ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్


ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్

ఉద్యోగుల

05-01-2022

సిపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటన పూర్తి పాఠం ...

ఉద్యోగుల విభజ‌నలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగ అవకాశాలను కోల్పుతున్న నిరుద్యోగులు, విభజన ప్రక్రియ ద్వారా బలి అవుతున్న ఉద్యోగులు, యువకులు ఏకమై జీవో నెం. 317ను రద్దు చేసే వరకు పోరాడండి.

స్థానికత లేకుండా మెరిట్, సీనియార్టీ ఆధారంగా కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియ మూలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలతో అన్నీ ప్రాంతాల స్థానిక విద్యార్థులు, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పుతున్నారు. ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్ద్యేశ పూర్వకంగానే విభజన ప్రక్రియ చేపట్టి స్థానిక నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తుంది. ఆశాస్త్రీయ పద్ధతులలో కొనసాగిస్తున్న బదిలీలతో ఇప్పటికే ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్య మూలంగా ఉద్యోగులు మానసికంగానే కాకుండా, ఆర్ధికంగా కూడా ఇబ్బందులకు గురి అవుతారు.

టీఆర్ఎస్ ప్రభుత్వపు అనాలోచిత చర్యను 3 లక్షలకు మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం పరిగణంలోకి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలు చేస్తుంది. ఉద్యోగులతో కనీసం చర్చించకుండా బలవంతంగా అమలు పరుస్తున్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువకులు ఐక్యమై పెద్ద యెత్తున ఉద్యమాలు చేపట్టమని పిలుపునిస్తున్నాం.

విప్లవాభివందనాలతో
జగన్
అధికార ప్రతినిధి
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
తెలంగాణ రాష్ట్ర కమిటీ

Keywords : employees, teachers, transfers, telangana, kcr, cpi maoist
(2022-05-28 10:28:57)No. of visitors : 811

Suggested Posts


0 results

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


ఉద్యోగుల