ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు


ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు

ప్రవేటీకరణకు

25-11-2021

సింగరేణి కార్మికులు సమ్మె సైరెన్ మోగించారు. తెలంగాణ బొగ్గు గ‌నుల్లోని బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి బోర్డు యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. క‌ల్యాణ్ ఖ‌ని బ్లాక్ -6, కోయ‌గూడెం బ్లాక్ -3, స‌త్తుప‌ల్లి బ్లాక్ -3, శ్రావ‌ణ‌ప‌ల్లి బొగ్గు గ‌నుల‌ను వేలం వేయాల‌ని కేంద్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రప్రభుత్వ చర్యలపై కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం స‌మ్మె నోటీసు ఇచ్చింది. డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేస్తామ‌ని టీబీజీకేఎస్ ప్ర‌క‌టించింది.

ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోతపడుతుందని, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణ అంశం చర్చించేందుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్​ అధ్యక్షుడు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘం పరివేటీకరణ నిలిపివేయాలన్న డిమాండ్ తో పాటు రెండు పేర్లు ఉన్న సింగరేణి కార్మికుల డిపెండెంట్స్‌కు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాలని, కరోనా కారణంగా మెడికల్ బోర్డు నిలిచిపోయిన దరిమిలా 35 సంవత్సరాలు దాటిన డిపెండెంట్స్ కు ఉద్యోగాలు కల్పించాలని, 35 సంవత్సరాల వయో పరిమితిని 40 సంవత్సరాలకు పెంచి వన్ టైం మేజర్ గా డిపెండెంట్లందరికి ఉద్యోగాలు ఇవ్వాలని, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులున్నప్పటికీ డిపెండెంట్లకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Keywords : singareni, strike, telangana, coal black
(2022-01-13 16:04:40)No. of visitors : 195

Suggested Posts


0 results

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


ప్రవేటీకరణకు