ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి

ప్ర‌జ‌ల‌పై

భారత విప్లవోద్యమంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రహార్‌`3 అనే యుద్ధాన్ని మొదలు పెట్టాయి. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రగతిశీల, విప్లవ శక్తులు స్పందించాయి. ఈ రోజున (నవంబర్‌ 24ను) ప్రహార్‌ వ్యతిరేక దినంగా పాటించాలని భారత ప్రజా యుద్ధ అంతర్జాతీయ సంఫీుభావ కమిటీ(ఐసీఎస్‌ పీడబ్ల్యూఐ) పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రహార్‌ అంటే ఏమిటో, ఆ పేరుతో ఏం జరుగుతున్నదో, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం.

ప్రహార్‌.. అనే మాట మనలో చాలా మందికి కొత్త. పౌరాణిక సినిమాల్లో ʹనా ఖడ్గ ప్రహారంతో నిన్ను హతం చేస్తాను..ʹ అనే డైలాగులు విని ఉండవచ్చు. డిమానిటైజేషన్‌, ఆత్మనిర్భర్‌ లాగా ఇదీ ఇప్పుడు ఒక కొత్త పదం. మనం చెప్పుకొనే ప్రహారం అనే మాటకు ʹప్రహార్‌ʹ అనేది హిందీ గోల కావచ్చు.

దీని అర్థం దాడి, సంహారం, నిర్మూలన.

ఇప్పటికి రెండు ప్రహార్‌లు ముగిశాయి. మూడోది మొదలుపెట్టారు.

మొన్న చత్తీస్‌ఘడ్‌లో 26 మంది విప్లవకారుల ఎన్‌కౌంటర్‌, దేశ వ్యాప్తంగా విప్లవోద్యమ ప్రాంతాలపై లక్షల సైనిక బలగాల దాడులు, డ్రోన్‌, హెలికాప్టర్లతో గ్రామాలపై బాంబు దాడులు, నేరుగా సరిహద్దు సైనిక బలగాల మోహరింపులు, విచ్చల విడిగా ఏర్పాటు చేస్తున్న పోలీసు, సైనిక క్యాంపులు, విప్లవోద్యమ నాయకులను వెంటాడి చేస్తున్న అరెస్టులు, నిత్యం ఎన్‌కౌంటర్‌ పేరిట ఎక్కడో ఒకచోట హత్యలు.. ఇలా అన్నీ ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగమే.

ఒప్పుకుంటారో లేదోగాని.. నాలుగు రోజుల కింద చత్తీస్‌ఘడ్‌ నుంచి ఓ అబద్ధపు కేసును పట్టుకొని వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నాయకుల ఇండ్ల మీద ఎన్‌ఐఏ అధికారులు చేసిన దాడి కూడా ప్రహార్‌లో భాగమే. వాళ్లు రాసుకున్న ప్రహార్‌ లక్ష్యాలలో ఇలాంటివి కూడా ఉన్నాయి.

అర్బన్‌ మావోయిస్టులనే మాట కూడా ప్రహార్‌ కోసం తీసుకొచ్చిందే.

ప్రహార్‌ అంటే ఏమోగాదు. సాయుధ పోరాటాలను, చట్టబద్ధ ప్రజాస్వామిక పోరాటాలను, కనీస నిరసన రూపాలను, మానవ సహజ అసమ్మతి వ్యక్తీకరణలను కట్టగట్టి నిర్మూలించే యుద్ధ వ్యూహం.
మావోయిస్టులను, మామూలు మనుషులను, బుద్ధి జీవులను, రాజ్యాంగబద్ధంగా తప్ప ఇంకోలా బతకడం తెలీని వాళ్లను, కథలు కవిత్వం రాసుకొనేవాళ్లను, పాటలు పాడేవాళ్లను కూడా నిర్బంధించి, హత్య చేసే యుద్ధతంత్రం ఇది.

స్టాన్‌స్వామి మరణాన్ని న్యాయ వ్యవస్థ చేసిన హత్య అని చాలా మంది పెద్దలు అన్నారు. పైకి అది నిజమే. కానీ అది ప్రహార్‌లో భాగమని అర్థమైతేనే స్టాన్‌స్వామి ఎలా మరణించాడో మనకు తెలిసినట్లు.

