PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ


PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ

PLGA

02-12-2021

( Maoist PLGA annual celebrations )సీపీఐ మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే డిశంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీవరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలంటూ మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. మరో వైపు మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేదని ప్రకటిస్తున్న పోలీసు అధికారులు ఈ వారోత్సవాలను అడ్డుకోవడానికి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు.

తెలంగాణలో PLGA వారోత్సవాలను జయప్రదం చేయాలంటూ, వారోత్సవాలను ఘనంగా పల్లెపల్లెనా నిర్వహించాలని చర్ల- శబరి ఏరియా మావోయిస్టు పార్టీ కార్యదర్శి అరుణ ప్రకటన విడుదల చేశారు. అనేక ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారోత్సవాలను జరగ‌కుండా చూడడానికి స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ స్వయంగా పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో రహస్యంగా కలియతిరిగారు డీజీపీ. భద్రాద్రి జిల్లా చర్ల మండలం చెన్నాపురం లో పర్యటించిన డిజిపి మహేందర్ రెడ్డి సరిహద్దుల్లో పరిస్థితులపై ఆరా తీశారు. వాహనాల తనిఖీలు, మవోయిస్టుల కదలికలు, కూంబింగ్‌ తీరుతెన్నులు, బేస్‌క్యాంపుల నిర్వహణ తీరు లాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మరో వైపు ఏవోబీ బార్డర్ లో కూడా మావోయిస్టులు వారోత్సవాలు జయప్రదం చేయడం కోసం ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

ముఖ్యం గా ఒడిశాలోని రాయగడ జిల్లా, కొం ధమాల్, కలహం డితోపాటు జిల్లా సరిహద్దులోని మునిగూడ, చం ద్రపూర్, కాశీపూర్ పోలీసుస్టేషన్లో అదనపు ఏర్పా ట్లు చేశారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో ఏజెన్సీలో కుం బిం గ్ నిర్వ హిస్తున్నా రు. మరోవైపు రాయగడ నుం చి కొరాపుట్, మల్కా న్గిరితోపాటు ఏజెన్సీ ప్రాం తాలకు రాకపోకలు జరిపే ఓఎస్ఆర్టీసీ బస్సులను రాయగడలో నిలిపివేశారు. జిల్లా కేంద్రం లోపలకు వచ్చే అన్ని చెక్ పోస్టుల దగ్గర‌ తనిఖీలు చేపడుతున్న ట్లు జిల్లా ఏఎస్పీ రాం ప్ర‌సాద్ సాహుతెలిపారు.

Keywords : cpi maoist, plga, police, dgp, mahendar reddy
(2022-01-20 01:23:44)No. of visitors : 574

Suggested Posts


20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !

భారత విప్లవోద్యమ‌ చరిత్రలో ఓ నెత్తుటి ఙాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప

PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌

2000 డిసెంబర్ 2 భారత పీడిత ప్రజలు తమదైన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని (PLGA) ఏర్పాటు చేసుకున్న రోజు. భారత విప్లవోద్యమ నిర్మాతలు అమరులు కామ్రేడ్స్ చారు మజుందార్, కన్హయ్ చటర్జీల దిశానిర్దేశంలో, అమరులు కామ్రేడ్స్ శ్యాం, మహేష్, మురళీల సూర్తితో, వేలాది అమరుల కలలను సాకారం చేయడానికి

20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !

భారత విప్లవోద్యమ‌ చరిత్రలో ఓ నెత్తుటి జ్ఞాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనే

PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..

22 ఏళ్ళ కింద‌ అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ( ఇప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ) కేంధ్ర కమిటి సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్తదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి శీలం నరేష్ లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు

పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..

22 ఏళ్ళ కింద‌ అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ( ఇప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ) కేంధ్ర కమిటి సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్తదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి శీలం నరేష్ లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


PLGA