శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి


శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి

శ్రీ‌శ్రీ‌కి

01-12-2021

ప్ర‌భువెక్కిన ప‌ల్ల‌కి కాదోయ్‌

అది మోసిన బోయీలెవ్వ‌ర‌ని

ప్ర‌శ్నించి, ʹమాన‌వ చ‌రిత్ర వికాసాన్నిʹ తిప్పి చూపిన శ్రీ‌శ్రీ‌ని, ఆయ‌న మ‌హాప్ర‌స్థానాన్ని ఈ రోజు (న‌వంబ‌ర్ 30న‌) తిరుప‌తిలో కొంద‌రు ప‌ల్ల‌కిలో ఊరేగించారు. ఈ కాల‌పు వికృత‌, జుగుప్సాక‌ర స‌న్నివేశ‌మిది. ఆద‌ర్శాలు, విలువ‌లు, విశ్వాసాలు త‌ల‌కిందులుగా ఊరేగిన దృశ్య‌మిది. మారుమూల బొరియ‌ల్లో వినిపిస్తుండిన మూలుగులు న‌డిరోడ్డు మీద విక‌టాట్ట‌హాసమైన తీరు ఇది. శ్రీ‌శ్రీ‌ని నిలువునా పాతేసి ఆయ‌న శ‌వానికి చేసిన‌ స‌ర్వాలంకృత వేడుక ఇది.

మ‌హాప్ర‌స్థానం భారీ సైజ్‌లో అచ్చు వేయ‌డ‌మే విడ్డూరం. అది చ‌దువుకోడానికి ప‌నికి వ‌చ్చేది కాదు. ఏ లాభాపేక్ష లేకుంటే దాన్ని సాహిత్య‌లోకంలోని, ప్ర‌చుర‌ణ రంగంలోకి ʹముచ్చ‌ట‌ʹ అనుకోవ‌చ్చు. కానీ అది అక్క‌డితో ఆగుతుంద‌ని అనుకోలేదు. వ్య‌క్తిగ‌త అభిరుచి అచ్చోసుకొని జ‌నం మ‌ధ్య‌లోకి వ‌చ్చేసింది. నిజానికి మ‌హాప్ర‌స్తానం భారీ సైజ్ దానిక‌దే స‌మ‌స్య కాదు. దాని చుట్టూ ఒక ఆడంబ‌రం మొద‌లైంది. ఆ మ‌ధ్య విజ‌య‌వాడ‌లో ʹఅంద‌రూʹ క‌లిసి దీన్ని ఆవిష్క‌రించారు. ఆ క‌ల‌యికే అసంబద్ధం. శ్రీ‌శ్రీ ఆలోచ‌న‌ల‌కు, ఆశ‌యాల‌కు విరుద్ధమైన క‌ల‌యిక అది. ʹఅంద‌రూʹ క‌లిసి శ్రీ‌శ్రీ ఆశ‌యాల కోసం ప‌ని చేయ‌డం క‌ష్టం.. ఇదుగో ఇలాంటి ప‌నులే సాధ్యం. పోలీసుల‌తో, రాజ‌కీయ నాయ‌కుల‌తో, అధికార యంత్రాంగంలో కీల‌క అవినీతి అధికారుల‌తో క‌లిసే దాకా భారీ సైజ్ ముచ్చ‌ట విక‌టించింది.

ఇప్పుడు అది న‌డివీధుల ప‌ల్ల‌కి సేవ‌గా మారింది.

మ‌నుషులు చేసే ప్ర‌తి ప‌నికీ ఒక అర్థం ఉంటుంది. లేదా ప్ర‌తి ప‌నీ ఒక అర్థవ్యాఖ్యానం కోరుకుంటుంది. స‌రిగ్గా అదే జ‌రిగింది. పెద్ద ఇండ్లు లేకుంటే దాచుకోవ‌డ‌మూ క‌ష్ట‌మ‌య్యే భారీ మ‌హా ప్ర‌స్థానం ఏకంగా ప‌ల్ల‌కి ఎక్క‌డం యాదృశ్చికం కాదు. ముచ్చ‌ట‌గానో, వెర్రిగానో మొద‌లై ఒక అభ్యంత‌ర‌కర విలువ‌గా మారి ప‌ల్ల‌కి సేవగా తార్కిక ముగింపుకు చేరుకుంది.

ఏ ప‌ని చేయాలో, ఏది చేయ‌కూడ‌దో విచ‌క్ష‌ణ లేక‌పోవ‌డం, శ్రీ‌శ్రీ పేరుతో ఏది చేసినా చెల్లుబాట‌వుతుంద‌ని అనుకోవ‌డం, శ్రీశ్రీ ని భావావేశంగా మార్చాల‌నుకోవ‌డం వంటివి ఈ ప‌నిలో లేవా? దీన్ని కేవ‌లం శ్రీ‌శ్రీ అంటే అతిశ‌యంగా, అత్యుత్సాహంగా, మ‌తిలేని ప్రేమ‌గానే చూడ‌గ‌ల‌మా?

నిజానికి ఇది తెలుగు సాహిత్య‌రంగంలోని పాపులిస్టు ధోర‌ణికి రుజువు. ఇది మ‌రీ ఎబ్బెట్టుగా క‌నిపిస్తోంది కాని, సాహిత్యం పేరుతో సాగే ఉత్స‌వ క్రీడ‌లు, వేడుక‌లు, భ‌జ‌న కీర్త‌న‌లు, క‌విత్వం మీది ప్రేమే ప‌ర‌మంగా మార‌డం, క‌విత్వం క‌విత్వం కోస‌మే అన‌డం, దాని కోసం చేసే ప‌నుల‌న్నీ జీవితాన్ని ఉద్ధ‌రించేవ‌ని ప్ర‌క‌టించ‌డం.. వంటి ఎన్నో వికృత విశేషాలు ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒక‌టి. ఈ పాపులిస్టుగా ధోర‌ణుల ప‌క్క‌నే కెరీరిస్టు విన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. ఏది ఏదో తెలియ‌నంత‌గా ఈ రెండూ క‌ల‌గ‌ల‌సిపోయాయి. క‌లిసే ఉంటాయి.

చాలా మందికి త‌మ‌లోని ʹప్ర‌గ‌తిదాయ‌క‌త‌ʹను చాటుకోడానికి శ్రీ‌శ్రీ ఒక సాధ‌నం. నిజానికి శ్రీశ్రీది ఇలాంటి వాళ్ల‌కు లొంగే వ్య‌క్తిత్వం కాదు. ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకున్న‌త‌న ప‌రిమితులు ఇలాంటి వాళ్ల‌కు ఆస‌రా కావ‌చ్చేమోగాని మ‌హాప్ర‌స్థానం నుంచి మ‌రో ప్ర‌స్థానం దాకా శ్రీ‌శ్రీ రాడిక‌ల్ జ‌ర్నీ చేశాడ‌నే సంగ‌తి మ‌ర్చిపోడానికి లేదు. త‌న‌లో ఉన్న సంప్ర‌దాయ ఛాయ‌ల‌న్నీ తుడిచేసుకొని ముందుకు సాగాడు. కానీ ఇప్పుడాయ‌ను ఒక ఆరాధ‌నా మూర్తిగా మార్చేశారు. మ‌హాప్ర‌స్థానాన్ని ప‌ల్ల‌కిలోని పూజా వ‌స్తువుగా మార్చేశారు. ఒక ప‌క్క భారీ సైజ్ తోపాటు పాకెట్ సైజ్ ʹరెడ్ బుక్‌ʹగా కూడా మ‌హాప్ర‌స్థానాన్ని ముస్తాబు చేశారు. దాన్నీ ఊరేగించారు.

ఇలాంటి విన్యాసాల‌ను చూసి కొంద‌రు తెలుగు సాహిత్య‌మంతా భ్రష్టు ప‌ట్టిపోయింద‌ని గుండెలు బాదుకుంటారు. ప్ర‌గతిశీల భావ‌జాలంలో ఉన్నా ప్ర‌గ‌తిని చూడ‌లేక నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. ఇంకొంద‌రు శ్రీ‌శ్రీ ప‌రిమితుల‌ను మాత్ర‌మే చూసి, వాటిని అడ్డం పెట్టుకొని ప్ర‌గ‌తిశీల వార‌స‌త్వం మీదే దాడి చేయ‌డానికి ఇలాంటి వాటిని సాకు చేసుకుంటారు.

వీట‌న్నిటి మ‌ధ్య‌నే శ్రీ‌శ్రీ వార‌సులు ప్రొ. సాయిబాబా, వ‌ర‌వ‌ర‌రావు, ప్ర‌జాక‌ళాకారుడు కోటి యావ‌జ్జీవ‌, నిర‌వ‌ధిక జైలు జీవితంలో ఉన్నారు. కాగితం మీది అక్ష‌రానికి బ‌లైపోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. జైలు మ‌ధ్య‌నే తెలుగు జాతిని ప్ర‌భావితం చేయ‌గ‌ల ర‌చ‌న‌లు చేస్తున్నారు. నిన్న మొన్న‌నే ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు క‌ళ్యాణ‌రావు, అర‌స‌విల్లి కృష్ణ ఇండ్ల మీద ఎన్ ఐఏ పోలీసులు దాడులు చేశారు. ఈ తావుల‌న్నిటా గొప్ప ధిక్కారం ఉన్న‌ది. శ్రీ‌శ్రీ చారిత్ర‌క స్పూర్తి అక్క‌డ ఉంది. అది రూపొందుతున్న ప్ర‌పంచం. చివ‌రికి శ్రీ‌శ్రీ వంటి గ‌తం కూడా కాదు. శ్రీ‌శ్రీ క‌విత్వంలోని మ‌రో ప్ర‌పంచం. దాని కోసం అక్ష‌రాలా సిద్ధ‌మైన వాళ్ల సాహిత్యంలో శ్రీ‌శ్రీ‌ స్పూర్తి ర‌వ‌ర‌వ‌లాడుతూ ఉంటుంది.

కానీ ఇక్క‌డ వీళ్లు శ్రీ‌శ్రీ‌ని ప‌ల్ల‌కి ఎక్కించారు. కాక‌పోతే వాళ్లు ఊరేగిచింది శ్రీ‌శ్రీ‌ని కాదు. మ‌హా ప్ర‌స్థానాన్ని కాదు. ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని. ఆ సంగ‌తి తెలియ‌కుండా ఈ ప‌ని చేశార‌ని ఎలా అనుకోగ‌లం?

- పాణి

(1.12.2021 వ‌సంత‌మేఘం సంచిక సంపాద‌కీయం)

Keywords : sri sri, thirupathi, pinaka pani, virasam, saibaba, varavararao, koti
(2022-08-11 08:00:01)No. of visitors : 599

Suggested Posts


ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
more..


శ్రీ‌శ్రీ‌కి