ఇలా అనుకోవడం నాజూకుగా ఆలోచించేవాళ్లకు కొంచెం కష్టం. అన్నీ ఒకటి కాదు అంటారు. దేనికిట్లా అన్నిటినీ కలిపేస్తారని విసుక్కుంటారు. దేనికది వేరుగా చూడడ్డంలో ఉండే సుఖాన్ని వదులుకోలేరు. ఒక వేళ కలిపి చూసినా ఇష్టం లేని వాటికి తక్కువ చేసి చూస్తారు. కనిష్ట ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ప్రాధాన్యమున్నవే. అన్నీ విడదీయలేని సంబంధం ఉన్నవే. అన్నిటినీ కలిపి ఆలోచించడంలో పాలకులకు గొప్ప ఒరవడి ఉంటుంది. మేధావులకే ఉండటం లేదు.

పాలకులు ఆషామాషీగా ప్రహార్‌ను ఆరంభించలేదు. ఇదొక పకడ్బందీ వ్యూహం. ప్రహార్‌ 1,2,3 గురించి తెలియాలంటే గ్రీన్‌హంట్‌ గురించి తెలుసుకోవాలి. అదీ మూడు దశలు సాగింది. ఇది 2009లో మొదలైంది. మొదటి రెండు దశల దుర్మార్గాల మీద తీవ్రమైన నిరసన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. గ్రీన్‌హంట్‌ అంటే దుర్మార్గమైన దాడి అనే అర్థం ప్రచారంలోకి వచ్చింది. పైగా దాన్ని యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రీన్‌హంట్‌ మూడో దశ చివరి వచ్చేసరికి మిషన్‌ 16, మిషన్‌ 17 విడిగా నడిపించారు. ఈ రెంటినీ కలిసి మొదట ఆపరేషన్‌ ప్రహార్‌ అన్నారు. అట్లా ఈ మాట 2017మే లోనే వాడారు. దండకారణ్యంలో తీవ్రస్థాయి సైనిక చర్యలు నడపడానికి పన్నిన వ్యూహం పేరు ప్రహార్‌.

సంఫ్‌ుపరివార్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ సమాధాన్‌ అని అప్పటి దాకా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి నడిపిన అన్ని అభియాన్‌లను కలిపి ఒక భారీ యుద్ధ ప్రణాళికను తీసుకొచ్చింది. ఇందులో కేవలం సైనిక వ్యూహమే లేదు. సాంస్కృతిక భావజాల యుద్ధం ఉన్నది. మైండ్‌ గేం ఉన్నది. దేనికంటే సమాధాన్‌ మోదీషా బుర్రలోంచి పుట్టింది కాదు. దీని వెనుక మంద్రస్థాయి యుద్ధమనే ఇంకో భయానక యుద్ధ తంత్రం ఉన్నది. సమాధాన్‌ అనేది ఎల్‌ఐసీ గర్భంలోంచి పుట్టుకొచ్చింది. ఈ సమాధాన్‌లో భాగంగా చేపట్టే అన్ని దాడులకు ప్రహార్‌ అనే పేరు పెడతామని 2017 మేలోనే ప్రభుత్వం ప్రకటించింది.

అయితే 2020 అక్టోబర్‌లో జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల సమన్వయ సమావేశం జరిగింది. దీనికి జాతీయ మీడియా చాలా ప్రాధాన్యత ఇచ్చింది. చాలా వివరంగా రిపోర్టు చేసింది. అందులో వాళ్లు తీసుకున్న నిర్ణయం ఏమంటే ` సమాధాన్‌ అనే దీర్ఘకాలిక, విస్తృత యుద్ధతంత్రంలో తక్షణ, నిర్దిష్ట ఫలితాలు ఉండేలా ప్రహార్‌ అనే అభియాన్‌ ప్రారంభిస్తున్నాం అన్నారు. అట్లా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నాయకత్వంలో 2020 నవంబర్‌ నుంచి జూన్‌ 2021 దాకా ప్రహార్‌ పేరుతో దేశ వ్యాప్తంగా విప్లవోద్యమం మీద పెద్ద దాడులు జరిగాయి. ఆ తర్వాత నుంచి ప్రహార్‌ 2 నడిచింది. ఈ కాలమంతా అటు దండకారణ్యంలో, ఏవోబీలో, రaార్ఖండ్‌, బీహార్‌లో, పశ్చిమ కనుమల్లో దారుణ హత్యాకాండ జరిగింది. వేల గ్రామాలను ధ్వంసం చేశారు. వందలాది మందిని హత్య చేశారు. సరిగ్గా ఆ కాలంలోనే ప్రజాస్వామిక పోరాటాలపై పెద్ద ఎత్తున విరుచుకపడ్డారు. అతి పెద్ద కుట్ర కేసులు, అబద్ధపు కేసులు ముందుకు తీసుకొచ్చారు. మేధావులను, సాహిత్యకారులను, కళాకారులను జెయిళ్లలో తోసేశారు. కానీ మనకు బైట జరిగిన విధ్వంసం తెలిసినంత విప్లవోద్యమ ప్రాంతాల్లో ఏం జరిగిందో తెలియదు.

