బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు


బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు

బుల్లిబాయ్

07-01-2022

దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నీరజ్ బిష్ణోయ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుకు ముందు సోషల్ మీడియాలో కొత్త ఎత్తుగడలతో పోలీసులను గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశాడు నీరజ్. ట్విట్టర్‌తో తనకు అంతకు ముందున్న ఖాతాను తొలగించి, కొత్త ఖాతాల తెరిచి.. సదరు యాప్ రూపకర్తను తానే అంటూ కొత్త నాటకం ఆడబోయాడు. అయితే ఈ ఖాతా కూడా అతడిదేనని పోలీసులు గర్తించారు.

20 ఏళ్ళ‌ నీరజ్ బిష్ణోయి రూపొందించిన ఈ బుల్లి బాయ్ యాప్‌లో ముస్లిం మహిళల్ని అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. ముస్లిం మహిళల ఫొటోలను ఎడిట్ చేసి, వాటి ముఖాలను మార్పింగ్ చేసి ఇందులో అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో ప్రధాన నింధితుడు నీరజ్ బిష్ణోయినే. అస్సాంకు చెందిన నీరజ్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నాడు. కాగా, ఇతడిని బుధవారం అస్సాంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీకి తీసుకువచ్చి విచారిస్తున్నారు.

ఇదే కేసులో ఇంతకు ముందు శ్వేతా సింగ్ , విశాల్ కుమార్ ఝా, మయాంక్ రావల్ అనే ముగ్గురు వ్యక్తులను ముంబై అరెస్ట్ చేశారు. అయితే వారిని ఈ కేసు నుంచి తప్పించేందుకు బిష్ణోయ్, తాను అంతకు ముందు వాడిన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసి, కొత్త ఖాతాను సృష్టించి.. అందులో నుంచి యాప్ తయారు చేసింది తానేనని, ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్న వారికి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పుకొచ్చాడు. అయితే డిలీట్ చేసిన ఖాతాతో పాటు కొత్త వాడుతున్న ఖాతా కూడా బిష్ణోయ్‌దేనని పోలీసులు గుర్తించారు.

కాగా బుల్లీబాయ్ యాప్ లో ముస్లిం మహిళల మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వారిని వేలం వేశారనే విషయం తెలిసిందే. దాదాపు వందకు పైగా ముస్లిం మహిళలు బాధితులుగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్షించే , సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండే మహిళలనే ఈ నలుగురు టార్గెట్ చేసుకున్నారు

Keywords : bulli bai, app, case, muslim women, neeraj bishnoi, assam, madhyapradesh, bhupal, delhi police
(2022-05-28 10:28:46)No. of visitors : 469

Suggested Posts


ఇద్దరు ʹబుల్లీబాయ్ʹ నిందితుల‌ అరెస్టు

నరనరాన ద్వేషం,విషం, మతోన్మాదం నింపుకున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

యాప్ ల ద్వారా ముస్లిం మహిళలపై లై‍గిక వేధింపులు - రాష్ట్రపతికి మహిళా సంఘాల లేఖ‌

దురదృష్టవశాత్తూ ఒక సంవత్సరం లోపలే రెండవసారి అత్యంత అసహ్యకరమైన స్త్రీ ద్వేషాన్ని మేం చూసాం. మొదట, 2021 జూలైలో, ప్రముఖ ముస్లిం మహిళలు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు

Bulli Bai:బుల్లీబాయ్ యాప్ కేసు - ఉత్తరాఖండ్ లో మూడో నిందితుడి అరెస్టు

ʹబుల్లి బాయిʹ యాప్ కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన మరో విద్యార్థిని ముంబై సైబర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ రావల్ (21) అనే విద్యార్థిని అరెస్టు చేసినట్లు సైబర్ అధికారి ఒకరు తెలిపారు.

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


బుల్లిబాయ్