అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌


అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌

అబుజ్‌మడ్


04-12-2021

ఆదివాసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. సిల్‌గేర్, ఎడ్స్‌మెటా తర్వాత ఇప్పుడు నారాయణపూర్ జిల్లా ఆదివాసీలు అబుజ్‌మడ్ ప్రాంతంలో కొత్త పోలీసు క్యాంపును ప్రారంభించడాన్ని నిరసిస్తూ ధర్నా ప్రదర్శన చేశారు. ఈ నిరసనలో భాగంగా, నారాయణపూర్ జిల్లాలోని గ్రామ పంచాయితీ మెటానార్, అబుజ్‌మడ్ ప్రాంతంలోని వందలాది గ్రామస్తులు బ్రెహ్‌బెడా గ్రామంలో ఐక్యంగా ర్యాలీని చేపట్టారు, సమావేశం నిర్వహించారు.

తమకు పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ఆసుపత్రి, డోర్‌ ఆసుపత్రి వంటి కనీస సౌకర్యాలు అవసరమని, కానీ ప్రభుత్వం తమ ప్రాంతంలో కొత్త పోలీసు క్యాంపును ప్రారంభిస్తోందని గ్రామస్తులు తెలిపారు. కొత్త పోలీస్ క్యాంపు ప్రారంభం కాగానే పంచాయతీ వాసులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ గిరిజనులు భయపడుతున్నారు.

తాము అడవుల్లో స్వేచ్చగా సంచరించలేకపోతున్నామనీ, భద్రతా బలగాలు తమ గ్రామాలకు వచ్చి కొట్టి చంపుతున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేయవచ్చు. అంతే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం, అర్థం పర్థం లేకుండా కేసులు పెట్టి ఏళ్ల తరబడి జైల్లో ఉంచుతున్నారని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, దోపిడీ చేయడం వంటి సమస్యలు ఉంటాయి. అందుకే శిబిరాన్ని వ్యతిరేకిస్తున్నామని, యిక ముందు కూడా వ్యతిరేకిస్తామని తెలియచేస్తున్నారు.

కానీ ప్రభుత్వమూ, ఉన్నతాధికారులు, బస్తర్ పోలీసులు ఈ నిరసనను నక్సలైట్ల ప్రాయోజితమైనదని అంటున్నారు. ముఖ్యంగా బస్తర్ గ్రామస్తులను మావోయిస్టులు ఉసిగొల్పి బలవంతంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలోకి నెట్టివేస్తున్నారని పోలీసులు అంటున్నారు.

janchowk.comసౌజన్యంతో

(తెలుగు: పద్మ కొండిపర్తి)

Keywords : chattis garh, abhujmadh, bastar, CRPF Camp, adivasi, tribal protest
(2022-01-17 21:52:52)



No. of visitors : 364

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం

అక్టోబర్ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కనీసం పన్నెండు నిరసనలు జరిగాయి. సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడానికి సుదీర్ఘ ప్రయాణాలు చేసి వస్తున్న వేలాది మంది ఆదివాసీలకు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో, సుక్మా జిల్లాలోని సిల్‌గేర్ గ్రామం నెల రోజులుగా కేంద్రంగా మారింది.

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


అబుజ్‌మడ్