలకమైన సాక్ష్యాలను తగలబెట్టేశాడు.

Keywords : delhi, dalit girl rape case, Accused raped 9-year-old because she was Dalit: Delhi police chargesheet quotes witnesses
(2021-12-05 01:58:04)No. of visitors : 1692

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రి

ʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని.....

Search Engine

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
more..


అవును,దళిత