ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ
25-10-2021
అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ @ RK సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారంనాడు జరిగింది. అమరులు, రామకృష్ణ కుమారుడు పృథ్వి @ మున్నా 5వ వర్ధంతి, ఆర్కే , ఆలకూర పాడు గ్రామానికే చెందిన దత్తాత్రేయ, జయరాజుల సంస్మరణ కార్యక్రమంగా ఈ సభ జరిగింది. తమ ప్రియమైన నాయకులను సంస్మరించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల నుండి వందలాది ప్రజలు తరలిరాగా వాళ్ళను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వందలాది మంది పోలీసుల నిఘా మధ్య ఈ సభ సాగింది. ఆలకూర పాడుకు నాలుగు వైపులా దారులను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు చుట్టు పక్కల గ్రామాల నుండి సభకు వస్తున్న ప్రజలను అడ్డుకున్నారు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి గానీ సభకు వెళ్ళడానికి అనుమతించలేదు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరయ్యారు.
సభ సందర్భంగా గ్రామమంతా ఎర్రజెండా రెపరెపలతో, అమరుల పోస్టర్లతో నిండి పోయింది. ఊరు ఊరంతా అమరులకు జోహార్లు చెబుతూ నినాదాలతో దద్దరిల్లింది. తొలుత ఆర్కే కుమారుడు మున్నా, గ్రామానికి చెందిన దత్తాత్రేయ, జయకుమార్ సమాధుల వద్ద వారి కుటుంబసభ్యులతోపాటు అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, గ్రామస్థులు నివాళులర్పించారు. అనంతరం స్థూపం వద్ద జెండా ఎగురవేసి, సంస్మరణ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సభలో మాట్లాడిన రామకృష్ణ సహచరి శిరీష ,ʹభర్త, కొడుకు.. ఇద్దరికీ ఒకేరోజు సంస్మరణ సభ నిర్వహించడం వేదన కలిగిస్తోంది. కానీ, ప్రజల కోసం వారు అమరత్వం సాధించినందుకు గర్వపడుతున్నా. ఆర్కే ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళిʹʹ అని ఉద్వేగంగా మాట్లాడారు.
ఆర్కే తమ్ముడు సుబ్బారావు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు గురువు అన్నయ్యేనని గుర్తు చేసుకున్నారు. ఉద్యమాల పట్ల ఆకర్షితుడై ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో పోరాట పంథాను ఎంచుకుని అమరుడైనందుకు గర్వపడుతున్నానని చెప్పారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ అడవి మీద హక్కు ఆదివాసీలకే తప్ప దోచుకునేవాళ్లకు కాదంటూ ఆదివాసీల హక్కుల కోసం తుదికంటా పోరాడిన వ్యక్తి ఆర్కే అన్నారు.
విరసం సభ్యుడు పినాకపాణి మాట్లాడుతూ ఆర్కే మరణంతో విప్లవోద్యమానికి దశ, దిశ ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ, వారి ఆశలు నెరవేరబోవన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ...ʹʹ నవయవ్వన అమర వీరులు ఈ ప్రపంచాన్ని తమ రెండు చేతులతో మార్చివేయగలమనే సాహసాన్నీ, తెగువనూ ప్రదర్శించగల యువకులకు ప్రతినిధులైన ముగ్గురు అమర వీరులు కామ్రేడ్ దత్తాత్రేయ, కామ్రేడ్ జయరాజు, కామ్రేడ్ మున్నా వర్ధంతి సభగా, భారత విప్లవోధ్యమ నాయకుడు కామ్రేడ్ ఆర్కే సంస్మరణ సభను ఇక్కడ జరుపుకుంటున్నాం. నిజానికిది ఆలకూరపాడుకు సంబంధించింది మాత్రమే కాదు.యావత్ భారత దేశంలో ఒక అద్భుతమైన విప్లవోధ్యమ క్రమాన్ని నిర్మించి విప్లవోధ్యమాన్ని అనేక ఆటు పోటుల మధ్యనే అనేక సంక్షోభాల మధ్యనే లోపలా, బైట జరుగుతున్న దాడుల మధ్యనే విప్లవోధ్యమాన్ని పురోగమింపజేసిన వేలాదిమంది అమరవీరుల స్మారకంగా మనమిక్కడ ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కేవలమిది ఆలకూర పాడు అమరవీరుల సంస్మరణ సభ మాత్రమే కాదు. ఇది కేవల ఆర్కే సంస్మరణ సభ మాత్రమే కాదు. భారత విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం తమ ప్రాణాలని బలి ఇచ్చిన వేలాది మంది అమరుల త్యాగాలని మనమిక్కడ గుర్తు చేసుకుంటున్నాం.ʹʹ
