SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా


SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా

SKM:

06-01-2022

బుధవారం నాడు పంజాబ్ లో ప్రధాని పర్యటన రద్దుకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని ప్రాణాలకు ముప్పు అనే ప్రచారం చేయడాన్ని SKM ఖండించింది. రైతులు ఎక్కడా ప్రధానిని అడ్డుకోలేదని SKM స్పష్టం చేసింది. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....

1. జనవరి 5న పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వస్తున్నారనే వార్త తెలియగానే, సంయుక్త కిసాన్ మోర్చాకు అనుబంధంగా ఉన్న 10 రైతు సంఘాలు అజయ్ మిశ్రా తేని అరెస్టు చేయాలని,మరికొన్ని ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతీకాత్మక నిరసనను ప్రకటించాయి. ఇందు కోసం, జనవరి 2న పంజాబ్ అంతటా గ్రామ స్థాయిలో, జనవరి 5న జిల్లా, తహసీల్ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు మరియు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు ప్రకటించబడ్డాయి. ప్రధాని పర్యటనను, ఆయన కార్యక్రమాలను అడ్డుకునే కార్యక్రమం రైతు సంఘాలకు లేదు.

2. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 5న పంజాబ్‌లోని ప్రతి జిల్లా, తహసీల్ ప్రధాన కార్యాలయంలో శాంతియుత నిరసనలు జరిగాయి. ఫిరోజ్‌పూర్ జిల్లా కేంద్రానికి వెళ్లకుండా కొంతమంది రైతులను పోలీసులు అడ్డుకోవడంతో, వారు చాలా చోట్ల రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. వీటిలో ప్రధానమంత్రి కాన్వాయ్ వచ్చి ఆగి వెనక్కి వెళ్లిన పర్యాయానా ఫ్లై ఓవర్ కూడా ఉంది. అక్కడ నిరసన తెలుపుతున్న రైతులకు అసలు ప్రధాని కాన్వాయ్ వెళుతుందన్న సమాచారమే లేదు. ప్రధాని తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మీడియా ద్వారా వారికి ఈ సమాచారం అందింది.

3. నిరసన తెలుపుతున్న రైతులు ప్రధాని కాన్వాయ్ వైపు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదని ఈ సందర్భంగా వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఆ కాన్వాయ్ దగ్గరకు బీజేపీ జెండాతో, "నరేంద్ర మోడీ జిందాబాద్" నినాదంతో ఒక గుంపు మాత్రమే చేరుకుంది. అందువల్ల, ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది పూర్తిగా కల్పితం.

4. తన ర్యాలీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రధానమంత్రి పంజాబ్ రాష్ట్రాన్ని, రైతుల ఉద్యమాన్ని రెండింటినీ "ఏదో ఒకవిధంగా తన ప్రాణాలను కాపాడారు" అనే సాకుతో దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించడం చాలా విచారకరం. ప్రాణహాని ఉందంటే అది రైతులకు మాత్రమే. అజయ్ మిశ్రా తేని లాంటి నేరగాళ్ళైన‌ మంత్రులు స్వేచ్చగా తిరుగుతున్నారనే విషయం దేశం మొత్తానికి తెలుసు. దేశ ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయకూడదని సంయుక్త కిసాన్ మోర్చా భావిస్తోంది.

జారీ చేసినవారు

బల్బీర్ సింగ్ రాజేవాల్,
డా. దర్శన్ పాల్,
గుర్నామ్ సింగ్ చదుని,
హన్నన్ మొల్లా,
జగ్జిత్ సింగ్ దల్లేవాల్,
జోగిందర్ సింగ్ ఉగ్రహన్,
శివకుమార్ శర్మ (కక్కా జీ),
యుధ్వీర్ సింగ్,
యోగేంద్ర యాదవ్

సంయుక్త కిసాన్ మోర్చా

Keywords : punjab, prime minister, narendra modi, samyukta kisan morcha, bjp
(2023-05-31 14:43:48)



No. of visitors : 440

Suggested Posts


The Punjab remembers the immortal contribution of Shaheed Bhagat Singh

SALUTE THE CONFERENCE AND RALLY OF PUNJAB STUDENTS UNION AND NAUJWAN BHARAT SABHA IN FEROZEPUR WHICH CARRIED ON THE LEGACY OF THE IMMORTALS MARTYRS BHAGAT SINGH,SUKHDEV AND RAJGURU...

అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!

పంజాబ్ లోని రోహతక్ లో జాట్ కులానికి చెందిన రమేశ్ కుటుంభం రెండేళ్ళ వయసున్న అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమె పేరు మమత. ఇప్పుడు ఆ అమ్మాయికి 18 ఏళ్ళు. ఆమె దళిత యువకుడైన సోంబీర్ ను ప్రేమించింది.

Students Oppose Fee Hike - Police Brutally attacked on Students

Tension prevailed on the Punjab University campus as students protest the senate approval of the ʹenhancement in fee structure of various courses being taught at University Campus and at its Regional Centresʹ...

At least 66 Panjab University students booked on sedition charges for protesting fee hike

At least 66 students of Panjab University have been booked on sedition charges for protesting against the fee hike in the campus. Following an outcry over the move, a senior officer of Chandigarh Police....

Release Professor Saibaba Now ! Call from Jalandhar, Punjab

It has also reflected how the state has sharpened itʹs fascist fangs like never before bowing to the dictates of pro corporate international policies.In areas of Jharkhand,Chattisgarh and Chandrapur virtual fascism is perpetrating the judicial system.....

PUNJAB: రైతుల నిరసనలలో చిక్కుకుపోయిన ప్రధాని - అర్దాంతరంగా పర్యటన రద్దు

రైతుల నిరసనల కారణంగాప్రధానినరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ పంజాబ్ పర్యటనను అర్దాంతరంగా ముగించుకొని వెనుదిరిగారు.

కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


SKM: