కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ

కోబాడ్

01-12-2021

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు కోబాడ్ ఘాండీని తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం..

కోబాడ్ ఘాండీని సీపీఐ (మావోయిస్టు) నుంచి బహిష్కరిస్తున్నాం

2019లో కోబాడ్ ఘాండీ జైలు నుండి బెయిల్ పై విడుదలై తన కుటుంబంతో వుంటూ ʹఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్ ఎ ప్రిజన్ మెమొయిర్ʹ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాసి 2021లో ప్రచురించి విడుదల చేసాడు. యీ పుస్తకం ద్వారా కోబాడ్ మార్క్సిజం- లెనినిజం-మావోయిజం సిద్ధాంతం నుండి పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాడనే విషయం స్పష్టమయింది. ఆయన జైలులో వుండగానే 2010లో ఈ పుస్తకంలోని ప్రధాన ప్రతిపాదనలను "క్వశ్చన్ అఫ్ ఫ్రీడమ్ పీపుల్స్ ఇమాన్సిపేషన్ʹ శీర్షికన 6 వ్యాసాలు మెయిన్ స్ట్రీమ్ పత్రికలో రాసాడు. అవి మానవతావాద, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎత్తిపడుతూ భావజాలపరంగా బూర్జువా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాయి.

ప్రస్తుతం ఆయన రాసిన ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్ పుస్తకం ద్వారా ఘనీభవించిన ఆ భావాలు మరింత స్పష్టంగా వెల్లడైనాయి. తీహార్ జైలులో చెట్ల కింద కూర్చోని దీర్ఘాలోచన చేసిన కోబాడ్ కు తన 40 ఏళ్ల విప్లవ జీవిత ప్రతిఫలణంలో ప్రపంచాన్ని మార్చే సాధనలో అన్నింటికంటే ముందు స్వేచ్ఛా, మంచి విలువలు, సంతోషం సమాజంలో అవసరమని, సంతోషాన్ని సాధించే గోల్ పోస్టుగా మన ఆచరణ కొనసాగాలని చెబుతున్నాడు. నీతి కథల నుండి సారాంశాన్ని గ్రహించాలని కూడా చెబుతున్నాడు. ఇలా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న కోబాడ్ కు మార్క్సిస్టు ఆచరణలో అవి లేవని, తత్ఫలితంగా మార్క్సిజం తన లక్ష్యాన్ని సాధించలేకపోయిందని అంటున్నాడు. కాని ఆయన మార్క్సిజం-లెనినిజం-మావోయిజానికి తప్పుడు భాష్యం చెబుతున్నాడు.

వర్గపోరాటం, ఉత్పత్తి,శాస్త్రీయ పరిశోధనల ద్వారానే సమాజంలో సరియైన భావాలు ఉత్పన్నమవుతాయని మార్క్సిజం చెబుతోంది. ʹబాహ్య ప్రపంచంపై ప్రతిచర్య జరుపుతూ, దాన్ని మార్చడం ద్వారా అతడు అదే సమయంలో తన స్వంత స్వభావాన్నే మార్చుకుంటాడు. అతడు తనలో నిద్రాణమైవున్న శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుని, ఈ అంతర శక్తులను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడుʹ అని మార్క్స్ తన పెట్టుబడి గ్రంథంలో రాసాడు. ప్రపంచంలో మార్పుకు విప్లవ ప్రతిచర్య జరపకుండా మనిషిలో కూడ మార్పును ఆశించలేం.

