మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్

మావోయిస్టు

21-11-2021

సీపీఐ మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్‌ బోస్‌ అలియాస్‌ కిషన్‌ దా, ఆయన భార్య సెంట్రల్‌ కమిటీ సభ్యురాలు షీలా మరాండీ అరెస్టుకు నిరసనగా మావోయిస్టులు పార్టీ బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌లలో నవంబర్‌ 23 నుంచి మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు బీహార్ జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కమిటీ BJNCUP-SRC అధికార ప్రతినిధి మానస్ ఓ ప్రకటన విడుదల చేశారు.

నవంబర్ 13న మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 26 మంది మావోయిస్టు హత్యలపట్ల మానస్ తన ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలిపారు. మావోయిస్టు పార్టీ ఈ ప్రకటన విడుదల చేసిన సమయానికి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రీకాల్ చేస్తూ ప్రధాని ప్రకటనచేయలేదు.

ʹ75 ఏళ్ల కిషన్ దా మరియు 65 ఏళ్ల షీలా దీ అనేక‌ వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళిద్దరూ చికిత్సపొందుతుండగా బీహార్ రాష్ట్ర పోలీసులు, CRPF, NIA, IB సంయుక్తంగా దాడి చేసి వారిని అరెస్టు చేశారు. వాళ్ళిద్దరినీ హింసించారు. వాళ్ళిద్దరి శారీరక స్థితి పూర్తిగా క్షీణించిన దశలో వారి అరెస్టును ప్రకటించారు. ʹఅని మావోయిస్ట్ ప్రతినిధి మానస్ పేర్కొన్నారు.

కిషన్ దా 1960లలో సీపీఐ కు చెందిన విద్యార్థి సంఘంలో విద్యార్థి నాయకుడుగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టారని మానస్ తన ప్రకటనలో తెలియజేశారు. ʹకిషన్ దా తరువాత మావో జెడాంగ్ భావజాలాన్ని ప్రచారం చేయడానికి కామ్రేడ్ కన్హయ ఛటర్జీ (కెసి)తో కలిసి కామ్రేడ్ చారు మజుందార్ ఆధ్వర్యంలో 1967 నక్సల్బరీ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. తరువాత కామ్రేడ్ కెసి మార్గదర్శకత్వంలో కమ్యూనిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి అస్సాం వెళ్లారు. తర్వాత అవిభాజ్య బీహార్‌కు వచ్చి ధన్‌బాద్, హజారీబాగ్ మరియు గిరిద్ లలో చురుకుగా పనిచేశాడు. పక్కనే ఉన్న బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలలో ముందుండి ఉద్యమాన్ని నడిపించారుʹʹ అని ప్రకటనలో పేర్కొన్నారు.

2004లో ఏకీకృత CPI (మావోయిస్ట్) గొడుగు కిందకు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (MCCI), CPIML-పీపుల్స్ వార్ (PW) కలిసి CPI (మావోయిస్ట్) ఏర్పడటంలో కిషన్ దా పాత్ర చాలా కీలకమైనదని మానస్ తెలిపారు.

మావోయిస్టు పార్టీలో మహిళా శక్తిని నిర్వహించడంలో షీలా మరాండీ యొక్క సహకారాన్ని ప్రశంసించింది మావోయిస్టు పార్టీ. "ఆమె చిన్నతనంలోనే పార్టీలో చేరారు. పార్టీలో తన విద్యను పూర్తి చేశారు. తర్వాత ఆమె నారీ ముక్తి సంఘ్‌ను స్థాపించి పార్టీలో మహిళల చేరికకు మార్గం సుగమం చేశారు. ఆమె అంకితభావం కారణంగానే ఆమె సెంట్రల్ కమిటీ మెంబర్ (CCM) స్థాయికి ఎదిగిందిʹ అని మానస్ తన ప్రకటనలో తెలిపారు.
కిషన్ దా, షీలా దీ లను రాజకీయ ఖైదీలుగా పరిగణించాలని, వారి భద్రత, వైద్యం మరియు నిర్బంధంలో సరైన చికిత్స అందించాలని మావోయిస్టు పార్టీ BJNCUP-SRC అధికార ప్రతినిధి మానస్ డిమాండ్ చేశారు.

timesofindia.indiatimes.com సౌజన్యంతో

https://timesofindia.indiatimes.com/city/ranchi/maoists-call-for-three-day-bandh-in-four-states/articleshow/87806547.cms

Keywords : jharkhand, bihar, up, chattis garh, maoists, kishanda, sheela da
(2024-04-24 23:05:19)



No. of visitors : 1280

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావోయిస్టు