వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా


వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా

వరవరరావు

26-10-2021

ఎల్గార్ పరిషత్‍భీమా కోరేగావ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న విప్లవ‌ కవి వరవరరావు నవంబర్ 18 వరకు తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు మంగళవారం పేర్కొంది. బెయిల్ వ్యవధిని పొడిగించాలని, బెయిల్‌పై ఉన్న సమయంలో తన స్వస్థలమైన హైదరాబాద్‌లో ఉండేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తదుపరి వాయిదా వేసింది.

82 ఏళ్ల వరవర‌రావుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న హైకోర్టు వైద్యపరమైన కారణాలతో ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 5న లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్ళవాల్సి ఉంది. అయితే, బెయిల్ వ్యవధిని పొడిగించాలని కోరుతూ వీవీ తన న్యాయవాది ఆర్‌ సత్యనారాయణ, సీనియర్‌ న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌ ద్వారా గత నెలలో దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్‌పై ఉన్న సమయంలో తన స్వస్థలమైన హైదరాబాద్‌లో ఉండేందుకు హైకోర్టు అనుమతి కూడా కోరాడు.

అయితే, ఈ కేసులో దర్యాప్తు సంస్థ అయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), మెడికల్ బెయిల్ పొడిగింపు, హైదరాబాద్‌కు మారడం కోసం వీవీ చేసిన అభ్యర్థనను వ్యతిరేకించింది. వరవరరావు యొక్క వైద్య నివేదికలు అతను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సూచించడం లేదని పేర్కొంది.

గత నెలలో హైకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో, వీవీ దాఖలు చేసిన వైద్య నివేదికలలో ఎటువంటి పెద్ద అనారోగ్యం ఉన్నట్టుగా లేదని, దీని వల్ల హైదరాబాద్‌లో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ బెయిల్‌ను మరింత పొడిగించాలన్న ఆయన పిటిషన్ ను కొట్టివేయాలని NIA కోరింది.

మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ ఎస్.వి. సమయాభావం కారణంగా వీవీ పిటిషన్‌పై విచారణను వాయిదా వేశారు.

మెడికల్ బెయిల్‌పై బయట ఉన్న సమయంలో తన స్వగ్రామాని(హైదరాబాద్)కి వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని కూడా బెంచ్ వరవర‌రావును కోరింది.

హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై విధించిన కఠినమైన షరతులలో భాగంగా, వీవీ తన భార్యతో కలిసి ముంబైలోని అద్దె నివాసంలో ఉంటున్నాడు.

Keywords : BK16, BK15, Bhimakoregao,Elgar Parishad, Varavara Rao, mumbai high court
(2021-12-05 07:29:58)



No. of visitors : 314

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
more..


వరవరరావు