తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌


తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌

తమతో

05-12-2021

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో అగ్రవర్ణాల వారితో కలిసి భోజనం చేశాడ‌న్న కోపంతో ఓ అగ్రకుల మూక‌ ఓ దళితుడిని కొట్టి చంపింది.

రమేష్ రామ్ అనే 45 ఏళ్ళ దళితుడు చంపావత్‌లోని పతి బ్లాక్‌లో టైలరింగ్ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆయన ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు అక్కడ ఆయన భోజనం చేస్తుండగా తమతో కలిసి కూర్చొని భోజనం చేస్తావా అంటూ ఓఅగ్ర కుల గుంపు రమేష్ పై దాడి చేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న రమేష్ ను స్థానికులు చంపావత్,మెర్గైన వైద్య చికిత్స కోసం లోహాఘాట్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి అతన్ని ఉన్నత వైద్య చికిత్స కోసం హల్ద్వానీలో మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ రమేష్ రామ్ మ‌రణించాడు.

పెళ్లిలో, అతను అగ్రవర్ణ పురుషులతో కూర్చుని వారితో కలిసి విందు చేసాడని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు అతడిని కొట్టారని రమేష్ రామ్ భార్య తులసీ దేవి ఆరోపించారు. దేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. నలుగురు పోలీసులతో కూడిన బృందాన్ని ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు నియమించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక పేర్కొంది.

ʹʹపోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. మేము కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాము," అని చంపావత్ ఎస్పీ దేవేంద్ర సింగ్ పించా పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.

Keywords : uttarakhand, nainital, Dehradun,Dalit man, 45, dies after being thrashed for having dinner with upper caste men
(2022-01-20 19:46:48)No. of visitors : 282

Suggested Posts


ఈ బీజేపీ మంత్రి బీకాంలో ఫిజిక్సే కాదు అధికార మదంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా !

తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా అని ప్రశ్నించగా టీచర్‌ మైనస్‌ అని చెప్పగా ఠాఠ్ మైనస్ ఎట్లైవుతది ప్లస్ అవుతది . ఇది కూడా రాని నీవు లెక్కల టీచర్ ఎట్లైనవ్ అని హూంకరిచిండు. ఆ తర్వాత మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత అని ప్రశ్నించాడు....

Maoist posters in Nainital: Police conduct raids across district

District police have raided several locations, including the house of a research scholar, three days after a government vehicle was set on fire in Nainitalʹs Dhari village by persons suspected to have Maoist links...

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు

ముఖ్యమంత్రి అవినీతిని బహిర్గతం చేసిన నలుగురు జర్నలిస్టులు ఉమేష్ శర్మ, రాజేష్ శర్మ, ఎస్పీ సెమ్వాల్, అమృతేష్ చౌహాన్ లపై రాజద్రోహం కేసు నమోదైంది.ఈ జర్నలిస్టులు తప్పుడు వార్తలను ప్రచురించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని చార్జిషీట్ పేర్కొంది. జూలై 31 అర్ధరాత్రి రాజేష్ శర్మను ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ శర్మ సంబంధిత పత్రాలను ఉమేష్ శర

లాక్ డౌన్ కాలంలో పేదలకు ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థి నేతపై కేసులు నమోదు

ప్రణాళిక లేని అనూహ్యమైన లాక్ డౌన్ తో దేశంలో పేదల, వలస కార్మికులతో సహా అనేక మంది ప్రజల జీవనం అస్థవ్యస్తమైంది. అనేక మంది ఆకలితో మాడి పోతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు, వేరే ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు, పేదలందరికి ఆహారం అందించాలని డిమాండ్ చేసినందుకు ఓ విద్యార్థి నాయకుని పై కేసులు నమోదు చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు.

అలా అయితే, మీరు వండితే మేమూ తినం - దళిత విద్యార్థుల తిరుగుబాటు

ఉత్తరాఖండ్ లోని ఓ స్కూల్ లో అగ్రవర్ణ వంటమనిషి వండిన భోజనాన్ని తాము తినబోమని భోజనాన్ని బహిష్కరించారు దళిత విద్యార్థులు.

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


తమతో