గత నాలుగేళ్ల ఆపరేషన్‌ సమాధాన్‌ను సెప్టెంబర్‌ 26, 2021న అమిత్‌ షా అధ్యక్ష్యతను 10 రాష్ట్రాల సమావేశంలో సమీక్షించి సమాధాన్‌ పంచ వర్ష ప్రణాళికలోని చివరి సంవత్సరాన్ని ప్రహార్‌ `3గా ప్రకటించారు.
ఇది మొదలు కావడమే డ్రోన్లు, హెలికాప్టర్లు నేరుగా రంగంలోకి వచ్చాయి. అంతక ముందు నుంచే విప్లవోద్యమ ప్రాంతాల్లో డ్రోన్‌లతో దాడులు జరిగాయని పత్రికల్లో వచ్చేది. ప్రహార్‌`3 మొదలయ్యాక అధికారికంగానే డ్రోన్లు, హెలికాప్టర్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రహార్‌`3 ఆరంభించాడానికి ముందు దండకారణ్య ప్రాంతంలో ఉన్న పోలీసు క్యాంపులకు తోడు కొత్తవాటిని ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. సిలింగేరి అనే గ్రామం వద్ద సైనిక క్యాంపు ఏర్పాటు చేయాలనే ప్రయత్నాన్ని ప్రజలు మే 12న ప్రతిఘటించారు. మే 17`18 తేదీల్లో ఆందోళనకారులపై కాల్పులు పోలీసులు జరిపారు. ముగ్గురు పెద్దలు మరణించారు. ఒక గర్భవతి రద్దీలో గాయపడి మరణించింది. ఒక పిల్లవాడు మృతి చెందాడు. అయినా క్యాంపులకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం ఆగలేదు. దండకారణ్యంలో పదికి పైగా సైనిక క్యాంపుల ప్రహార్‌లో భాగంగా పెట్టాలనుకున్నారు. ఆ అన్ని చోట్ల వేలాది మంది ఆదివాసులు రోడ్ల మీద వచ్చారు. పోరాటాలు చేస్తున్నారు. జార్ఖండ్‌లో కూడా 15 క్యాంపలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడా వ్యతిరేక పోరాటం నెలల తరబడి నడుస్తున్నది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిగా రైతులు ఎలా రోడ్ల మీద పోరాడుతున్నారో సరిగ్గా అలాగే ఆదివాసులు క్యాంపులకు వ్యతిరేకంగా ఆరు నెలల నుంచి పోరాడుతున్నారు. అంతేకాదు, క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ పంచాయతీ సర్పంచ్‌లు, మెంబర్లు అనేక మంది రాజీనామా చేసి ఉద్యమంలో భాగమయ్యారు.

ఈ మొత్తం దాడిలో 7 లక్షల సైనిక బలగాలను ప్రభుత్వం దించింది. దీని కోసం అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినదాని ప్రకారమే వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నారు. దండకారణ్యం మీద పోలీసుల, సైనికుల మోహరింపు కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలను తలపిస్తుంది. దేశంలోనే పౌరులు`పోలీసులు, సైనికుల నిష్పత్తి ఆ ప్రాంతాల్లో ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

ఇంత భారీ వ్యూహం ప్రపంచంలోని ప్రజాస్వామిక శక్తులకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నట్లు ఉంది. గ్రీన్‌హంట్‌ పేరుతో ప్రజలపై భారత ప్రభుత్వం యుద్ధం మొదలు పెట్టినప్పుడే ప్రపంచం ఆందోళన చెందింది. ఇవాళ అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులకు భారత విప్లవోద్యమం ఒక్కటే గొప్ప ఆశగా ఉన్నది. దాన్ని నిర్మూలించేందుకు పాలకవర్గాల పన్నిక వ్యూహంపై సహజంగానే ప్రపంచవ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతోంది. ఒకప్పుడు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసిన ప్రముఖ రచయితలు జిఎన్‌ సాయిబాబా, వరవరరావులాంటి వాళ్లను జైలుపాలు చేయడం కూడా ఈ యుద్ధంలో భాగమే.

