పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..

02-12-2021

ʹ పోయి వస్తాం ʹ

శ్రీకాకుళం సెట్ బ్యాక్ నుంచి తేరుకున్న
జగిత్యాల
దేశమంతా తానై
విరిగిన పిల్లనగ్రోవి నుంచీ
గెరాల్లా స్థావరాల
పోరాట గానాన్ని వినిపిస్తున్నది
కొత్త గట్టు నుంచి మెట్టు మెట్టుగా
ఆంధ్ర దండకారణ్య బీహార్ లను
తన ప్రవాహ చొరవతో నిర్మించిన
మానేరు
నాగేటి చాళ్లలో
గంగా కావేరులై ప్రవహిస్తున్నది
చుట్టూ వాగే కాని
చూపులో దిగంతాలు నింపుకున్న
తెలంగాణ కడివెండి
క్షితిజరేఖలా స్థిరంగా
వీడ్కోలు కాదు
ప్రజావీరులకు స్వాగతం పలుకుతున్నది

‍వరవరరావు
డిసెంబర్ 2 , 1999

22 ఏళ్ళ కింద‌ అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ( ఇప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ) కేంధ్ర కమిటి సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్తదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి శీలం నరేష్ లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 1999, డిశంబర్ 1వ తేదీ న బెంగుళూరు లో పట్టుకొని కట్టేసి హెలీ కాప్టర్ లో వేసి తీవ్ర చిత్రహింసలు పెట్టి చంపేసి 2 వ తేదీన కరీంనగర్ జిల్లా కొయ్యూరులో శవాలను పడేశారు.

వీళ్ళు ముగ్గురు తెలంగాణ లో ఆంధ్రా, రాయల సీమల్లో విప్లవోధ్యమం విస్తరణకు తీవ్రంగా కృషి చేసినవారు. నల్లా ఆది రెడ్డి మొదటి తరం విప్లవ నాయకుడు. 1969 లో సాగిన ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మల్లోజుల కోటేశ్వర్ రావు (కిషన్ జీ), మరికొంత మంది సహచరులతో కలిసి పాల్గొన్న వాడు, నాయకత్వం వహించిన వాడు. పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన వాడు. ఎటువంటి సమస్యకైనా అత్యంత నైపుణ్యంతో పరిష్కారం చూయించగల దీట్ట అని పేరున్న వాడు. ఒక సారి అరెస్టయ్యి ఆదిలాబాద్ జైల్లో ఉన్నప్పుడు తనతో పాటే జైల్లో ఉన్న మరో సహచరుడి తో కలిసి చాక చక్యంగా తప్పించుకున్నాడు.

ఈ ముగ్గురు కూడా సున్నిత మనస్కులు. పోరాటంలో మాత్రం కసిగా పాల్గొనే వాళ్ళు. దేశంలోని అనేక విప్లవ గ్రూపులను ఒక్క తాటి పైకి తెచ్చేందుకు వాళ్ళు చేసిన కృషి అమోఘమైనదని , వాళ్ళు చనిపోవటం భారత విప్లవోధ్యమానికి తీరని లోటని అప్పటి పీపుల్స్ వార్ ప్రకటించింది. ప్రజల రక్షణకోసం, పార్టీ ఆత్మరక్షణ కోసం సైన్యం అవసరం ఉందని భావించిన పీపుల్స్ వార్ పార్టీ ఆ ముగ్గురు విప్లవకారుల వర్ధంతి సందర్భంగా 2000 డిశంబర్ 2 వ తేదీన పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ( PGA ) ఏర్పాటు చేసింది అప్పటి నుండి ప్రతి యేడు డిశంబర్ 2 వ తేదీ నుండి వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తోంది. 2004 సెప్టంబర్ 21 న దేశంలోనే అతి పెద్ద రెండు విప్లవ పార్టీలైన సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్, ఎంసీసీఐ లు ఐక్యమై సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన సందర్భంగా PGA ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) గా మార్చారు.

(పై వీడియో ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అంతిమ యాత్ర‌)

Keywords : cpi maoist, plga, nalla adireddy, erram reddy santhosh reddy, sheelam naresh
(2024-04-14 19:54:09)



No. of visitors : 825

Suggested Posts


20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !

భారత విప్లవోద్యమ‌ చరిత్రలో ఓ నెత్తుటి ఙాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప

PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..

22 ఏళ్ళ కింద‌ అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ( ఇప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ) కేంధ్ర కమిటి సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్తదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి శీలం నరేష్ లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు

PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌

2000 డిసెంబర్ 2 భారత పీడిత ప్రజలు తమదైన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని (PLGA) ఏర్పాటు చేసుకున్న రోజు. భారత విప్లవోద్యమ నిర్మాతలు అమరులు కామ్రేడ్స్ చారు మజుందార్, కన్హయ్ చటర్జీల దిశానిర్దేశంలో, అమరులు కామ్రేడ్స్ శ్యాం, మహేష్, మురళీల సూర్తితో, వేలాది అమరుల కలలను సాకారం చేయడానికి

20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !

భారత విప్లవోద్యమ‌ చరిత్రలో ఓ నెత్తుటి జ్ఞాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనే

PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ

సీపీఐ మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే డిశంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీవరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలంటూ మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పీఎల్జీఏ