అనంతపురంలో పోలీసుల దాష్టీకం - విద్యార్థులపై లాఠీచార్జ్
08-11-2021
అనంతపురం నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్ విద్యా సంస్థను ఎయిడెడ్ విద్యాసంస్థగానే కొనసాగించాలని కోరుతూ సోమవారం నాడు శాంతియుతంగా ఆందోళన దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. కళాశాల క్యాంపస్‌లోకి చొరబడి మరీ దాడి చేశారు. విద్యార్థులను, విద్యార్థి నాయకులను చొక్కాలు పట్టుకొని లాక్కెళ్లి పోలీసుల జీపుల్లో పడేశారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేశారు. పోలీసుల చర్యతో ఒక విద్యార్థిని గాయపడింది.
విద్యార్థులపై దాష్టీకాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎస్‌ఎస్‌బిఎన్ విద్యా సంస్థ ఎయిడెడ్ నుంచి ప్రైవేట్‌కు మారేందుకు సమ్మతి తెలిపింది. ఈ విద్యా సంస్థలో హైస్కూల్ నుంచి డిగ్రీ వరకూ విద్యను అందిస్తున్నారు. ఈ సంస్థ ప్రైవేట్‌పరం అయితే ఫీజులు భరించలేమని, ఎయిడెడ్‌లోనే కొనసాగించాలని కోరుతూ ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఆ విద్యాసంస్థ ప్రాంగణంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. విద్యార్థులను కనికరం లేకుండా విచక్షణా రహితంగా వ్యవహరించారు. విద్యార్థుల కాలరు పట్టుకుని, ముష్టిఘాతాలు కురిపించారు. బలవంతంగా లాక్కొంటూ తీసుకెళ్లి పోలీసు జీపుల్లో కుక్కారు. కనబడిన విద్యార్థినల్లా అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధపడగా విద్యార్థులంతా అడ్డుకున్నారు.
దీంతో, పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలో కళాశాలకు చెందిన హేమ అనే విద్యార్థిని తలకు బలమైన గాయమైంది. వెంటనే సహ విద్యార్థులు ఆమె తలకు చున్నీ చుట్టి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు ఆ విద్యార్థినిని తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థిని తలకు నాలుగు కుట్లు పడ్డాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు మనోహర్‌తోపాటు మరో ముగ్గురు విద్యార్థులను పోలీసులు వాహనంలో బలవంతంగా ఎక్కించి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై డిఎస్‌పి వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు సాయంత్రం విడుదల చేశారు.
ఫీజులు పెరిగితే కట్టలేం : విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు చెందిన తాము ఫీజులు పెరిగితే కట్టలేమని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా పలువురి విద్యార్థినులు మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌కు ఇప్పటి వరకు రెండు వేల రూపాయలు ఫీజు చెల్లించే వారమని, ఇప్పుడు రూ.12 వేలకుఫీజు పెంచుతున్నట్లు కళాశాల యాజమాన్యం చెబుతోందని తెలిపారు. డిగ్రీకి ఏడాదికి ఐదు వేలు ఫీజులు ప్రస్తుతం చెల్లిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి రూ.20 వేలకు పైగా పెరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమ తల్లిదండ్రులు ఇప్పుడున్న ఫీజులే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని, వీటిని మరింత పెంచితే తాము చదువులు మానేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి తమ నోరు నొక్కే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
లాఠీఛార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం
విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విద్యార్థులపై అమానుషంగా లాఠీ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకపక్క ఎయిడెడ్ కాలేజీలను కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతూనే, మరోపక్క ఇందుకోసం పోరాడుతున్న విద్యార్థుల తలలు పగలకొట్టడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎయిడెడ్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందనా లేదని, తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని, అవసరమైన నిధులు, టీచింగ్ స్టాఫ్‌ను ఇవ్వాలనిడిమాండ్ చేశారు.
(ప్రజాశక్తి సౌజన్యంతో...)
Keywords : andhrapradesh, ananthapur, students, police, lathi charge
(2022-06-27 20:24:59)
No. of visitors : 323
Suggested Posts
| లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపువిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల |
| తిరుమలలో పోగుబడ్డ ఆస్తులెవరివి ?ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో |
| మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు. |
| నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే |
| గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట !
గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. |
| విశాఖ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు
12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై |
| డేటా చౌర్యంలో దోషులెవరు ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్ (6) ద్వారా ఎన్నికల
నోటిఫికేషన్ (మార్చ్ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది. |
| రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం |
| రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ
కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది. |
| జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..