ఈ ప్రహార్‌ను మామూలు నిర్బంధం అనుకోడానికి లేదు. సరిహద్దు సైన్యం మోహరించింది. వైమానిక దాడులు జరుగుతున్నాయి. మరెందుకు ఖర్చు చేయనంత భారీ బడ్జెట్‌ను ఈ యుద్ధానికే ఖర్చు చేస్తున్నారు. ఇంకో పక్క దీన్ని భావజాల యుద్ధంగా మార్చేశారు. ఇది కేవలం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగే సైనిక సంఘర్షణ అని పండితులు కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. ఇందులో మార్క్సిస్టు మేధావులు కూడా పడిపోయేంతగా గందరళగోళం సృష్టించారు. ఈ యుద్ధ స్వభావాన్ని తెలుసుకోడానికి వీల్లేనంతగా అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలను పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇవేవీ తెలుసుకొనే ఓపిక లేని మేధావులు మావోయిస్టులు ఆధునిక విలువలు సంతరించుకోలేకపోతున్నారని ఆరోపించే దాకా వెళ్తున్నారు.

ప్రహార్‌ కోరుకుంటున్నది ఇదే.

దీనికి వ్యతిరేకంగా ఈ రోజు అంతర్జాతీయ సమాజం భారత విప్లవోద్యమం పక్షాన నిలబడ్డది. దేనికంటే భారత విప్లవోద్యమం 21వ శతాబ్దపు ప్రజా పోరాటాల్లో, విప్లవోద్యమాల్లో ఒక గుణాత్మకమైన ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకుంది. భారత విప్లవోద్యమ క్రమమే ప్రపంచ విప్లవోద్యమాలకు గొప్ప అనుభవాలను, ఉత్తేజాలను, సిద్ధాంత అవగాహనలను అందించగలదనే నమ్మకంతో ప్రపంచ ప్రగతిశీల సమాజం ఉన్నది. అందుకే భారత విప్లవోద్యమానికి మొదటి నుంచీ సంఫీుభావం ప్రకటిస్తున్నది.

భారత విప్లవోద్యమం దీర్ఘకాలం దారుణ నిర్బంధాన్ని అధిగమిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నది. అది చేయని ప్రయోగాలు లేవు. సాధించని విజయాలు లేవు. బహుశా ఈ దేశంలోని సకల ప్రత్యేకతలను తన అవగాహనలో భాగం చేసుకొని ఆచరణలోకి తీసుకున్నది. అన్ని విభిన్న సమూహాలను ముట్టుకున్న ఉద్యమం ఈ యాభై ఏళ్లలో ఇంకోటి లేదు. అన్ని సమస్యల మీద రాజకీయార్థిక సాంఘిక సాంస్కృతిక సిద్ధాంత కల్పన కోసం ప్రయత్నిస్తున్న ఉద్యమం కూడా ఇంకోటి లేదు.

ఇందులో ఎన్నో పరిమితులు ఉండవచ్చు. అపజయాలు ఉండవచ్చు. కోల్పోయిన స్థావరాలు ఉండవచ్చు. కానీ గెలుచుకున్నవీ ఉన్నాయి. అంతిమంగా ప్రజా చరిత్రను గెలుపు పక్షాన నిలబెట్టగల శక్తి ఉన్న ఉద్యమమని ఇప్పటికే రుజువు చేసుకున్నది. ప్రహార్‌ `3 వల్ల చాలా నష్టపోయినట్లు వార్తలనుబట్టి అంచనాకు రావచ్చు. కానీ దాని అజేయశక్తి నిత్య పురోగామి. దాని రాజకీయాలతో, వ్యూహాలతో ఏకీభావం ఉన్నా లేకపోయినా మానవాళి విజయం గురించి అంతగా రక్తమోడుతున్న ఉద్యమం మరొకటి లేదు. మానవత వెల్లివిరియడానికి విప్లవం ఒక్కటే మార్గమని అచంచల తాత్విక విశ్వాసం ఉన్న పోరాటశక్తి దేశంలో ఇంకోటి లేదు. విప్లవోద్యమమంటే రాజకీయ ప్రక్రియ అనీ, అది శాస్త్రీయ సిద్ధాంత పునాది మీద సాగే మానవ ఆచరణ అని ఈ శతాబ్దంలో ఇప్పటికే నిరూపించిన ఏకైకశక్తి కూడా అదే. అంతిమ గెలుపు కోసం పోరాట శక్తులను గెలుచుకొనే పరిభాష, పని పద్ధతులు, వ్యూహాలు నిత్యం సంతరించుకుంటున్న ఉద్యమం కూడా అదే.

అందుకే దాని పక్షాన ఇవాళ ప్రపంచమంతా ఉన్నది. అందులో మీరూ ఎందుకు భాగం కాకూడదు?

Keywords : operation greenhunt, prahar, samadhan, peoples movement, mining,
(2024-04-14 23:23:42)



No. of visitors : 706

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్ర‌జ‌ల‌పై