UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌


UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌

UP:సాయంత్రం

24-10-2021

స్త్రీలు రాత్రి పూట పోలీసు స్టేషన్ కు వెళ్ళొద్దని చెప్పిందో నాయకురాలు. సాయంత్రం 5 దాటిన తర్వాత వెళ్ళొద్దంటూ తోటి మహిళలను హెచ్చరించిందా నాయకురాలు. ఎక్కడైనా ప్రతిపక్షపార్టీల నాయకులు, నాయకురాళ్ళు ఇలా మాట్లాడటం సహజమే కదా అని తీసిపారేయకండి. ఇలా మాట్లాడింది ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకురాలే.

యూపీలోని వారణాసి లో శుక్రవారం నాడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ బేబీ రాణి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ...ʹʹలేకిన్ ఏక్ బాత్ మెయిన్ జరూర్ కహుంగీ. పాంచ్ బాజే కే బాద్, అంధేరా హోనే కే బాద్, కభి థానే మత్ జానా. ఫిర్ అగ్లే దిన్ సుబహ్ జానా. జావో తో అప్నే ఘర్ సే కిసి కో భాయ్ కో, అప్నే పతి, అప్నే పితా కో సాథ్ లే కర్ జాన అగర్ జరూరీ హో....ʹʹ ( అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత, చీకటి పడినప్పుడు, పోలీసు స్టేషన్‌కు వెళ్లవద్దు. తర్వాతరోజు ఉదయం సందర్శించండి. ఉదయం వెళ్ళినా, మీ కుటుంబంలోని మీ సోదరుడోడు, భర్తో లేదా తండ్రో ఎవరో ఒక మగతోడు తీసుకొని వెళ్ళండి.) అని అన్నారామె.

బేబీ రాణి మాట్లాడిన ఈ వీడియోను సమాజ్ వాదీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. యోగీ ఆదిత్యానాథ్ పాలనలో జంగిల్ రాజ్ నడుస్తోందని వాళ్ళ పార్టీ నాయకురాలి మాటలే స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.

ఈ వీడియో వైరల్ అయ్యాక బేబీ రాణి స్పందించారు. తాను అలా మాట్లాడలేదని అన్నారామె.

"ఆ వీడియోతో నాకు పెద్దగా సంబంధం లేదు. వాల్మీకి జయంతి సందర్భంగా నేను నిన్న వారణాసిలో ఉన్నాను, దళిత మహిళలు, ముస్లిం మహిళలు హాజరైన ఒక దళిత గ్రామంలో నేను వారికి మోదీ మరియు యోగి ప్రభుత్వాలు సాధించిన విజయాలు, ఇద్దరూ మహిళల కోసం ఎలా పని చేస్తున్నారో మరియు వారి ఉద్ధరణ, గౌరవం మరియు భద్రత గురించి చెప్పాను. త్వరితగతిన న్యాయం పొందడానికి కోర్టులు ఎంత వేగంగా ట్రాక్ చేస్తున్నాయనే దాని గురించి నేను మాట్లాడాను, ʹఅని మాజీ గవర్నర్ బేబీ రాణి అన్నారు.

"యోగి ప్రభుత్వ హయాంలో మహిళలు చాలా సురక్షితంగా ఉన్నారని నేను ఈరోజు కూడా పునరుద్ఘాటిస్తున్నాను, వారు రాత్రి 11 గంటలకు పిజ్జా, బర్గర్లు తినవచ్చు. ఆ ప్రాంతంలోని ముస్లిం మహిళలు కూడా తమకు మద్దతు ఇస్తున్నందువల్ల సమాజ్‌వాదీ పార్టీ భయాందోళనలో ఉంది. నా ప్రసంగంలో ఏ భాగాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారో నాకు తెలియదు. " అని ఆమె అన్నారు.

తామే ఆ వీడియోను ఎడిట్ చేశామని, వైరల్ చేశామన్న బేబీ రాణీ ఆరోపణలను సమాజ్ వాదీ పార్టీ ఖండించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ వీడియో తాము ఎడిట్ చేయలేదని చెప్పిన ఆయన వీడియోను వైరల్ చేసింది నెటిజనులే అని తాము కాదన్నారాయన.

Keywords : uttar pradesh, Police Station, Women, Bebi Rani, ʹWomen should not visit police stations after darkʹ: BJP leader claims ʹmisquotedʹ
(2021-12-03 19:33:01)No. of visitors : 190

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


UP:సాయంత్రం