SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌

SKM:ఉద్యమం

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన నేపథ్యంలో రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా SKM విడుదల చేసిన ప్రకటన‌

359వ రోజు, 20 నవంబర్ 2021

samyukta kisan morcha press Relrase భారత ప్రభుత్వం న్యాయబద్ధమైన అన్ని డిమాండ్లను నెరవేర్చే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా SKM జరగబోయే అన్ని కార్యక్రమాలలో శాయ శక్తులా, చురుకుగా పాల్గొనాలని, నవంబర్ 22 న లక్నోలో జరగబోయే కిసాన్ మహాపంచాయత్‌ను విజయవంతం చేయాలని, నవంబర్ 26న చారిత్రాత్మక ఉద్యమ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని సమావేశ స్థలాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని నిరసన తెలుపుతున్న రైతులకు విజ్ఞప్తి చేసింది. నవంబర్ 29 నుండి అనుకున్న ప్రకారం పార్లమెంట్ మార్చ్ నిర్వహించబడుతుందని SKM ప్రకటించింది.

సంయుక్త కిసాన్ మోర్చా SKM ప్రకటన పూర్తి పాఠం...

భారత ప్రధాని మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు కానీ, రైతుల పెండింగ్ డిమాండ్లపై మౌనం వహించారు. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 670 మందికి పైగా రైతులు అమరులయ్యారు. భారత ప్రభుత్వం వారికి నివాళులర్పించడం మాట అటుంచి కనీసం వారి త్యాగాలను కూడా గుర్తించలేదు. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలలో వేలాది మంది రైతులను వందలాది తప్పుడు కేసుల్లో ఇరికించారు.

తప్పుడు కేసులను కొట్టివేయాలి
నిన్న హంసీలో రైతులు మళ్లీ విజయం సాధించారు
సంయుక్త్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు ఉద్యమం చేస్తున్న డిమాండ్‌లన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది. ముందుగా అనుకున్న ప్రకారం ప్రకటించిన కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి, నవంబర్ 22వ తేదీన లక్నోలో జరిగే కిసాన్ మహాపంచాయత్‌కు రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2021 నవంబర్ 26 న ఢిల్లీ సరిహద్దుల వెంబడి నిరంతర శాంతియుత నిరసనలు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ మోర్చా ప్రదేశాలకు చేరుకోవాలని ఉత్తర భారత రాష్ట్రాల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా, సుంకం వసూలు నుండి మినహాయింపు పొందిన టోల్ ప్లాజాల్లో అదే విధానం కొనసాగుతుంది.

నవంబర్ 26న మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీకి దూరంగా వున్న వివిధ రాష్ట్రాలలో యితర నిరసన ప్రదర్శనలతో పాటు రాజధానులలో ట్రాక్టర్, ఎడ్ల బండి కవాతులు నిర్వహించబడతాయి. 28వ తేదీన 100కు పైగా సంస్థలతో సంయుక్త్ శేత్కారీ కామ్‌గర్ మోర్చా ఆధ్వర్యంలో ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ కిసాన్-మజ్దూర్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. నవంబర్ 29 నుండి, ప్రతిరోజూ 500 మంది నిరసనకారుల ట్రాక్టర్ ట్రాలీల పార్లమెంటు యాత్ర శాంతియుతంగా, క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ప్రకారం కొనసాగుతుంది.

మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోని ముఖ్యమైన డిమాండ్లు ఇంకా ఉన్నాయి. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధంగా ఇచ్చే కనీస మద్దతు ధర హామీ కోసం అనేక సంవత్సరాలుగా దేశంలోని రైతులు పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరసనలు జరిగాయి. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ప్రజా వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ కోసం, రాబోయే తరాలకోసం జీవన్మరణ పోరాటంలో నిరసనలు చేయవలసి వచ్చింది. సరైన కనీస మద్దతు ధర MSP కోసం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనే డిమాండ్ ప్రస్తుత ఉద్యమంలో అంతర్భాగం. అదేవిధంగా, ప్రస్తుత ఆందోళన కూడా విద్యుత్ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలో గాలి నాణ్యత నియంత్రణపై చట్టానికి సంబంధించిన శిక్షాస్పద సెక్షన్ల నుండి రైతులను మినహాయించాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 670 మందికి పైగా నిరసనకారులు తమ ప్రాణాలను అర్పించారు. మోడీ ప్రభుత్వం తన మొండి, అహంకార ప్రవర్తన కారణంగా నిరసనకారుల భారీ మానవ నష్టాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. ఈ అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో అమరవీరులకు నివాళులర్పించి, వారి పేరిట స్మారక చిహ్నం నిర్మించాలి. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, చండీగఢ్, మధ్యప్రదేశ్ మొదలైన వివిధ రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై వందలాది తప్పుడు కేసులు నమోదు చేసిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలి.

లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో రైతులను నిర్దాక్షిణ్యంగా చంపిన సూత్రధారి అజయ్ మిశ్రా టేనిపై న్యాయపరమైన చర్యలు చేపట్టకపోగా, మోడీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నాడు. నిజానికి రేపటి నుంచి లక్నోలో జరగనున్న డీజీపీ/ఐజీపీ వార్షిక సదస్సు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో అజయ్ మిశ్రా పాల్గొంటున్నాడు. రెచ్చగొట్టే రీతిలో, నవంబర్ 24న సంపూర్ణనగర్ చినీ మిల్లులో (గత సెషన్‌లో రైతులకు కనీసం 43 కోట్లు బకాయి ఉన్న సహకార మిల్లు) క్రషింగ్ సెషన్ ప్రారంభోత్సవానికి లఖింపూర్ ఖేరీ డీఎం ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

జిల్లా యంత్రాంగం స్థానిక రైతుల ఆందోళనకర మానసిక స్థితిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, లఖింపూర్ ఖేరీ మారణకాండలో నిష్పక్షపాతంగా న్యాయం కలిగేట్లు చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా శ్రద్ధ తీసుకుంటోందని కూడా తెలుసు. ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని DMకి సూచిస్తున్నాం. అజయ్ మిశ్రా టేనిని అరెస్టు చేసి కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం.

నిన్న హాన్సిలో రైతులు విజయం సాధించారు. హర్యానా రైతులు నిన్న ఎస్పీ కార్యాలయాన్ని ఘెరావ్ చేసిన తర్వాత, నిరసనకారుల డిమాండ్లకు అధికారులు అంగీకరించారు. గాయపడిన నిరసనకారుడు కుల్దీప్ రాణా చికిత్సకు పరిహారం, బంధువుకు ఉద్యోగం, MP PSOపై FIR నమోదు మొదలైన నిరసనకారుల డిమాండ్లపై చర్చించడానికి హిసార్ జిల్లా యంత్రాంగం ధర్నా నుండి ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించింది. కుల్దీప్ రాణా ఎలా గాయపడ్డాడో తెలుసుకునేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని, కుటుంబ సభ్యునికి ఉద్యోగం ఇస్తామని, తగిన వైద్యచికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు యితర ఖర్చులు కూడా యివ్వడానికి అంగీకరించాక ఘెరావ్ ముగించారు.

కర్నాటక నుండి SKM మోర్చా ప్రాంతాలకు ఒంటరిగా పాదయాత్ర చేస్తున్న నాగరాజు, నిన్న ఉత్తరప్రదేశ్‌లోని కోసి కలాన్ నుండి ఘాజీపూర్ చేరుకున్నారు, అక్కడ రైతులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
నిన్న భారత ప్రభుత్వ ప్రకటనను ఢిల్లీ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తమిళనాడు మొదలైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు ఉన్నాయి. కొంతమంది ముఖ్యమంత్రులు రైతుల పెండింగ్ డిమాండ్లను కూడా నెరవేర్చాలని నొక్కిచెప్పారు.

ప్రకటనకర్తలు
బల్బీర్ సింగ్ రాజేవాల్,
డా. దర్శన్ పాల్,
గుర్నామ్ సింగ్ చదుని,
హన్నన్ మొల్లా,
జగ్జిత్ సింగ్ దల్లేవాల్,
జోగిందర్ సింగ్ ఉగ్రహన్,
శివకుమార్ శర్మ (కక్కా జీ),
యుధ్వీర్ సింగ్
సంయుక్త్ కిసాన్ మోర్చా
ఇమెయిల్: samyuktkisanmorcha@gmail.com

Keywords : farmers protest, farmers laws, samyukta kisan morcha, SKM
(2024-04-24 23:05:32)



No. of visitors : 459

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

తీవ్రమైన రైతుల ఉద్యమం ‍- రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్

ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ‌ కేసులు బనాయించి అరెస్టు చే

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


SKM:ఉద్యమం