కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు


కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు

కంగనా

03-12-2021

మోదీ భక్తురాలు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పంజాబ్ రైతులు చుక్కలు చూపించారు. కార్పోరేట్ అనుకూల , ప్రజా వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాల రద్దుకై ఏడాది కాలంగా ఉద్యమం చేస్తున్న రైతులను ఖాలిస్తానీ తీవ్రవాదులు, సమాజ వ్యతిరేకులంటూ ఆమె చేసిన కామెంట్లపై రగిలి పోయిన రైతులు శుక్రవారంనాడు పంజాబ్ లో ఆమె కారును అడ్డుకున్నారు.

పంజాబ్‌లోని కిరాత్‌పూర్ సాహిబ్ మీదుగా ఆమె కారులో వెళ్తుండగా సమాచారం తెలిసిన వందలాది మంది మహిళలు, రైతులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆమె కారును ఆపేశారు. రైతులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కంగనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. కారు డోర్లు లాక్ చేసుకొని ఆమె లోపలే కూర్చుండి పోయింది. "నన్ను ఇక్కడ ఒక గుంపు చుట్టుముట్టింది. వారు నన్ను దుర్భాషలాడుతున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు" అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది.

"ఇది బహిరంగంగా మాబ్ లిన్చింగ్. నాకు భద్రత లేకపోతే నా పరిస్థితి ఏంటి ? ఇక్కడ పరిస్థితి నమ్మశక్యం గా లేదు. నేను రాజకీయవేత్తనా? ఈ ప్రవర్తన ఏమిటి?" అని తన వీడియోలో రనౌత్ అన్నారు.

చివరకు కారు దగ్గరకు వచ్చిన కొందరు మహిళలా నిరసనకారులతో మాట్లాడిన కంగనా వాళ్ళకు క్షమాపణ చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత రైతులు ఆమెను ముందుకు వెళ్ళనిచ్చారు.

కాగా వ్యవ‌సాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని కంగనా తీవ్రంగా విమర్షించింది. కొందరు ఖాలీస్తానీ తీవ్రవాదులకు ప్రభుత్వం భయపడిందని ఆమె ఆరోపించారు. "ఖలిస్థానీ ఉగ్రవాదులు ఈరోజు ప్రభుత్వాన్ని వణికిస్తుండవచ్చు. కానీ ఒక్క మహిళను మాత్రం వాళ్ళు మరచిపోకూడదు. ఏకైక మహిళా ప్రధానమంత్రి వారిని తన బూటు కింద నలిపివేసారు. ఆమె తన స్వంత జీవితాన్ని పణంగా పెట్టింది కానీ దేశాన్ని విచ్చిన్నం కానివ్వలేదు. ఈ రోజు కూడా, వారు ఆమె పేరు వింటే వణుకుతున్నారు, వారికి ఆమెలాంటి వ్యక్తే సరిఅనదిʹʹ అని కంగనా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు సిక్కు సమాజానికి తీవ్ర ఆగ్రహాన్ని కలగజేసాయి. మొత్తం సిక్కు సమాజంపై, నిరసన తెలిపిన రైతులపై "ఖలిస్థానీ టెర్రరిస్టులు" అని లేబుల్ వేయడం పట్ల పంజాబ్ ప్రజలు మండి పడుతున్నారు. ఈ విషయంపై ఆమెపై పోలీసు కేసు కూడా నమోదయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఆమెకు సమన్లు అందజేసింది.

ఒక రైతు ఉద్యమంపైనే కాక ఆమె దేశంలో జరిగిన ప్రతి ఉద్యమంపై విషం కక్కింది. కేంద్రం తీసుకవచ్చిన‌ వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత సంవత్సరం ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్షలు చేసింది.


అంతే కాదు ఈ దేశానికి 2014 వరకు స్వాత్రత్య్రం రాలేదని మోడీ ప్రధాని అయినాకే ఈ దేశానికి స్వతంత్య్రం వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Keywords : Kangana Ranaut, punjab, farmers, protest
(2022-01-20 19:09:18)No. of visitors : 339

Suggested Posts


0 results

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


కంగనా