మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె


మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె

మీ

06-01-2022

ఉభయకుశలోపరి...

మీరు మంచిగుండాలె... ఒక సినిమా పాటలెక్క .. సమరసింహా రెడ్డి లాగానో...భరతసింహా రెడ్డి లాగానో. మేం ఎట్లున్న మిమ్ముల భజన జెయ్యాలె. మిమ్ముల ప్రశ్నించుడా.. రామ రామ. చెంపలెసుకునే ఎమోజీ లు ఎనుకులాడిన గాని దొరుకలేదు.

మీరు ఏమన్న జేసుకోండి. మీరు పుట్టిందే మమ్ముల ఉద్ధరించడానికి.. మేము కాలి కింద చెప్పుల్లెక్క. మా నాలికలు మీ భజన జేసెటానికే.. మావి బాంచె బతుకులు.. మా పొల్లగాండ్లెవలన్న మిమ్ముల తప్పి దారి ప్రశ్నిస్తె మా గూటి పక్షులు మిమ్ముల ఏమనకుండ మమ్ముల కుల్లబొడుస్తయి. మీరెంత గొప్పోల్లు.. మీదెంత భారీ మనుసు. మమ్ముల ఎగిలవారిన కాన్నించెల్లి కంటికిరెప్పోలె కాపాడుకుంటాండ్లు.
మీరు మీరు ఆవులలెక్క. మీకొట్లాటల మా ల్యాగల కాల్లు ఇరగ్గొడుతరు. మాకే సమజి గాక జెరంత ఎగబగారం అయితానం.మీరు వొడ్లంటె వొడ్లగురించెల్లి కొట్లాడాలె. బియ్యమంటె బియ్యం గురించెల్లి నిలదియ్యాలె. మీరు ఉన్నీసంటె ఉన్నీస్.. బీసంటె బీసు. మా పొల్లగాండ్లకు ఎరుకగాక యాడనన్న నోరుజారుడో పెన్ను జారుడో చేసిండ్లే అనుకో.. మీ మొకాన ఉన్న మావోళ్లు మమ్ముల దిడుతరు గద. తిట్టకపొయ్యినా గ్రూపుల్ల జెరంత లాసిగనే యెటకారం జేస్తరు గద. మీ ముంగట అంబ్యాదోళ్ల లెక్క గాకుంట జెరంత తెలివి ఎవలకన్న వొస్తె అది న్యాయమైతదా... మేం యాడబన్నోళ్లం గాడనే ఉండాలె. లేకుంటె మీరేం జేస్తరో ఎరుకైతాంది గద.

వార్తలేంది.. వ్యాఖ్యలేంది.. పేపల్రేంది.. ఛానళ్లేంది. వెబ్ సైట్ లేంది.. యూ ట్యూబ్ లేంది.. మీ సందు దాటకుండ ఎవ్వలు ఊరు దాటొద్దు. మీ జోలికొస్తె ఎట్లుంటదో సమజైతాంది.. మిమ్ముల ఉత్తరించుడా.. మీ స్తోత్రాలు జెయ్యక బతుకుడా... మీరు జెప్పకపోతె ఊళ్లె కోడి గుతం కుయ్యకుండ జేసే రోజులున్నయని మాకు దెలువక పాయె. కోడి కుయ్యాల్నన్నా మీరే..కోడి కొయ్యాల్నన్నా మీరే..
మీకు దెలువకుంట రాసుడుగద ..ఏమీజెప్పలేక పోతాన.. మొన్న సరిదయితె ఒక్క పాలి తుమ్మొచ్చెటట్టనిపిచ్చింది. కాని మీకు దెలువకుండ తుమ్ముడా.. అపచారం... మీకు జెప్పకుండ తుమ్ముడుండదు.. మీకు తెలువకుండ దగ్గుడుండదు..

కోడి గూసుడే కాదు. మీ ఎరుకలేకుండ ఎగిలివారదు. ఎనుకటికి సూర్యున్ని తొందరగ పొద్దుమీకేటట్టు జేసిన సైంధవుని లెక్క గాదు గాని మీకు దెలువకుండ పొద్దుమీకదు.
మా పొల్లగాండ్లేమన్న తప్పు జేస్తె జైల్ల బెట్టుకోండ్లి. మీ మొకాన లేకుంటె ఈ పాత వొదిలిపెట్టండ్లి..
మా ఇంటికాడ నైతె గిదే పాట పాడుకుంటం
"సమరసింహా రెడ్డీ మీరు సల్లంగుండాలె...
భరతసింహా రెడ్డీ మీరు బాంబులెయ్యాలె...."
నాకు సినిమ పాటలు రావుగానీ మీరే మహానుభావులు...
ఉంట మరి..

- పీవీ కొండల్ రావు

Keywords : telangana, kcr, bjp, freedom of speech
(2022-05-27 17:05:10)No. of visitors : 455

Suggested Posts


0 results

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


మీ