ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..


ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..

ఆదివాసీ

ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు అనాగరికంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా పోలీసు స్టేషన్ పరిథిలోని బఖార్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల ఏడవ తేదీన గ్రామస్తులంతా కలిసి కొరుక్ అనే ఆదీవాసీ తెగకు చెందిన ఓ మహిళపై మత్రాలు చేస్తోందనే ఆరోపణలు చేస్తూ ఆమెను కొట్టుకుంటూ ఇంట్లోంచి బైటికి గుంజుకొచ్చారు. అడ్డుకున్న భర్తను కూడా విపరీతంగా కొట్టారు. ముప్పైఐదేళ్ళ ఆయువతి ఒంటి మీద బట్టలు చించేసి నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఆమెతో బలవంతంగా మురికి కాలువలోని నీళ్ళను తాగించారు. కర్రలతో దారుణంగా కొట్టారు. ఇంత జరుగుతున్నా గ్రామస్తులంతా సినిమా చూస్తున్నట్టు చూశారు తప్ప ఎవ్వరూ అడ్డుకోలేదు. అయితే ఆ యువతి భర్త తప్పించికొని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆగ్రామానికి చేరుకోగానే దాడి చేస్తున్న గుంపు పరారయ్యింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. యువతి పై దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులువిచారణ ప్రారంభించారు.

Keywords : Madhya Pradesh, Woman Paraded Naked, Forced to Drink Water From Sewage
(2018-04-19 01:15:08)



No. of visitors : 5052

Suggested Posts


దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రి

ఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య....

లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియా

ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya Pradesh

Extending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants....

ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు

ప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....

Search Engine

క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులు
అమరుడు రాజన్నకు జోహార్లు - తెలంగాణ ప్రజా ఫ్రంట్
more..


ఆదివాసీ