కోబాడ్ ఆధ్యాత్మిక ఆలోచనలు, భూస్వామ్య, బూర్జువా, భావవాద భావజాలానికి సంబంధించినవే తప్ప వాటికి అత్యంత శాస్త్రీయ, తాత్విక చింతనతో కూడిన మార్ఫిజంతో ఎలాంటి పొత్తులేదు. కోబాడ్ గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని, మార్కిస్టు మూల సూత్రాలను, వర్గపోరాటాన్ని విడిచి పెట్టి భావవాద ఆలోచనలతో సమాజంలో సంతోషాన్ని సాధించే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఆయన 50 యేళ్లకు పైగా నక్సల్బరీ రాజకీయాలను అనుసరిస్తూ మునుపటి సీపీఐ(ఎమ్ ఎల్) పీపుల్స్ వార్ లో కేంద్రకమిటీ సభ్యుడుగా, మహరాష్ట్ర రాష్ట్రకమిటీ నాయకుడిగానూ, పిమ్మట ఐక్యతా పార్టీ సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కేంద్రకమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా అరెస్టు అయ్యేంతవరకు కొనసాగాడు. ఆయన 2009లో అరెస్టై జైలుకు వెళ్లడం, పదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలైన తర్వాత కూడ ఈ కాలమంతా తాను మావోయిస్టు పార్టీలో సభ్యుడిని కాదని పదేపదే నిరాకరిస్తూ వచ్చాడు. పోలీసులే ఈ ఆరోపణ నాపై చేస్తున్నారనీ, అలా తనను అనేక మావోయిస్టు కేసుల్లో ఇరికించారనీ, తన పుస్తకంలో రాయడమే గాక గతంలో ప్రెస్ మీట్లలో కూడ ఈ విషయం చెబుతూ వచ్చాడు.

ఒక విప్లవ పార్టీలో అత్యున్నత స్థాయిలో పనిచేసి అరెస్టు కాగానే ఆయన వాస్తవాలను మరుగుపర్చి పాలకవర్గాల మెప్పుకోసం పాకులాడడం ఆయన నిజాయితీ కూడ కోల్పోయాడని తెలుస్తూనే వున్నది. నిజాయితీ కోల్పోయిన వ్యక్తి సమాజానికి ఏమి సందేశం ఇవ్వగలుగుతాడు? దానికి ఏమి విలువ వుంటుంది?
కోబాడ్ జైలు నుండి బయటకు వచ్చిన పిదప పార్టీని కాంటాక్టు చేయకపోవడమే గాక పార్టీతో చర్చించకుండా పార్టీ సైద్ధాంతిక రాజకీయాలకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనావళిని, పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామిక క్రమశిక్షణను ఉల్లంఘించి, ఈ పుస్తకాన్ని రాసి ప్రచురించి, విడుదల చేయడం మంచి విలువల గురించి మాట్లాడుతున్న కోబాడ్ లో గల అనార్కిస్టు ధోరణులను బయటపెడుతున్నది.

మోదీ నాయకత్వంలోని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీని ʹసమాధాన్-ప్రహర్ʹల క్రూర దాడి ద్వారా 2022 జూన్ లోగా నిర్మూలిస్తామని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కోబాడ్ ఈ పుస్తకం ద్వారా విప్లవ శిబిరంలో, ప్రజల్లో నిరాశవాదాన్ని పెంచే లక్ష్యంతో తనను కాపాడుకోవడానికి కూడ పాలకవర్గాల సేవకు అంకితమై ఆ పుస్తకంలో మావోయిస్టు పార్టీ పైన అనేక అసత్య ఆరోపణలు చేశాడు. జైలులో వున్నంతకాలం నేరజగత్తుతో, జైలు అధికారులతో చట్టాపట్టాలేసుకుని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించి వారంతా మంచివారని పొగుడుతూ నిర్లజ్జగా తన పుస్తకంలో రాసాడు.

జైలులో మావోయిస్టు ఖైదీలు మాఫియాలతో కలిసిపోవడమే గాక, కొన్నిసార్లు వారికి నాయకత్వం కూడ వహిస్తారని నిరాధారణమైన ఆరోపణ‌కు ఒడిగట్టాడు. నక్సల్బరీ కాలం నుండి జైళ్ళలో విప్లవకారులు నెలకొల్పిన పోరాట సాంప్రదాయాలను, త్యాగాలను తూలనాడి పార్టీ పై నిందలకు పాల్పడ్డాడు. కోబాడ్ జైలులో నిస్వార్ధంగా, సాధారణ ఖైదీల హక్కుల కోసం ఏరోజు జైలు అధికారులకు వ్యతిరేకంగా పోరాడింది లేదు. పైగా వారి నుండి అనేక వ్యక్తిగత స్వార్ధ రాయితీలు పొందాడు. అలాంటి వ్యక్తికి మావోయిస్టు ఖైదీల పట్ల మాట్లాడే హక్కు వుంటుందా? అంతేగాక మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు లేదని, పార్టీ తిరుగుబోతు దళాలు(రోవింగ్ రెబల్స్)గా పని చేస్తున్నదని నిందిస్తున్నాడు. ఇది పాలకవర్గాల గొంతులో గొంతు కలపడమే తప్ప మరేమి లేదు.

