కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు


కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు

కిషన్

23-11-2021

భారత్ లో మావోయిస్టులపై జరుగుతున్న దాడికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని సీపీఐ మావోయిస్టు పిలుపునిచ్చింది. మావోయిస్టు నాయకుడు మల్లోజుల కోటేశ్వర్ రావు ఎలియాస్ కిషన్ జీ అమరుడైన నవంబర్ 24న ఈ కార్యక్రమం జరుగుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రకటన పూర్తి పాఠం...

ఫాసిస్టు నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు జరువుతున్న ʹప్ర‌హార్ సైనిక అభియాన్ʹకు వ్యతిరేకంగా
నవంబర్ 24నాడు అంతర్జాతీయ కార్యాచరణ దినాన్ని విప్లవ దృఢ సంకల్పంతో జయప్రదం చేయండి.

భారత విప్లవోద్యమ నిర్మూలనా లక్ష్యంతో భారత దోపిడీ పాలకవర్గాలు సామ్రాజ్యవాదుల అండదండలతో 2009లో రూపొందించి దీర్ఘకాల పథకంతో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ప్రజలపై యుద్ధంగా ప్రకటిస్తూ దేశ, అంతర్జాతీయంగా అనేక కార్మికవర్గ సంస్థలు, వామపక్షాలతో పాటు ప్రజాస్వామిక, విప్లవ సంస్థలు ముందుకువచ్చాయి. ఆ క్రమంలో 2011లో మా కేంద్రకమిటీ పొలిట్ బూరో సభ్యుడు కామ్రేడ్ కిషజ్ (మల్టోజల కోటేశ్వర్లు) అమరత్వ దినాన్ని పురస్కరించుకొని ఇటలీలోని మిలాన్ లో అనేక దేశాల కార్మికవర్గ, మావోయిస్టు పార్టీలు, సంస్థలతో కలసి ʹభారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీʹ (ఐసీఎస్ పీడబ్ల్యూఐ) ఏర్పడింది. గత పదేళ్లుగా అది అంతర్జాతీయ కార్మిక వర్గ దృక్పథంతో భారత ప్రజాయుద్ధానికి అండగా నిలుస్తోంది.

ఆ సంస్థ వర్తమాన ప్రహార్ - 3ను ఖండిస్తూ భారత హిందుత్వ పాలకుల విప్లవ వ్యతిరేక రియాక్షనరీ అణచివేత చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజా యుద్ధానికి సంఘీభావంగా అంతర్జాతీయ కార్యాచరణ దినాన్ని నవంబర్ 24 (కామ్రేడ్ కిషజ్ పదవ వర్ధంతి) నాడు పాటించాలని పిలుపునిచ్చింది. మా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ విప్లవాభివందనాలు తెలియచేస్తూ దానిని విప్లవ దృఢ సంకల్పంతో జయప్రదం చేయాల్సిందిగా దేశవ్యాప్త విప్లవ ప్రజాసంఘాలకు, జనతన సర్కార్లకు (విప్లవ ప్రజా కమిటీ), పీఎల్ జీఏకు పిలుపునిస్తోంది.

దేశవ్యాప్త విప్లవాభిమానులు, వామపక్షాలు, దేశభక్త ప్రజాస్వామికవాదులు, హిందుత్వ వ్యతిరేక లౌకికశక్తులు, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులు, మహిళలు, అల్పసంఖ్యాకులు, దళితులు, ఆదివాసులు అందులో పాల్గొని ఆ పిలుపును జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.
ఇటివల నరహంతక ఫాసిస్టు మోదీ కొన్ని అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని దేశాన్ని సామ్రాజ్యవాదులకు మరింతగా అప్పజెప్పడానికి ఒప్పందాలు చేసుకొని వచ్చాడు. దేశాన్ని అమ్మివేయడంలోనూ, ఫాసిజాన్ని అమలు జరుపడంలోను ప్రపంచంలోనే నెం.1గా వున్నాడు. అందువలన సామ్రాజ్యవాద రేటింగ్ సంస్థలు మోదీని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని ప్రచారం చేస్తున్నారు.

