PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌


PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌

PLGA

02-12-2021

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA వారోత్సవాల సందర్భంగా "ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం" ప్రత్యేక సంచికను విడుదల చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. వారోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేశారు.

ప్రకటన పూర్తి పాఠం...

ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం 20 ఏళ్ల వార్షికోత్సవాల ప్రత్యేక సంచిక విడుదల

ప్రజా పునదిపై సాగుతున్న గెరిల్లా యుద్ధాన్ని ముందుకు తీసుకు పోదాం!

యువతి, యువకులు PLGA లో చేరి గెరిల్లా యుద్ధాన్ని విస్తృతం - తీవ్రతరం చేస్తూ పీడిత
ప్రజల రాజ్యాధికారానికై పోరాడాలని పిలుపునిస్తున్నాం. !!

2000 డిసెంబర్ 2 భారత పీడిత ప్రజలు తమదైన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని (PLGA) ఏర్పాటు చేసుకున్న రోజు. భారత విప్లవోద్యమ నిర్మాతలు అమరులు కామ్రేడ్స్ చారు మజుందార్, కన్హయ్ చటర్జీల దిశానిర్దేశంలో, అమరులు కామ్రేడ్స్ శ్యాం, మహేష్, మురళీల సూర్తితో, వేలాది అమరుల కలలను సాకారం చేయడానికి ఆ రోజు మన పీఎల్డీఏ నిర్మాణమయింది. ఈ డిసెంబర్ 2 నాటికి మన వీర PLGA కు 21 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా యావత్తు పార్టీ కమిటీలకు, కమాండ్లకు, పార్టీ సభ్యులకు, PLGA కమాండర్లకు, యోధులకు, విప్లవ ప్రజా ప్రభుత్వాల, ప్రజాసంఘాల నాయకులకు కార్యకర్తలకు, ప్రజా మిలిషియా కమాండర్లకు, సభ్యులకు, విప్లవ ప్రజానీకానికి సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవాభినందనలు తెలియజేస్తోంది.

గత 21 సంవత్సరాలుగా భారత విప్లవోద్యమ పురోగమనానికి కృషి చేస్తూ, ఈ రెండు దశాబ్దాల కాలంలో భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతోనూ 4,483 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. వారందరికీ వినమ్రంగా విప్లవ జ్యోహార్లు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా 20 ఏళ్ల PLGA ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే లక్ష్యం తో "ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం" ప్రత్యేక సంచికను విడుదల చేస్తున్నాం. ఈ సంచికను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిస్తున్నాం.

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!

PLGA ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా గత రెండు దశాబ్దాలలో పార్టీ నాయకత్వంలో PLGA
మా-లె-మా ఎర్రపతాకను ఎత్తిపడుతూ పీడిత వర్గాల, సెక్షన్ల ప్రజల ప్రయోజనాలనే తన ప్రయోజనాలుగా ఎంచి, గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాధించిన విజయాలను ఎత్తిపట్టండి. ప్రజాసైన్యం లేకుండా ప్రజలకుండేదేమీ లేదని బలంగా చాటిచెప్పండి. సామ్రాజ్యవాదులు, వారి దళారీ పాలకుల పాలనలో ప్రజలకు దోపిడీ, పీడన, అణచివేత, అత్యాచారాలతో కూడిన దుర్భర జీవితం, పరాధీనత, మరణం తప్ప మరేమీ దక్కదు. ప్రజలకు విప్లవం తప్ప మరో మార్గం లేదు. కనుక, పిడికెడు మందిగా వున్న సామ్రాజ్యవాదులు, వారి దళారీలకు వ్యతిరేకంగా విశాల ప్రజారాశు లను సమైక్యం చేయండి.

దేశంలోనూ, ప్రపంచంలోనూ అనుకూల విప్లవ పరిస్థితిని వినియోగించుకుని వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తగిన ఎత్తుగడలు చేపట్టి విప్లవ వెల్లువను సృష్టించండి. విప్లవోద్యమంలో లోపాలను చక్కదిద్దుకుంటూ, బలహీనతలను అధిగమిస్తూ, తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలపై ఆధారపడి శత్రు వ్యూహాత్మక ʹసమాధాన్ ప్ర‌హర్ʹ పథకాన్ని సాహసోపేతంగా ఎదుర్కోండి. సోషలిజంకమ్యూనిజం లక్ష్యంతో దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో విప్లవోద్యమాన్ని మరిన్ని విజయాలు సాధించే వైపు పురోగమింపజేయండి. అంతిమ విజయం నిశ్చితంగా ప్రజలదే!

* PLGA లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులను భర్తీ చేయండి!

* సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయండి!

* బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా పోరాటాలను విస్తృతం చేయబడి, సమైక్యం చేయండి!

* పీఎల్టీ వర్ధిల్లాలి!

* ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులు, వారి దళారీ పాలకవర్గాల ప్రకృతి వ్యతిరేక, పర్యావరణ వ్యతిరేక విధ్వంసక విధానాలకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా యావత్తు భారత పీడిత ప్రజలు విశాల పోరాటాలు చేపట్టాలని కోరుతున్నాం. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు నిర్మిస్తున్న ʹనయాభారత్ʹ ను ఓడిద్దాం

* నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి!

* మార్క్సిజం -లెనినిజం -మావోయిజం వర్ధిల్లాలి

* సీపీఐ (మావోయిస్టు) వర్ధిల్లాలి

విప్లవ అభినందనాలతో
జగన్
అధికార ప్రతినిధి
భారత కమ్యూనిస్టు పార్టీ
తెలంగాణ రాష్ట్రకమిటీKeywords : cpi maoist, PLGA, jagan, telangana,
(2022-01-20 07:03:45)No. of visitors : 1255

Suggested Posts


20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !

భారత విప్లవోద్యమ‌ చరిత్రలో ఓ నెత్తుటి ఙాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప

20 వసంతాల నెత్తుటి జ్ఞాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !

భారత విప్లవోద్యమ‌ చరిత్రలో ఓ నెత్తుటి జ్ఞాపకం ఈ రోజు.... భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనే

PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ

సీపీఐ మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే డిశంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీవరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలంటూ మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు.

PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..

22 ఏళ్ళ కింద‌ అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ( ఇప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ) కేంధ్ర కమిటి సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్తదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి శీలం నరేష్ లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు

పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..

22 ఏళ్ళ కింద‌ అప్పటి సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ ( ఇప్పుడు సీపీఐ మావోయిస్టు పార్టీ ) కేంధ్ర కమిటి సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్తదర్శి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి శీలం నరేష్ లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


PLGA