chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం


chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం

chattisgarh:

16-01-2022

పెసా చట్టం, ఐదవ షెడ్యూల్, గ్రామసభను సక్రమంగా అమలు చేయడం, పోలీసు క్యాంపుల ప్రారంభం, బూటకపు ఎన్‌కౌంటర్‌ల వంటి అంశాలకు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాబల్య జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తీవ్రతరమైంది. బస్తర్ డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు తమ హక్కులు, అధికారాలు, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరసన తెలియచేయడానికి తమ గ్రామాల నుండి రోడ్లమీదికి వస్తున్నారు. రాజ్యాంగ హక్కులైన గ్రామసభ, పెసా చట్టం, పాలనపై ఐదవ షెడ్యూల్ వంటి నిబంధనలను అమలుచేయడం లేదనే ఆరోపణలతో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాలోని గ్రామస్థులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు చేస్తున్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పెద్ద ఉద్యమాలు చేశారు.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీల ప్రాబల్య ప్రాంతాల్లో ఉద్యమం నడుస్తోంది, వారు తమ డిమాండ్ల కోసం తమ సంప్రదాయ దేవుళ్లతో, సంప్రదాయ ఆయుధాలతో ఆందోళనకు దిగుతున్నారు.

బస్తర్ డివిజన్‌లో ఆదివాసీల ప్రాబల్యం ఉన్న మొత్తం ఏడు జిల్లాలు, కంకేర్, బస్తర్, నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, సుక్మా, కొడగావ్‌లలో గ్రామస్తులు వేర్వేరు సమయాల్లో ఆందోళనలు చేశారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరవధిక నిరసనలు చేస్తున్నారు.

బస్తర్ డివిజన్‌లోని అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్న ఆ ఉద్యమాలకు ఏ రాజకీయ పార్టీ, ప్రతిపక్ష నాయకుడు, లేదా ప్రఖ్యాత సామాజిక కార్యకర్త నాయకత్వం వహించడం లేదన్నది గమనించాల్సిన ముఖ్య విషయం.

అందరూ లోతట్టు ప్రాంతాల నుండి వచ్చిన గ్రామస్తులు. వారే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు.

పోలీసు క్యాంపు, రోడ్డు, బెచాపాల్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ వంటి అంశాలపై, బీజాపూర్ జిల్లాలోని భైరామ్‌ఘడ్ బ్లాక్‌లో నెల రోజుల నుండి పెద్ద ఉద్యమం జరుగుతోంది. ఆందోళనలో పాల్గొన్న నాలుగు నుండి ఐదు వేల మంది గ్రామస్తులు ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న తాడ్ బక్రీ అనే గ్రామంలో జనవరి 11వ తేదీన ఒకరోజు ధర్నా చేసి, తమ సాంప్రదాయ ఆయుధాలతో ప్రధాన రహదారిపై ఆందోళన చేయాలనుకున్నారు, కానీ పోలీసులు అడ్డుకుని, ముందుకు వెళ్ళనీయలేదు.

వారి ప్రధాన 12 డిమాండ్లు -

1. బస్తర్ డివిజన్‌లో PESA చట్టం, ఐదవ షెడ్యూల్, గ్రామసభలను అమలు చేయాలి.

2. పెద్ద పెద్ద రోడ్లు, కల్వర్టులు, పోలీస్ క్యాంపులు అక్కర్లేదు.

3. కనీస అవసరాలైన విద్య, ఆసుపత్రి, అంగన్ వాడీ, తాగునీరు కావాలి.

4. బస్తర్ డివిజన్ మొత్తంలో అమలవుతున్న పోలీసుల మారణకాండ, అణచివేత దౌర్జన్యాలు, పోలీసు గస్తీని తక్షణమే నిలిపివేయాలి!

5. నక్సలైట్ కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో ఉన్న ఆదివాసీలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలి.

6. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల హామీ యివ్వాలి. నీరు, అటవీ భూమిని లాక్కునే వారిని బహిష్కరించాలి.

7. అటవీ, భూమి, నీరు ఆదివాసీల హక్కు, దానిని బలవంతంగా లాక్కోకూడదు.

8. ఆదివాసీలు బానిసలుగా వుండరు.

9. హిందూ బ్రాహ్మణవాద భూస్వామ్య విధానం నుండి విముక్తి కావాలి.

10. ప్రాణాన్నైనా యిస్తాం కానీ, భూమిని ఇవ్వం.

11. గ్రామాల్లో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం, ఈ ప్రతిపాదనను రద్దు చేయాలి.