26 సెప్టెంబర్ 2021 నాడు అభివృద్ధి పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై విప్లవోద్యమ నిర్మూలనా పథకాన్ని రూపొందించాడు. దానిని అనుసరించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య రీజియన్ లో శరవేగంగా అణచివేత చర్యలు తీవ్రమవుతున్నాయి. ఇటీవలే 3 నవంబర్ నాడు నిర్మూలనా కేంపెయిన్ కు బలగాలు సిద్ధంగా ఉన్నాయనీ, త్వరలో ఉద్యమ ప్రాంతాలలో 24 కొత్త క్యాంపులు నెలకొల్పనున్నామనీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో మరిన్ని అధికంగా నెలకొల్పి విజృంభిస్తామని కేంద్ర పోలీసు అధికారులు ప్రకటించారు.

దిల్లీ సమావేశంలో హోం మినిష్టర్ ప్రకటించిన ʹవికాస్ʹ కార్యక్రమాలలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు వెలుగు చూడలేదు కానీ, అడవులలో ఆఘమేఘాల మీద పోలీసు క్యాంపులు మాత్రం వెలుస్తున్నాయి. ఈ విప్లవోద్యమ అణచివేత చర్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజల జీవన్మరణ సమస్యల పరిష్కారానికి తక్షణం నడుం బిగించాల్సిందిగా దేశ ప్రజలను కోరుతున్నది. దేశంలో ఒక వైపు దాదాపు గత యేడాది కాలంగా లక్షలాది రైతాంగం అనేక త్యాగాలకు సిద్ధపడి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక సాగు చట్టాల రద్దుకై పోరాడుతున్నారు. మరోవైపు పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని విశాల అటవీ ప్రాంతాలలో జల్, జంగల్, జమీన్ మరియు అధికారం కోసం మూలవాసులంతా పోరాడుతున్నారు.

దండకారణ్యం, ఝార్ఖండ్, ఏవోబీ, ఒడిశాలలోని మూలవాసులంతా తమ అడవులలోని ప్రజా ఉద్యమాలను ఉక్కు పాదంతో అణచివేయడానికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో క్యాంపులను నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా సిలింగేర్ పోలీసు క్యాంపు వ్యతిరేక మూలవాసుల ప్రజా ఉద్యమం గత ఆరు మాసాలుగా నిరుపమాన అనుభవాలతో కొనసాగుతోంది.

దేశంలోని అన్ని రకాల ప్రజా ఉద్యమాల అణచివేతే వర్తమాన ప్రహార్-3 లక్ష్యం. సీపీఐ (మావోయిస్టు) నాయకత్వంలోని విప్లవోద్యమాన్ని దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా చిత్రిస్తున్న హిందుత్వ శక్తులు ప్రజల జీవన్మరణ సమస్యలను వదలి విప్లవోద్యమ నిర్మూలనకు రంగం సిద్ధం చేయడాన్ని మా పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తూ 24 నవంబర్ నాడు అంతర్జాతీయ కార్యాచరణ దినాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరోసారి కోరుతోంది. ప్రహార్లు, అణచివేత చర్యలు చరిత్రలో ఏ విప్లవోద్యమాలను నిరోధించలేక పోయాయనీ ప్రజా ఉద్యమాల వెల్లువలను మరింత తీవ్రం చేస్తూ భారత ప్రజల ప్రజాస్వామిక విప్లవ విజయానికై తుదివరకూ పోరాడాలనీ విశాల ప్రజారాసులకు విజ్ఞప్తి చేస్తోంది. తుదివరకూ పోరాడుదాం, అంతిమ విజయం సాధిద్దాం.

* 24 నవంబర్ నాడు గ్రామ గ్రామాన ప్రహార్ వ్యతిరేక ప్రజాప్రదర్శనలు నిర్వహించండి.
* ప్రజా ఉద్యమ కేంద్రాలలో భారీ ప్రజా సభలు నిర్వహించి ప్రహార్ విధానాలను ఖండించండి.
* ప్రజల వికాసం పేరుతో హిందుత్వ శక్తులు అమలు చేస్తున్న ప్రహార్ వినాశకర విధానాలను బహిర్గతం చేస్తూ
పెద్ద ఎత్తున ప్రచార కేంపెయిన్ చేపట్టండి.
* మోదీ-అమిత్ షా భగవత్ ల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ వారి అణచివేత చర్యల నివేదికలను అంతర్జాతీయ
మానవహక్కుల సంస్థలకు, ఐసీఎస్ పీడబ్యూఐకి అందచేయండి.

అభయ్
అధికార ప్రతినిధి
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : cpi maoist, kishanjee, mallojula koteshvar rao, prahar,
(2022-08-11 21:59:32)No. of visitors : 936

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
more..


కిషన్