కోబాడ్ ఘాండీ తన పుస్తకంలో మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్దాంత, రాజకీయ ఆచరణ పై విమర్శలను ఎక్కుపెట్టాడు. మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావోల నాయకత్వంలో సోషలిజం కోసం జరిగిన పోరాటం ఎందుకు ఓడిపోయింది? చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం మావో మరణించిన అనంతరం విఫలమవడానికి కారణాలేమిటి? మార్క్స్ మొదట రాసిన సిద్ధాంతంలో మానవతా విలువలు వెలుగు చూడగా ఆ తర్వాత కాలంలో ఆచరణాత్మక ఉద్యమాలు ముందుకు వచ్చి అవి మరుగున పడిపోయాయని, తర్వాత లెనిన్, స్టాలిన్, మావో నేతృత్వంలో ఏర్పడిన సోషలిస్టు రాజ్యాల్లో ఈ మానవతా విలువలకు ప్రాధాన్యతనివ్వలేదని, ఆర్థిక నిర్ణయాక సిద్దాంతాలే అధిపత్యం వహించాయనీ, కమ్యూనిస్టు పార్టీలో కూడ కేంద్రీకృత ప్రజాస్వామ్యం ద్వారా నియంతృత్వమే రాజ్యమేలిందని అందుకే సోషలిజం వెనకడుగు వేసిందని ఆయన పుస్తకంలో రాసాడు. ప్రపంచ యుద్ధం జరిగిన కాలాల్లోనే విప్లవాలు విజయవంతమయినాయని, శాంతి కాలాల్లో విప్లవాలు విజయవంతం కాలేదని చరిత్రను తప్పుడుగా వక్రీకరిస్తున్నాడు.

అధికారం, డబ్బును వదిలించుకోవడానికి కమ్యూనిస్టు సమాజంలోనే సాధ్యమని, అందుకు ఏ మార్గం చేపట్టాలో మార్క్సిజం చెప్పింది. అయినప్పటికీ సమాజంలో అధికారం, డబ్బు అనేవే ప్రధాన సమస్యలని, వాటి మూలంగానే అన‌ర్ధాలకు దారి తీస్తున్నాయని చెప్పడం ద్వారా ప్రజలను అధికార పోరాటం నుండి విముఖులను చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. యీ రకంగా ఆయన మార్క్సిజం-లెనినిజం- మావోయిజం మూల సూత్రాలనే వ్యతిరేకిస్తున్నాడు. సుమారు 175 సంవత్సరాలుగా మార్నిజం-లెనినిజం-మావోయిజం బూర్జువా సిద్ధాంతం పై చేసిన సైద్ధాంతిక-రాజకీయ దాడి, అది ఆచరణలో సాధించిన విజయాలను నిరాకరిస్తూ కార్మికవర్గానికి, యావత్తు పీడిత ప్రజలకు ద్రోహం చేయ తలపెట్టాడు.

భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన నుండి అది సాధించింది ఏమిటనీ, దేశంలో విప్లవోద్యమం వెనుకపట్టు ఎందుకు పట్టిందనీ, విప్లవ పార్టీలు పరిశోధన చేయకుండా నిశ్చయవాదంతో దేశంలో విప్లవం తప్పక వస్తుందని చెప్తూనే ఉంటాయని విమర్శిసున్నాడు. కార్మికవర్గంలో ఈ కాలమంతా జరిగిన మార్పులను దృష్టిలోకి తీసుకోరనీ, కుల సమస్యను వర్గ విభజనలోకి కుదించి పారిశ్రామికీకరణ ద్వారా, విప్లవం ద్వారా కులాంతరాలు వాటికవే అంతరించిపోతాయని కమ్యూనిస్టులు చెబుతున్నారని పాత చింతకాయ పచ్చడిలా విమర్శిస్తున్నాడు.

