బాబ్రీ మసీదు కూల్చివేత: ప్రత్యక్ష సాక్షి అయిన‌ జర్నలిస్టు చెప్పిన సంచలన విషయాలు


బాబ్రీ మసీదు కూల్చివేత: ప్రత్యక్ష సాక్షి అయిన‌ జర్నలిస్టు చెప్పిన సంచలన విషయాలు

బాబ్రీ

05-12-2021

బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్దేశపూర్వకంగా, తెలిసి చేసారనడాన్ని రుజువు చేసే 10 కారణాలు

2020 సెప్టెంబరు 30న, కూల్చివేత ముందస్తు ప్రణాళిక కాదని, గుంపుపై నాయకులకు నియంత్రణ లేదని పేర్కొంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలందరినీ సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కూల్చివేత రోజున అయోధ్యలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ రుచిరా గుప్తా, ఆనాటి సంఘటనలను వివరిస్తూ, కూల్చివేత నాయకుల పూర్తి భాగస్వామ్యంతో జరిగిన ప్రణాళికాబద్ధమైన కుట్ర అని వివరించారు.

16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కూల్చివేతకు 1992లో జర్నలిస్టుగా నేను ప్రత్యక్ష సాక్షిని. కూల్చివేత రోజున, ఎల్‌కె అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి వంటి బిజెపి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)కి చెందిన పలువురు యితర నాయకులతో పాటు నేను మిద్దె (టెర్రస్‌)పై ఉన్నాను.
డిసెంబర్ 6న మసీదు ఉన్న అయోధ్యలో దేవాలయాన్ని నిర్మించమని ప్రజలను ఆహ్వానిస్తూ ఉత్తర భారతదేశంలో ఎల్.కె. అద్వానీ నిర్వహించిన రాజకీయ యాత్రలో నేను ఒక వారంరోజుల పాటు పాల్గొన్నాను.

RSS, BJP, వాటి మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగా, కావాలని ముందస్తుగా ప్రణాళికతో మసీదును కూల్చివేశాయని నేను విన్న, చూసిన ప్రతిదీ రుజువు చేస్తుంది. ఈ విషయాన్ని రుజువు చేసే నేను చూసిన, నా అనుభవానికి వచ్చిన పది విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1. మసీదును దేవాలయంగా మార్చాలని కాకుండా దేవాలయాన్ని నిర్మించాలనే ప్రణాళికను సూచించే నినాదం

డిసెంబర్ 3, 6 వ తేదీల మధ్య నేను పాల్గొన్న ప్రతి ర్యాలీలో, ఎల్‌కె అద్వానీ తనతో పాటు ప్రతిజ్ఞ చేయమని ప్రజలను కోరారు:

రాముడి మీద ప్రమాణం చేద్దాం
అక్కడే దేవాలయాన్ని నిర్మిద్దాం

మసీదును దేవాలయంగా మారుద్దామని అద్వానీ చెప్పలేదు. దేవాలయం వుండిన స్థలంలోనే దేవాలయాన్ని నిర్మిద్దామని అద్వానీ చాలా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా, కేవలం శాంతియుతంగా భజన చేయడం కాదనీ, అయోధ్యలో తమ స్వహస్తాలతో పనిచేయమని యాత్రలో పాల్గొన్నవారికి చెప్పారు. ʹమనం భజన గీతాలు పాడటానికి పోవడం లేదుʹ. ఈ రెండు నినాదాలు ఉద్దేశ్యాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి.