12. ఆదివాసీ ప్రాంతాలలో గ్రామసభ అనుమతి లేకుండా ఏ పనీ చేయరాదు.

ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించే వరకు మేము ఇక్కడే ధర్నా చేస్తాం, ఆందోళన కొనసాగిస్తాం అని గ్రామస్తులు దృఢంగా నిలబడ్డారు.

కరోనా విపత్తు, ఓమిక్రాన్‌ల వ్యాప్తి దృష్ట్యా పరిపాలనా యంత్రాంగం జిల్లాలలో సెక్షన్ 144 విధించి, భద్రతా బలగాలను మోహరించి, ఆందోళన చేస్తున్న గ్రామస్తులను ప్రధాన రహదారిపైకి రాకుండా అడ్డుకున్నది. ఈ గ్రామస్తులు చాలా గంటలపాటు తాడ్‌బక్రీ గ్రామంలో కూర్చున్నారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని అధికారులు హామీ యివ్వడంతో సాయంత్రానికి వెనుదిరిగారు.

ʹమమ్మల్ని అడగకుండానే ప్రభుత్వం పోలీసు క్యాంపులను ఏర్పాటు చేసి పెద్ద రహదారిని నిర్మిస్తోంది. మాకు రోడ్డు కావాలి, కానీ పెద్ద రోడ్డు కాదు, చిన్న రోడ్డు. పెద్ద రోడ్డు వేయడం వల్ల మా పొలాలు పాడైపోతున్నాయి, రోడ్లు వేయడానికి మా పొలాలు తవ్వడంతోపాటు చెట్లను కూడా నరికివేస్తున్నారు. మాకు కూడా సౌకర్యాలు కావాలి, మా గ్రామాల్లో రోడ్లు వేయాలి కానీ చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు కాదు. గ్రామాల్లోని భద్రతాదళాల క్యాంపులకు బదులు పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రులు నిర్మించాలి. గ్రామసభ, పెసా చట్టం వంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నప్పటికీ, అనుమతి లేకుండా ప్రభుత్వం పోలీసు క్యాంపులు నిర్మిస్తోంది. మా భూమి లాక్కుంటున్నారు. ప్రభుత్వం చెయ్యాలనుకునే ఏ పని అయినా వెంటనే జరుగిపోతుంది కానీ, ప్రజలకు సంబంధించిన పనులు జరగవు. గత రెండు మూడు నెలలుగా చెట్లు, పొలాల తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు యిచ్చినా ఇంతవరకు ఏ స్పందనా లేకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందిʹఅని వివరించిన సుక్‌రామ్ ఒర్సా అనే యువకుడు తాను చదువుకున్నానని, గత రెండు మూడేళ్లుగా ఉపాధి, ఉద్యోగాల కోసం వెతికి, గ్రామానికి తిరిగి వచ్చానని వివరించారు.

ముందుగా గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. అనుమతి లేకుండా, గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం చెట్లను నరికి రోడ్డు కోసం భూమిని తవ్విస్తోంది. పొలాల్లో పనిచేసేటప్పుడు లేదా అడవిలో కట్టెల కోసం, వేట కోసం విల్లంబులు, బాణాలు, గొడ్డళ్లు తీసుకు వెళ్తే నక్సలైట్లమని పోలీసులు పట్టుకెళ్తారు. మాకు అడవులు, పొలాలే జీవనాధారం. పని చేసుకునేటప్పుడు పోలీసు సిబ్బంది వచ్చి మమ్మల్ని వేధిస్తారు. అందుకని ఆందోళన చేస్తున్నాం అని మరో ఆందోళనకారుడు, ʹబస్తర్ మూల్ నివాసి బచావోʹ సభ్యుడు వివరించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీల ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతోంది.

గత 2021లో, బీజాపూర్ జిల్లాలోని సింగారం, గోంపాడ్, పుస్నార్, సుక్మా జిల్లాలోని నారాయణపూర్‌లోని సిల్‌గేర్, సర్కేగూడ, అడ్సమేట, అబూజ్‌మడ్ వంటి ప్రాంతాల్లో అనేక పెద్ద ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు వేలాది మంది గ్రామస్తులు బెచాపాల్ క్యాంపు, రోడ్డు నిర్మాణాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు..

(janchowk.com సౌజన్యంతో)
తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి

Keywords : chattiss garh, bastar, adivasi, movement, crpf camps,
(2022-05-26 19:03:17)No. of visitors : 384

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


chattisgarh: