భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు


భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు

భారత్

21-11-2021

భారత దేశంలో మావోయిస్టులపై నూతన దాడి ప్రహార్౩ని చేపడుతున్న పాలకుల చర్యలకు వ్యతిరేకంగా, దేశంలో సాగుతున్న‌ ప్రజాయుద్ధానికి, సిపిఐ (మావోయిస్ట్)కు మద్దతుగానూ 2021 నవంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని ఇటలీకి చెందిన ʹభారతదేశ ప్రజా యుద్ధ మద్దతు కమిటీʹ పిలుపునిచ్చింది.

ఆ రోజు జరిగే ప్రచారోద్యమంలో చురుకుగా పాల్గొనాలని, ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంలో జాతీయ, స్థానిక పరిస్థితులను బట్టి భారతదేశ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, ఆ దేశ ప్రయోజనాలను కాపాడే ఇతర సంస్థల ముందు కార్యకలాపాలు చేబట్టాలని అంతర్జాతీయ శ్రామిక, విప్లవ, ప్రజాస్వామ్య సంస్థలకు కమిటీ విఙప్తి చేసింది.

ప్రకటన పూర్తి పాఠం....

"ప్రహార్ 3" అనే మారణహోమానికి వ్యతిరేకంగా, ప్రజాయుద్ధానికి మద్దతుగా నవంబర్‌ 24 న అంతర్జాతీయ ప్రచారానికి పిలుపు

భారతదేశంలోని ప్రజాయుద్ధానికి మద్దతు ఇచ్చే గలిజియా, ఇటలీలలోని కమిటీలు, మారణకాండ చర్య ప్రహార్-3కి వ్యతిరేకంగానూ, ప్రజాయుద్ధానికి, సిపిఐ (మావోయిస్ట్)కు మద్దతుగానూ 2021 నవంబర్ 24 న జరిగే ప్రచారోద్యమంలో చురుకుగా పాల్గొనాలని అంతర్జాతీయ శ్రామిక, విప్లవ, ప్రజాస్వామ్య సంస్థలకు పిలుపునిస్తున్నాయి.

భారతదేశంలో అణగారిన వర్గాల విముక్తి కోసం కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) నేతృత్వంలోని ప్రజా యుద్ధం ద్వారా జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ ప్రక్రియ అభివృద్ధి చెందుతోంది. పార్టీ నాయకత్వంలో ప్రజా మిలీషియా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మద్దతుతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ప్రధానంగా మధ్య, ఈశాన్య ప్రాంతాలలో, విముక్తి ప్రాంతాలలోని వేలాది గ్రామాలలో, విశాల ప్రజానీకంలో అత్యంత ఆదరణ పొందిన "జనతా సర్కార్" (ప్రజా విప్లవ సంఘాలు) ప్రజా ప్రభుత్వ పాలన జరుగుతోంది. ఇది ప్రపంచంలోని శ్రామికవర్గ, అణగారిన వర్గాలకు చాలా ఆశాజనకంగా ఉంది.

2021 నవంబర్ 24 నాటికి కామ్రేడ్ కిషన్‌జీని పిరికి పందలు హత్యచేసి పదేళ్లు పూర్తవుతుంది.

ఈ గత పదేళ్లలో పార్టీ, ప్రజాయుద్ధం తీవ్ర అఘాతాలనెదుర్కొంది. కానీ భారత ప్రభుత్వాలు ప్రారంభించిన అన్ని మారణకాండలను ఓడించగలిగింది కూడా. "గ్రీన్ హంట్" పేరుతో జరిగిన మారణకాండ భీభత్సం అందరికీ తెలిసిందే, అయితే విప్లవోద్యమం తగిన రాజకీయ, నిర్మాణపర, సైనిక వ్యూహాలతో దాన్ని ఎదుర్కొంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్రతిఘటనతో పాటు, ప్రజాందోళన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య మేధావులు, కళాకారులు, పాత్రికేయులు, విద్యార్థులు, కార్మికులు, రైతుల దృఢ సంకల్పం "గ్రీన్ హంట్" మారణహోమం ఆపడాన్ని సాధ్యం చేసింది.

ప్రజాయుద్ధాన్ని, సిపిఐ(మావోయిస్ట్) ని పూర్తిగా అణిచివేయాలనే ఉద్దేశ్యంతో ప్రహార్-3పేరిట మోడీ ఫాసిస్టు ప్రభుత్వం కొత్త మారణహోమ దాడులు చేస్తున్న,అలాగే రైతులు, ఆదివాసీలు, దళితులు, మేధావులు, కార్మికులు, మతపర మైనారిటీలు, కాశ్మీర్, అస్సాం లేదా మణిపూర్ ప్రజలపై ఫాసిస్ట్ అణచివేత విధానాలు అమలుచేస్తున్నఈ తరుణంలో, ప్రజా యుద్ధానికి నాయకత్వం వహించే సిపిఐ (మావోయిస్ట్), భారతదేశ ప్రజలు ఒంటరిగా లేరని, మోడీ, ఫాసిస్ట్ మారణహోమ ప్రభుత్వానికి తెలియచేయడానికి మన అంతర్జాతీయ సంఘీభావాన్నిసక్రియం చేయాల్సిన అవసరం మునుపెన్నడూ లేనంతగా వుంది.

ఈ 2021నవంబరు 24, నాడు ఫాసిస్ట్, మారణహోమ మోడీ పాలనను, దాని కొత్త మారణహోమ కేంపెయిన్ ప్రహార్-3ని దృఢ సంకల్పంతో తిప్పికొట్టడంలో అంతర్జాతీయ సంఘీభావపు ఐక్యతా పిడికిలినెత్తడానికి, భారత దేశ విశాల ప్రజానీకానికి, మహత్తర ప్రజా యుద్ధానికి, ప్రపంచ శ్రామికవర్గ విప్లవంలో ఒక విడదీయరాని భాగంగా దానికి నాయకత్వం వహిస్తున్న పార్టీకి మా బేషరతు మద్దతును తెలియజేయడానికి, ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంలో జాతీయ, స్థానిక పరిస్థితులను బట్టి భారతదేశ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, ఆ దేశ ప్రయోజనాలను కాపాడే ఇతర సంస్థల ముందు కార్యకలాపాలు చేబట్టాలని పిలుపునిస్తున్నాం.

ప్రహార్-3ని ఆపండి!

మోడీ యొక్క ఫాసిస్ట్, మారణకాండ జరుపుతున్న పాలన నశించాలి!

సీపీఐ (మావోయిస్ట్) వర్ధిల్లాలి!

భారతదేశంలో ప్రజాయుద్ధం వర్ధిల్లాలి!

శ్రామికుల అంతర్జాతీయత వర్ధిల్లాలి!

- భారతదేశ ప్రజా యుద్ధ మద్దతు కమిటీ-ఇటలీ

Keywords : cpi maoist, international campaign, Prahar 3, Committee to support the Peopleʹs War in India-Italy
(2022-01-20 06:41:48)



No. of visitors : 577

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

Paris Museum Displays Beheaded Africans

There is a museum in Paris with 18 000 human heads of people killed by the french colonial troops and missionaries. Itʹs called Musee d Histoire Naturelle de Paris.

మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్ల‌జాతీయుడైన‌ పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన‌ చౌవిన్‌తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ‌ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు.

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


భారత్