2. స్పష్టమైన, నిర్దిష్ట నినాదాలతో విధ్వంసానికి ప్రేరేపించడం

డిసెంబర్ 6న, అయోధ్యలోని మసీదు స్థలంలో, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ప్రమోద్ మహాజన్, ఆచార్య ధర్మేంద్ర, సాధ్వి రితంభర, విజయ్ రాజే సింధియా లాంటి మద్దతుదారులతో కలిసి మసీదును కూల్చివేయాలని ఉద్దేశపూర్వకంగా ప్రజలను ప్రలోభపెట్టారు. ఉమాభారతి, ఇతర నాయకులందరూ ఉపయోగించిన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రేక్షకులు నినదించిన నినాదాలలో ఒకటి: "ఏక్ ధక్కా ఔర్ దో, బాబ్రీ మసీదు తోడ్ దో. (మరొక్కసారి తోయ్యి, బాబ్రీ మసీదును కూలదొయ్యి) మసీదుపై దాడి జరిగింది. వారు గొడ్డలి, సుత్తి, ఇనుప కొక్కాలు వుపయోగించారు." కొన్ని గంటల్లో, మట్టి, సుద్దతో కట్టిన మొత్తం నిర్మాణం చదునై పోయింది. నినాదం ఉద్దేశ్యంలో అస్పష్టత లేదు. నిర్మాణాన్ని ధ్వంసం చేయడానికి గుంపును స్పష్టంగా ప్రేరేపించింది. గుంపు వద్ద గొడ్డళ్లు, సుత్తిలు, కొక్కాలు వుండడమనేది ముందస్తు ప్రణాళిక స్థాయిని రుజువు చేస్తుంది.

3. పునాదిని బలహీనపరిచేందుకు కరసేవకులు అప్పటికే ఒక కందకాన్ని తవ్వారు.
రెండవ గోపురం కూలిన తర్వాత నేను మసీదు లోపలికి వెళ్లాను. నేను మసీదు చుట్టూ తవ్విన గోతుల్ని దాటాల్సి వచ్చింది. పునాదిని బలహీనపర్చేందుకు గోతులు తవ్వినట్లు స్పష్టమైంది, ముందస్తు ప్రణాళిక స్థాయిని యిది మరోసారి సూచిస్తుంది

4. ఒక జర్నలిస్ట్‌‌గా నన్ను నిశ్శబ్దపరచడానికి, కరసేవకులు నా మీద అత్యాచారం, హత్యల ప్రయత్నం చేశారు. నేను మసీదు లోపలికి వెళ్ళినప్పుడు, చాలా మంది కాషాయరంగు బ్యాడ్జీలతో, కొందరు కాషాయ రంగు చొక్కాలతో ఉన్న పురుషుల దట్టమైన గుంపు దాదాపుగా నా గొంతు నులిమేసింది. వారు నన్ను గొంతు నులిమేయడానికి ప్రయత్నించినప్పుడు, నా మర్మాంగాల మీద కూడా గుచ్చారు. సాక్ష్యం చెప్పకుండా నన్ను అత్యాచారం చేసి చంపాలనే ఉద్దేశ్యంతో వారు నన్ను గోతిలోకి లాగారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాను. పక్కనే ఉన్న నా ఫోటోగ్రాఫర్‌పై కూడా దాడి చేసి అతని కెమెరా రోల్ లాక్కెళ్లారు. నాపై, నా ఫోటోగ్రాఫర్‌పై భౌతిక దాడి చేయడమనేది సాక్ష్యాలను తొలగించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాన్ని నిరూపించే ప్రణాళిక. మరికొందరు జర్నలిస్టులను కూడా లాక్కెళ్లి కొట్టారని నాకు తర్వాత తెలిసింది. విలేఖరులను నిశబ్దపరచడమనేది నియంత్రణ లేని ప్రేక్షకుల సామర్థ్యానికి మించిన ప్రణాళికకున్న ఆధునీకతను నిరూపించింది.

5. కరసేవకుల రద్దీని నియంత్రించడానికి, మహిళలు, జర్నలిస్టుల భద్రతకు ఎల్‌కె అద్వానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదుకొంతమంది విదేశీ జర్నలిస్టులకు రక్తం కారుతున్నప్పటికీ, జర్నలిస్టులు, మహిళలపై దాడులు చేయకూడదని మైక్‌లో ప్రకటించమన్న నా అభ్యర్థనను ఎల్‌కె అద్వానీ పట్టించుకోలేదు. జర్నలిస్టుల నోరు మూయించమని ముందస్తు ఆదేశమిచ్చారని రుజువు చేయడానికి యిది మరొక సాక్ష్యం. నాయకుడు తన స్వంత ఆదేశాలకు విరుద్ధంగా చెప్పలేకపోయాడు అని స్పష్టమైంది.