ʹʹకామ్రేడ్ ఆర్కే ఈ గ్రామానికి చెందిన మనిషో లేకపోతే పల్నాడుకు చెందిన మనిషో , ఆయన విప్లవోధ్యమాన్ని నిర్మించిన నల్లమల కు చెందిన మనిషో , విప్లవోధ్యమాన్ని ఏవోబీ దాకా విస్తరించినందువల్ల ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు చెందిన మనిషో కాదు. ఆయన విశ్వ మానవుడు. ప్రపంచంలో శాంతిని సాధించడానికి , యుద్దం ద్వారా మాత్రమే శాంతిని సాధించగలం, ప్రజా యుద్దం ద్వారా మాత్రమే శాంతిని సాధించగలం, ప్రజా యుద్దం ద్వారా మాత్రమే భూస్వామ్యాన్ని, సామ్రాజ్యవాదాన్ని కూలదోయగలమనే మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టు అవగాహనకు అద్భుతమైన ప్రతినిధి కామ్రేడ్ ఆర్కే.ʹʹ
ʹʹఆర్కే మరణం రెండు తెలుగు సమాజాలను విషాదానికి గురి చేసింది. బహుశా ఆయన చిరునవ్వు వెలుగు ప్రసరించిన వాళ్ళందరినీ ఆయన మరణం విషాదానికి గురి చేసింది. అంతేకాదు ఆర్కే అనే ఒక విప్లవ మానవుడు గురించి విన్నవాళ్ళందరూ , విప్లవకారుల గురించి విన్నవాళ్ళందరూ ఆర్కే మరణంతో ధుంఖానికీ విషాదానికి గురయ్యారు.ʹʹ
ʹʹపీఎల్జీఏ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్కే తన సందేశంలో చెప్పినట్టు భారత దేశంలో విప్లవోధ్యమం అనేక ఓటములు చవిచూసింది. అనేక విజయాలు కూడా సాధించింది. ఇది మనం మర్చి పోతే ప్రస్తుత స్థితిని మాత్రమే చూసి నిరాశ చెందితే మనం విప్లవాన్ని అర్దం చేసుకోనట్టే. ఎన్ని ఓటములు ఎదురైన అంతిమ విజయం ప్రజలదే అన్న సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదిʹʹ అని పాణి తన ఉపన్యాసంలో చెప్పారు.
కార్యక్రమంలో విరసం నేత కల్యాణరావు,అరసవెల్లి కృష్ణ, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, భవాని, పౌరహక్కుల సంఘం నాయకుడు చిలకా చంద్రశేఖర్, చావలి సుధాకర్, సీపీఐ ఎంఎల్ నాయకురాలు లలిత, న్యూడెమోక్రసీ నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల కార్మిక సంఘం నేత కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Keywords : Ramakrishna, Akkiraju Haragopal, Martyr, pruthvi, Munna, prakasham, andhrapradesh, alakurapadu, memorial meeting
(2024-12-01 07:05:06)
No. of visitors : 1321
Suggested Posts
| పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకుని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు. |
| అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన
కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. |
| చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసంఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా |
| మేము ఏటికి ఎదురీదుతాం - రామకృష్ణ ఇంటర్వ్యూవిప్లవోద్యమాన్నీ విప్లవ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ష్రచార దాడి చేసేందుకు వాళ్లకు సామ్రాజ్యవాదుల నుండి ఆదేశాలు వున్నాయి. వాళ్ళకు త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం వుండదనే విషయం అర్ధం కాదు, అర్ధం చేసుకోరు కూడా. నిజమే వాళ్ళన్నట్లు మేము కొండను ఢీకొంటాం, పర్వతాలను తవ్వుతాం, ఏటికి ఎదురీదుతాం. |
| విప్లవంలో శాంతి నిర్వచనం -పాణిరెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. |
| RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్ లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. |
| ఆర్కే పుస్తకావిష్కరణ సభను అడ్డుకున్న పోలీసులు...రేపు మీడియాసమావేశం ఏర్పాటు చేసిన ఆర్కే సహచరి శిరీషఅనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు రామకృష్ణపై పుస్తకాన్ని ముద్రిస్తున్న హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ |
| ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పురామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు |