ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?


ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?

ప్రొఫెసర్

16-01-2022

2014 మే లో అరెస్టయినప్పటి నుండి, నాగ్‌పూర్ జైలు అధికారులు ప్రొఫెసర్ సాయిబాబాకు అతని ప్రాథమిక హక్కులను నిరాకరించారు, ఈ ప్రక్రియలో కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారు.

ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబాకు మళ్లీ కోవిడ్ సోకిందా? 90% వికలాంగులైన ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ ప్రొఫెసర్, మావోయిస్టులతో సంబంధం ఉన్నదనే ఆరోపణతో 2017 నుండి జీవిత ఖైదు అనుభవిస్తున్నారని, అతనికి ఇన్‌ఫెక్షన్ సోకలేదని, క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తున్నామని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని ఖైదీలెవరీకీ కోవిడ్ పాజిటివ్ రాలేదని జైలు అధికారులు Rediff.comకి తెలిపారు.

ఢిల్లీలో తమ కుమార్తెతో కలిసి నివసిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత కుమారి మాట్లాడుతూ, తన భర్తకు ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నాయని శ్రేయోభిలాషుల నుండి విన్నానని, అందుకే అతనికి మళ్లీ కరోనా వ్యాధి సోకిందేమోననే తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.

ఖైదీలకు ఫోన్ చేసి మాట్లాడే అనుమతి కుటుంబ సభ్యులకు లేదు కాబట్టి, ఆమెకు సమాచారం తెలుసుకొనే మార్గం లేదు.

లాక్డౌన్ సమయంలో వ్యక్తిగత ములాఖాత్‌లు నిలిపివేయడంతో బొంబాయి హైకోర్టు ఫోన్ కాల్‌లను అనుమతించింది. అయితే, గత సంవత్సరం కోవిడ్ రెండవ వేవ్ తగ్గిన తరువాత, కుటుంబాలు ఖైదీలను కలవడానికి అనుమతించారు కాబట్టి ఫోన్ కాల్స్ నిలిపివేసారు.

2021 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ సాయిబాబాకు కోవిడ్ సోకినప్పుడు వసంత భయాందోళనకు గురైంది. లక్షణాలు కనిపించడం ప్రారంభించిన దాదాపు ఒక నెల తర్వాత అతన్ని పరీక్షించారు, అది కూడా ఆమె జైలు అధికారులకు ఇ-మెయిల్ అభ్యర్థన పంపిన తర్వాతనే.

చిన్నతనంలో పోలియో వల్ల వచ్చిన పక్షవాతం రావడం తన కదలికల కోసం వీల్‌చైర్‌ మీద ఆధారపడాల్సి వుంటుంది. రక్తపోటు, దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాకు 2014లో అరెస్టయ్యే వరకు రామ్ లాల్ ఆనంద్ కాలేజీలో బోధించే సమర్థత వుండింది.

మొదట 2014 నుండి 2015 వరకు విచారణా ఖైదీగా, ఆపై మార్చి 2017 నుండి దోషిగా గడిపిన సుదీర్ఘ జైలు జీవితం అతని ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీసింది. ఒక చేతిని ఉపయోగించలేకపోతున్నాడు; తీవ్రమైన గుండె, మూత్రపిండాల సమస్యలతో సహా 19 వ్యాధులతో బాధపడుతున్నాడు.

2020 అక్టోబరులో, ప్రొఫెసర్ సాయిబాబా తన ప్రాథమిక హక్కుల కోసం మళ్లీ నిరాహార దీక్ష చేపట్టారు (మొదటిసారి 2015లో విచారణా ఖైదీగా ఉన్నప్పుడు చేశారు): 2018 నవంబర్ నుండి వైద్య చికిత్స మొదలుకొని పుస్తకాలు, వైద్య నివేదికల కూడా అతనికి యివ్వలేదు .

2021 అక్టోబర్‌లో ప్రొఫెసర్ సాయిబాబాకు యిచ్చిన వైద్య నివేదికలో యాంజియోగ్రఫీ అవసరమని చెప్పారు. అయితే, అది జరగచేయించకపోవడమే కాకుండా, అతనే చేయించుకోవడానికి ఇష్టపడడం లేదని తన వైద్య పత్రాలపై ఒక వైద్యుడు వ్యాఖ్యానించాడు.

2021 నవంబర్ 30న ప్రొఫెసర్ సాయిబాబా జైలు సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో, ఈ వ్యాఖ్యలోని అబద్ధాన్ని స్పష్టం చేశారు.

2020 నవంబర్ లో నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల& ఆసుపత్రి (GMCH) వైద్యులు, తమ ఆసుపత్రిలో పరికరాలు పని చేయట్లేదు కాబట్టి, ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో యాంజియోగ్రఫీని చేయాలని సిఫార్సు చేశారు. 2021 అక్టోబర్ 17 ఉదయం 9 గంటలకు ఇందిరా గాంధీ హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు.

ʹకానీ జైలు ఆసుపత్రి CMO నన్ను IGGMHకి బదులుగా అదే రోజు, అదే సమయానికి GMCH కి చెందిన SSH (సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) కార్డియాలజీ విభాగానికి పంపారు. GMCHలోని కార్డియాలజిస్ట్ నన్ను మళ్లీ ఐజీజీఎంహెచ్‌కి తీసుకెళ్లాలని మెడికల్ రికార్డ్ షీట్‌లో రాశారు. కానీ జైలు అధికారులు కొత్త అపాయింట్‌మెంట్ తీసుకోలేదుʹ అని ప్రొఫెసర్ సాయిబాబా ఆ లేఖలో రాశారు.