6. నాయకులు కూల్చివేత సంబరాలు జరుపుకున్నారు, చుట్టూ జరుగుతున్న విధ్వంసాన్ని ఆనందంగా చూశారునాయకులు ప్రసంగిస్తున్న టెర్రస్‌పై ప్రదర్శితమవుతున్న ఆనందోల్లాసాలకి నేను సాక్షిని. విజయ్ రాజే సింధియా, మురళీ మనోహర్ జోషి కౌగిలించుకున్నారు. విధ్వంసం చూడటం తనకు తీర్థయాత్రలా ఉందని, ఇప్పుడు తాను ప్రశాంతంగా చనిపోగలనని ఆమె అన్నది. కూలిపోతున్న మసీదు, తగులబడుతున్న గుడెసెల దగ్గర సాధ్వి రితంభర, ఉమాభారతితో పాటు ఇద్దరు పాత్రికేయులు చందన్ మిత్ర, స్వపన్ దాస్‌గుప్తాలు ఫోటోలకు పోజులిచ్చారు.

ప్రజలు ఎల్ కె అద్వానీ పాదాలకు మొక్కారు. మసీదు చుట్టుపక్కల గుడిసెలలో నివసించే పేద ముస్లింల ఇళ్లు కాలిపోతుంటే అద్వానీ తన బైనాక్యులర్‌తో చూస్తున్నాడు. నాపై జరిగిన దాడి గురించి నేను ఫిర్యాదు చేసినప్పుడు, అతను ఇలా అన్నాడు: "మీకు జరిగినదాన్ని మరచిపోండి, ఇది చాలా పెద్ద రోజు, సంబరాలు జరుపుకోండి, మిఠాయి తినండి." మహిళా జర్నలిస్టులపై దాడి చేస్తున్న నియంత్రణ లేని గుంపును చూసి దిగ్భ్రాంతి చెందిన వారి ప్రతిస్పందన అలా వుండదు అనేది మాత్రం స్పష్టం.

7. సీఆర్‌పీఎఫ్‌ని రంగ ప్రవేశం చేయకుండా ఆపాలని కరసేవకుల గుంపును అద్వానీ ఆదేశించారు
మసీదు చివరి గోపురం కూలే వరకు సిఆర్‌పిఎఫ్ రాకుండా ఆపాలని ఎల్‌కె అద్వానీ ప్రజలకు పదే పదే చెప్పడం నేను విన్నాను. ఇది నిస్సహాయతను కాకుండా గుంపుతో కుమ్మక్కు అవడాన్ని రుజువు చేస్తుంది. మసీదు కూల్చివేతలో వున్న ఉద్దేశ్యపూర్వకతను మరోసారి నిరూపిస్తుంది.

8. ముందు రోజు పూర్తి వేషభూషలతో అభ్యాసం
మసీదు కూల్చివేతకు సంబంధించిన డ్రెస్ రిహార్సల్‌ను డిసెంబరు 5న తాను చూశానని కూల్చివేత రోజు అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ జైన్ తెలిపారు.

9. నేను చూసిన నిజాన్ని అణచివేయడానికి మితవాద పక్ష లాయర్లు నన్ను చరిత్రహీనురాలిగా చిత్రించడానికి ప్రయత్నించారు.లిబర్‌హాన్స్ కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ, బహ్రీ ట్రిబ్యునల్, ప్రెస్ కౌన్సిల్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాయర్లు నన్ను అడిగిన ప్రశ్నలు నేను చూసిన వాటికి సంబంధించినవి కావు. ఒక మహిళగా నన్ను కించపరచడానికి, ʹచెడు చరిత్రʹ కలిగినదానిగా నిరూపించడానికి ఉద్దేశించబడినవి.

ʹనేను ధూమపానం చేస్తానా, ఏ దేవుడినైనా పూజిస్తానా, టీవీ సీరియల్స్‌‌లో నటించానా, నాకు ఎంత మంది మగ స్నేహితులు ఉన్నారు, నా మీద భౌతిక దాడి జరిగిన తరువాత చెదిరిపోయిన స్థితిలో అద్వానీ వంటి నాయకుడితో మాట్లాడటానికి ఎలా వెళ్లగలిగానుʹ అని నన్ను అడిగారు. నన్ను అవమానించడానికి ప్రయత్నం చేశారు. వారి ఉద్దేశ్యపూరకతను నిర్ధారించగల, వారిని అప్రతిష్టపాలు చేసే ప్రణాళికను ఇది మరోసారి రుజువు చేస్తుంది.

10. అటల్ బిహారీ వాజ్‌పేయి ఒక మహిళను అనే కారణంతో సాక్ష్యం చెప్పకుండా నన్ను అడ్డుకున్నారు.
ʹమంచి కుటుంబాల్లోని అమ్మాయిలు తమకు శారీరకంగా ఏమి జరిగిందో దాని గురించి మాట్లాడరుʹ అని నాకు సలహా ఇవ్వడం ద్వారా బిజెపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా నన్ను సాక్ష్యం ఇవ్వకుండా ఆపడానికి ప్రయత్నించారు. జరిగిన విషయాన్ని మరిచిపోయి ముందుకు కొనసాగాలని కోరారు. అనుకోకుండా ఇలా జరిగిందని పార్టీ క్షమాపణ చెబితే నేను ఆయన చెప్పినట్లుగా మరిచిపోతానని చెప్పాను. అలా చేయడం కుదరదని అన్నారు. నాపై జరిగిన దాడి అనాలోచితంగా జరిగిందని, ఉద్దేశ్యపూర్వకంగా జరగలేదని తన పార్టీ నుంచి అగ్రనేత ప్రకటన రాబట్టలేకపోయినప్పుడు, మసీదు కూల్చివేత అనాలోచితమని కోర్టు ఎలా తీర్పునిచ్చింది?

మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో లేదా ఉద్దేశ్యపూరితంగా చేసినది కాదని, నేరం జరిగిన 28 సంవత్సరాల తర్వాత లక్నోలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రత్యేక న్యాయస్థానం, మొఘల్ కాలం నాటి మసీదును కూల్చివేసేందుకు ఒక గుంపును ప్రేరేపించి, నేరపూరిత కుట్రకు పాల్పడిన 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది..

వారు నినాదాలు వినలేదా, మసీదు పునాది చుట్టూ తవ్విన కందకం ఫోటోలు చూడలేదా, దాడులు, నిశ్శబ్దపరచడాల గురించిన పాత్రికేయుల కథనాలు వినలేదా, మసీదు పూర్తిగా ధ్వంసం అయేవరకు CRPF ని కళ్యాణ్ సింగ్ రానివ్వలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదా లేదా నాయకులు గుంపును నడిపించిన తీరు గురించి ప్రత్యక్షసాక్షుల కథనాలను వినలేదా అని నాకు ఆశ్చర్యంగా వుంది.
వారు భౌతికంగా నాపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించినప్పుడు కూడా నిందిత నాయకులలో ఒకరు కూడా గుంపును ఆపడానికి ప్రయత్నించడం నేను ఖచ్చితంగా వినలేదు, చూడలేదు.
ఆరోజు అద్వానీ వెళ్లిపోయాకనే నేను అయోధ్యనించి వెళ్ళాను.
వారందరినీ నిర్దోషులుగా విడుదల చేయడం సిగ్గుచేటు.
అది భారతదేశానికి ఉపయోగపడదు.

(రుచిరా గుప్తా సీనియర్ జర్నలిస్ట్, కార్యకర్త)

theleaflet.in లో పోస్ట్ చేసిన ఈ వ్యాసం తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి

https://www.theleaflet.in/10-reasons-that-prove-babri-masjid-demolition-was-intentional-and-deliberate/

Keywords : babri Masjid,demolition, RUCHIRA GUPTA, 10 Reasons that prove Babri Masjid Demolition was Intentional and Deliberate
(2022-01-20 01:52:24)No. of visitors : 536

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


బాబ్రీ