వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !


వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !

వరవరరావు

03-12-2021

ప్రముఖ విప్లవ రచయిత, కవి వరవరరావు మెడికల్ బెయిల్ కేసు మరో సారి వాయిదా పడింది. బెయిల్ పిటిసన్ పై బోంబే హైకోర్టులో ఈ రోజు జరిగిన విచారణ అనంతరం కేసును ఈ నెల 17కు వాయిదా వేసిన కోర్టు వీవీ జైల్లో లొంగి పోయేందుకు 20వ తేదీ గడువు విధించింది.

వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు జరిపి రిపోర్టులు ఇవ్వడానికి మరింత సమయం పడుతుందని, సమగ్ర వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని, అవి చేస్తే తప్ప ఆయనకు ఉన్న సమస్యలను గుర్తించడం సాధ్యం కాదని ముంబైలోని నానావతి ఆసుపత్రి కోర్టుకు తెలియజేసింది. దాంతో కేసు వాయిదా వేసిన కోర్టు వీవీకి ఎప్పుడు ఏయే పరీక్షలు చేయబోతున్నారో చెప్పాలని, వచ్చే విచారణ నాటికి పరీక్షలు పూర్తి చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు ఈ ఏడాది ఫిబ్రవరి 22న కోర్టు ఆరు నెలల మెడికల్ బెయిలును మంజూరు చేస్తూ ముంబై విడిచి వెళ్ళరాదని వీవీకి నిబందన విధించింది. అయితే తన బెయిల్ పొడిగించాలని, అనారోగ్యంతో, అధిక జీవన వ్యయంతో ముంబైలో ఉండటం సాధ్యమవడం లేదని హైదరాబాద్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటూ వీవీ కోర్టును కోరారు. అప్పటి నుండి ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది.

Keywords : varavara rao, bombay high court, NIA, mumbai, hyderabad, bhima koregaon, BK16, BK15
(2022-01-20 16:12:31)



No. of visitors : 233

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


వరవరరావు