ఆ లేఖను ఈ క్రింది వివరణతో ముగించారు: ʹకార్డియాలజిస్ట్ పరీక్షను సూచించిన 2020 నవంబర్ నుండి నేను CT యాంజియోగ్రఫీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పరీక్ష చేయించుకోవడానికి నేనెప్పుడూ నిరాకరించలేదు.ʹ

కుఖ్యాత రాజ్య-ప్రాయోజిత నిఘా ఉద్యమం సల్వా జూడుమ్‌తో సహా బస్తర్‌లోని ఆదివాసీలపై రాజ్యం అమలు చేస్తున్న విధానాలను బహిరంగంగా విమర్శించిన, 90% వైకల్యాలు ఉన్న రాజకీయ ఖైదీగా ప్రొఫెసర్ సాయిబాబాకు వున్న ప్రత్యేక స్థానం కారణంగా, ఢిల్లీ విశ్వవిద్యాలయ సహచరులు, దేశంలోని మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుండి అతని విడుదల కోసం విజ్ఞప్తి చేశారు.

కానీ ఎవరూ పట్టించుకోలేదు.

ప్రొఫెసర్ సాయిబాబాక ఎప్పుడు విడుదల అవుతారో తెలియదు; వైద్యపరమైన కారణాలతో అడిగిన బెయిల్, పెరోల్‌లను నిరాకరించారు. మరణ శయ్యపై వున్న తల్లితో వీడియో కాల్ కి కూడా అనుమతినివ్వలేదు.

"పెద్ద కొడుకుగా తన తల్లి మొదటి వర్ధంతిని జరుపుకోవడానికి పెరోల్ కోసం 2021 జూలై లో మళ్లీ చేసుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించారు" అని తెలియచేసిన వసంత "ఆమె 2020 ఆగస్టు లో మరణించినప్పుడు, వారు కరోనాను సాకుగా చూపారు. కానీ తాజా అప్పీల్‌ను ఎందుకు తిరస్కరించారు?" అని ప్రశ్నిస్తున్నారు.

గత నవంబర్‌లో, వసంత, ఆమె కుమార్తె 20 నెలల విరామం తర్వాత ప్రొఫెసర్ సాయిబాబాను జైలులో కలిసినప్పుడు పాలిపోయి, బలహీనంగా వున్నాడు; వారు అతన్ని కరోనా విపత్తు ప్రారంభానికి ముందు ఒకసారి కలిశారు. అతని చెయ్యి, తుంటి కీలులో స్థిరమైన నొప్పి, అపస్మారక స్థితికి గురయ్యే అవకాశం ఉండడాన్ని గమనించారు.

తన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని డిసెంబరు 27న రాసిన లేఖలో ఆయన తెలియచేసారు.

ʹగత నెలా పది రోజులుగా నేను మీకు వ్రాయలేకపోయాను. విపరీతమైన నొప్పి వల్ల నా మనస్సు సరిగా పనిచేయలేదు. నా నడుము నొప్పి, తుంటి కీళ్ల నొప్పుల వల్ల నిద్ర కూడా పట్టడం లేదు... గత రెండు నెలలకు పైగా ఉపశమనం లేదు. విపరీతమైన నొప్పి కారణంగా నా బీపీ కూడా పెరుగుతోంది. ఏకాగ్రత కుదరదుʹ అని రాశాడు.

వసంత తన భర్తకు సహాయం చేయలేని నిస్సహాయతలో వుంది. 2021 ఏప్రిల్‌లో అతని ఉద్యోగం తీసేసారు. కుటుంబానికి ఆదాయ మార్గం లేకుండా పోయింది.

"మేము మా పొదుపు, అతని స్నేహితుల సహకారంపైణా ఆధారపడి ఉన్నాము, కాబట్టి మేము అతనిని తరచుగా చూడడానికి వెళ్లడం కష్టం" అని వసంత అంటున్నారు. అతని ముఖ్యమైన పనులలో సహాయం చేసే జైలు ఖైదీలు యిద్దరికి ఆమె నెలకు రూ. 2,000 చెల్లిస్తుంది.

20 నిమిషాలు కలవడం కోసం న్యాయవాది ఒక రోజంతా వృధా అవడం వల్ల నాగ్‌పూర్‌లో వుండే న్యాయవాది కూడా సరిగా కలవలేక పోతున్నారని వసంత వెల్లడించారు. ఖైదీకి ఇవ్వాలనుకుంటున్న వస్తువుల జాబితాను తప్పనిసరిగా రాసి యివ్వాలి. అధికారులు ప్రతి వస్తువును ఆమోదించడానికి సమయం తీసుకుంటారు. ఈసారి, లిస్టులో చిన్న సంచి అని రాయలేదు కాబట్టి సబ్బులను పెట్టుకోవడానికి యిచ్చిన ఆ చిన్న సంచిని తీసుకోలేదు.

‍- జ్యోతి పున్వానీ

(rediff.com సౌజన్యంతో)

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : Professor Saibaba, nagpur jail, vasantha, covid 19,
(2022-05-26 17:48:09)No. of visitors : 346

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO

నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు.

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

ముగిసిన అమ్మ ఎదురు చూపులు

విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది.

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


ప్రొఫెసర్