దేశంలో రివిజనిజానికి వ్యతిరేకంగా బలంగా జరిగిన పోరాటం ద్వారా నిజమైన విప్లవ పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఉద్భవించింది. దేశంలో నిర్దిష్ట సమస్యల పై నిర్దిష్ట విశ్లేషణ జరిపి శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు పార్టీ అవగాహనను మెరుగుపర్చుకుంటూ డాక్యుమెంట్లను రూపొందించుకుంటున్నది. కోబాడ్ లేవనెత్తిన అంశాలన్నింటికి పార్టీ డాక్యుమెంట్లలో జవాబులు వున్నాయి. మావోయిస్టు పార్టీలో దీర్ఘకాలం ఒక నాయకుడిగా వుండి, యీ డాక్యుమెంట్లు రూపొందించే చర్చల్లో పాల్గొని కూడ వాస్తవాలను మరుగుపరచడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.
కోబాడ్ ఈరోజు విప్లవ రాజకీయాలకు తిలోదకాలిచ్చి బూర్జువా రొచ్చుగుంటలోకి ఎందుకు దిగజారాడనేది మనం చూడాలి.

కోబాడ్ సంపన్న మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఆయన వర్గ రీత్యా జాతీయ బూర్జువా వర్గం నుండి పార్టీలోకి వచ్చాడు. కార్పోరేట్ ప్రపంచంలో పెరిగాడు. డూన్ స్కూల్లో చదివాడు. కొంతకాలం లండన్లో విద్యాభ్యాసం చేశాడు. ఆయన లండన్ లో చదువుతున్న కాలంలోనే భారతదేశంలో నక్సల్బరీ వసంతమేఘగర్జనతో ప్రభావితమై విప్లవోద్యమంలో చేరాడు. మహరాష్ట్ర విప్లవ పార్టీ నిర్మాతల్లో ఒకరుగా ముందుకొచ్చాడు. ఆయన లండన్ లో మార్క్స్ అధ్యయనం చేసిన లైబ్రరిలో మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం అధ్యయనం చేశాడు. కాని ఆయన మార్క్సిజంలో ప్రాణప్రదమైన మూల సూత్రాల్లో భాగమైన నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట అధ్యయనం చేయడంలో, గతితార్కిక చారిత్రక భౌతికవాదానికి, పద్ధతికి భిన్నంగా ఆయనలో తాత్వికంగా పిడివాద ఆలోచనలు కొనసాగాయి.

ఇవి మాటల్లో అతివాద రూపంలో, ఆచరణలో మితవాద రూపంలో రాజకీయంగా తరచూ వ్యక్తమయ్యేవి. పార్టీలో ముఠాలు కట్టడానికి దారి తీసేవి. కోబాడ్ ను పార్టీ అంతర్గత పోరాటం ద్వారా సరిదిద్దడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కాని ఆయన సైద్ధాంతిక, రాజకీయ పెడధోరణుల నుండి స్వచ్ఛందంగా బయటపడలేకపోవడమే గాక, దేశంలో మావోయిస్టు పార్టీ ఆవిర్భావంతో పాలకవర్గాలు తీవ్ర నిర్భాంధాన్ని ప్రయోగించడం, అందులో ఆయన అరెస్టు కావడంతో ఆయనలో గూడుకట్టుకొని వున్న తప్పుడు భావాలు ఆయన రచనల ద్వారా వ్యక్తమయ్యాయి.

ఏ వ్యక్తి అయిన తనను తాను సరిదిద్దుకోవడానికి నేరుగా వర్గపోరాటంలో, ప్రజాయుద్ధంలో పాల్గొనడం, నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేయడం, తద్వారా స్వీయాత్మకత ఆలోచనలలో గల పిడివాద తప్పుడు భావాలను సరిదిద్దుకోవడం అవసరమవుతుంది. ఆయన తన 40 ఏళ్ల విప్లవ జీవితంలో దీని కోసం తక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన చెప్పుకున్నట్లే అంతర్ముఖి స్వభావం కల్గినవాడు. దీనితో అయన ఏ విషయాన్నైనా విస్తృతంగా తోటి కామ్రేడ్స్ తో చర్చించడం, భావాలను ఇచ్చిపుచ్చుకోవడంలో ఆసక్తి చూపలేకపోయాడు. ఆయన సుదీర్ఘ విప్లవ జీవితం కార్మికవర్గ భావాలకనుగుణంగా మార్చుకోలేకపోయాడు. తద్వారా విప్లవోద్యమాల్లో సహజంగా వచ్చే ఆటుపోట్లను మార్పిస్టు పద్ధతి ద్వారా విశ్లేషించుకోలేకపోయాడు. తరచు అలాంటి సందర్భాల్లో నిరాశవాదానికి నెట్టబడడం, పార్టీ తప్పులను ఏకపక్షంగా అధికంగా అంచనా వేసి ద్వేషంగా మార్చుకోవడం ఆయనలో గల పెటీబూర్జువా అహంభావానికి నిదర్శనంగా అనేకమార్లు పొడచూపాయి.

