UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.


UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.

UP

19-10-2021

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మాట్లాడారు. లఖింపూర్ ఖేరీ హింస జరిగిన వెంటనే అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందని. అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవిలో ఉండే అర్హత లేద‌ని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారును ఎక్కించి నలుగురు రైతులను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో తన కుమారుడిని రక్షించడానికి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మాలిక్, కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమానికి మద్దతుగా కూడా మాట్లాడారు.
అగ్రి చట్టాలపై రైతుల డిమాండ్లను ఒప్పుకోకపోతే మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని గవర్నర్ అన్నారు. రాజస్తాన్ లోని ఝున్ ఝున్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై చట్టపరమైన హామీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరిస్తే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని మాలిక్ అన్నారు.

ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజల బాధను చూడలేకపోతున్నారని మాలిక్ అన్నారు. "రైతుల మాట వినకపోతే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదు" అని మాలిక్ అన్నారు.

అతను ఇంకా ఇలా చెప్పాడు, "మొత్తం సమస్యను పరిష్కరించేది ఒక్కటే. ప్రభుత్వం MSP హామీని ఇవ్వడానికి అంగీకరిస్తే, నేను మధ్యవర్తిత్వం వహించి రైతులను ఒప్పిస్తాను."

రైతు సమస్యను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోయిందని అడిగినప్పుడు, అధికారం పొందిన వారు అహంకారంతో ఉంటారని ఆయన అన్నారు.

"ప్రతిదీ నాశనమయ్యే వరకు వారు దీనిని గ్రహించలేరు," అని అతను చెప్పాడు.
"ప్రభుత్వమే అహంకారం కాదు కానీ సలహాలు ఇచ్చేవారు,వారికి సన్నిహితంగా ఉండేవారు వారికి సరైన సలహా ఇవ్వడం లేదు." అని వ్యాఖ్యానించారు గవర్నర్ మాలిక్.

ఈ ఏడాది మార్చిలో కూడా ఆయన రైతులకు మద్దతుగా గళమెత్తారు. ఉద్యమకారులను బాధించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షాను కోరారు. తాను రైతుల పక్షమే ఉన్నానని, వారి సమస్యలపై ప్రధాని మరియు కేంద్ర హోం మంత్రితో కూడా పోరాడానని చెప్పారు.

"నేను రైతులతో ఉన్నాను. నేను వారి కోసం ప్రధాన మంత్రి మరియు హోం మంత్రితో పోరాడాను. వారు చేస్తున్నది తప్పు అని నేను అందరికీ చెప్పాను మరియు వారు ఇలా ప్రవర్తించకూడదు" అని మాలిక్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికలపై రైతుల ఆందోళన ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు బదులిస్తూ, రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పగలరని, అయితే మీరట్, బాగ్‌పత్ మరియు ముజఫర్‌నగర్‌లోని ఏ గ్రామంలోనూ బీజేపీ నాయకులు ప్రవేశించలేరని మాలిక్ అన్నారు.

Keywords : farmers protest, uttar pradesh, farmers murder, ajay mishra, ashish mishra, Meghalaya Governor Satya Pal Malik, Meghalaya Governor Says Minister Should Resign Over Farmersʹ Killing In UP
(2021-12-03 19:34:46)No. of visitors : 197

Suggested Posts


దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

Search Engine

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
more..


UP