చివరకు ఆయన వాటికే బలైపోయి మార్క్సిజం- లెనినిజం-మావోయిజం సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం వరకు దారితీసింది. ఆయన మళ్లీ జైలు జీవితం తదుపరి కార్పోరేట్ ప్రపంచంలోకి వెళ్లాడు. అందుకే ఆయన 40 సంవత్సరాల తర్వాత కుళ్లిపోయిన సామ్రాజ్యవాద ,అర్ధవలస-అర్ధ భూస్వామ్య వ్యవస్థలోకి తిరిగిరావడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. విప్లవోద్యమంలో సృజనాత్మకత దెబ్బతిన్నదని వాపోయాడు. కార్పోరేట్ ప్రపంచమే నా ఆలోచనలకు చలనశీలతనిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నాడు. కొండమీది నుండి రాలిన రాయి పాతాళానికి వెళ్లే వరకూ ప్రయాణిస్తుందనేది నిజమే కదా!

కోబాడ్ తీసుకొచ్చిన అభిప్రాయాలు చరిత్రలో కొత్తవేమి కావు. మార్క్సిజాన్ని అంగీకరిస్తూనే మార్నిజంలోని మూల సూత్రాలను తిరస్కరించిన బెర్న్ స్టీన్, మానవతా మార్క్సిస్టుల, డాంగే సరసన్నే కోబాడ్ చేరాడు. మార్పిజం- లెనినిజం-మావోయిజం మూల సూత్రాలను తిరగదోడడం, పాలకవర్గాల పంచన చేరి పార్టీ పై బురద చల్లడం, వర్గపోరాటం బదులు వర్గ సామరస్య భావనలను ప్రత్యామ్నాయంగా ఎంచుకొని భావవాద ఆధ్యాత్మిక గురువుగా మారడం, ఘోరంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో కోబాడ్ ఘాండీని పార్టీ నిబంధనావళిననుసరించి కేంద్రకమిటీ ఆయన పార్టీ సభ్యత్వాన్ని తొలగించి పార్టీ నుండి బహిష్కరిస్తున్నది.

ప్రియమైన ప్రజలారా,

కోబాడ్ ఘాండీ ముందుకు తెచ్చిన విప్లవ వ్యతిరేక, పచ్చి అవకాశవాద రాజకీయాలను, భావాలను, ప్రతిపాదనలను తిరస్కరించాలని మా పార్టీ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు, విప్లవ సానుభూతిపరులకు విజ్ఞప్తి చేస్తున్నది. నిరాశవాదంతో విప్లవ చేవ చచ్చి పాలకవర్గాల భావజాలం పంచన చేరిన కోబాడ్ అవకాశవాద రాజకీయాలను తిరస్కరించి, ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు తెలియజేస్తున్నది. పరమ స్వార్ధంతో ఉద్యమం నుండి తప్పుకొని కుళ్లు సమాజంలో భాగమవుతున్న వ్యక్తులలో కోబాడ్ మొదటివాడు కాదు. ఇలాంటి వారిని చరిత్ర పెంటకుప్పపైకి విసిరి కొట్టి విప్లవోద్యమం పురోగమించింది. కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించే లక్ష్యంతో కార్మికవర్గ నాయకత్వంలో పీడిత ప్రజలను సమీకరిస్తూ మా పార్టీ విజయం వైపు మెట్టు మెట్టుగా ముందుకు సాగుతూనే వుంటుంది.

నోట్: కోబాడ్ ఘాండీ రాసిన ʹప్రాక్చర్డ్ ఫ్రీడం ఎ జైల్ మెమోయిర్"కు వివరంగా మా జవాబు త్వరలో ప్రచురిస్తాం.

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)


Keywords : CPI Maoist party, kobad ghandy, maharashtra, expel, abhay
(2024-04-24 23:02:15)



No. of visitors : 1524

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కోబాడ్