జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
16-01-2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...
ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది!
ʹనవరత్నాలʹ అమలు కాదు, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిందిగా అన్ని పీడితవర్గాల, సముదాయాల ప్రజలకూ, ప్రజాస్వామికవాదులకు ఏఓబీఎస్ జడ్ సీ పిలుపునిస్తుంది!
గత సంవత్సరం అక్టోబర్ లో సీఎస్ కమిటీ నివేదికలో పీఆర్సీలో 14.29% ఫిట్మెంట్ ను ఖరారు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, 34% ఫిట్మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలనీ, 30% హెచ్ ఆర్ ఏ, సీపీఏను కొనసాగించాలనీ, 70 ఏళ్ళకు అదనపు పింఛన్ సౌకర్యాన్ని కొనసాగించాలనీ, అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ ను రద్దు చేస్తానని ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలనే డిమాండ్స్ తోపాటు, ఉద్యోగులకు సంబంధించిన 71 డిమాండ్లతో రాష్ట్రంలో ఉన్న 18 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్ళాయి. ఈ డిమాండ్లను చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ, జేఏసీ నాయకులనూ, ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగింపులు, రాజీ ప్రయత్నాలు చేస్తూ, డిసెంబర్ వరకు 6 విడతలు చర్చలు జరిపిన తర్వాత కూడా ఉద్యోగుల డిమాండ్ పైనా, ఫిట్మెంట్ పైనా ఏమీ తేల్చకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమి బాగాలేదనీ, 14.29% ఫిట్మెంట్ కు కట్టుబడాలని మళ్ళీ పాతపాటనే పాడింది.
ఈ కాలయాపననూ, నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించలేని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, తమ డిమాండ్లపై రాజీకి వచ్చేది లేదనీ, ఎటువంటి నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని సహించేది లేదని రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలు ఉధృతం చేసారు. ఎట్టకేలకు జనవరి 7న నియంత జగన్ ఉద్యోగ సంఘాలతో పేరుకు చర్చలు అన్నాడు కానీ, సంఘాల ప్రతినిధులకు ఏ మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, 23% ఫిట్మెంట్ ను ప్రకటించి చావు కబురు చల్లగా చెప్పాడు. రోజు రోజుకు ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్ ఆర్ ఏ (హౌజ్ రెంట్ ఎలవెన్స్)ను తగ్గించడం, 23% ఫిట్ మెంట్ తో జీతాలలో కోతను విధించడం వలన ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతున్నది.
మరోవైపు 2019 అక్టోబర్ 2న అట్టహాసంగా ప్రారంభించిన సచివాలయ ఉద్యోగాలలో 2 సంవత్సరాలు పూర్తయితే ప్రొబేషన్ ఖరారు చేసి, రెగ్యులరైజ్ చేస్తామనీ, జీతాలు పెంచుతామని అనడంతో ప్రైవేటు సంస్థలలోనూ, సాఫ్ట్ వేర్ కంపెనీలలోను 40, 50 వేల జీతాలతో పని చేస్తున్నవారు ఆ ఉద్యోగాలను వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం, పర్మినెంట్ అవుతుందనే ఆశతో 15వేల జీతంతో సచివాలయ ఉద్యోగాలలో చేరారు. 2 సంవత్సరాలు దాటిపోతున్నా ప్రభుత్వం ప్రొబేషన్ ప్రక్రియ చేపట్టలేదు. పైగా సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సంక్షేమ పథకాలకు అనర్హులుగా తేల్చడంతో వీరికి రేషన్, పెన్షతోపాటు, ʹనవరత్నాలుʹ ఏవీ వర్తించకా, 15వేల జీతంతో ఇల్లు గడవకా, అసలు ఈ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయా? జీతాలు పెరుగుతాయా? అనే అనుమానంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక నిరుద్యోగుల కోసం ఎన్నికల ముందు 2.32లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మెగా డీఎస్సీ వేస్తాననీ, ప్రతి సంవత్సరం జనవరి 1కే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని హామి ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ 3 జనవరిలు వెళ్ళిపోయినా,జాబ్ క్యాలండర్ విడుదల చేయలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలను ఊడదీసి నిరుద్యోగాన్ని మరింతగా పెంచింది.
ʹనవరత్నాలʹ అమలు పేరుతో ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి ఆ భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నది. ఈ ʹనవరత్నాలʹ పథకాలు ఏవీ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించి, ఉపాధిని కల్పించి, అభివృద్ధి సాధించేవి ఎంత మాత్రమూ కాదు. పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత అస్థిర పరిచి, సంక్షోభంలోకి నెట్టి మరింత దారిద్య్రాన్నీ, పేదరికాన్ని, నిరుద్యోగాన్నీ, అప్పులనూ, ఆత్మహత్యలను పెంచుతున్నది. కనుక జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బూటకపు సంస్కరణలు, పథకాలు నిరంకుశ, అప్రజాస్వామిక, మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగానూ, ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం కొరకు అన్ని పీడిత వర్గాల, సముదాయాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు ముందుకు రావాలని ఏఓబీ ఎస్ జెడ్ సీ పిలుపునిస్తుంది.
ఈ క్రింది న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగులు ఎటువంటి ప్రలోభాలకూ, బెదిరింపులుకు లొంగకుండా తుదివరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని ఏఓబీఎస్ జెడ్ సీ విజ్ఞప్తి చేస్తున్నది.
డిమాండ్స్
* పీఆర్సీ ఫిట్మెంట్ ను 34% ప్రకటించాలి.
* హెచ్ ఆర్ ఏ 30%, సీపీఏను కొనసాగించాలి.
* 70 ఏళ్ళ వాళ్ళకు అదనపు ఫించన్ సౌకర్యాన్ని కొనసాగించాలి.
* పదవీ విరమణ వయస్సును 62 ఏళ్ళకు పెంచడాన్ని ఉపసంహరించుకోవాలి. ఉద్యోగుల ప్రమోషన్లను యధావిధిగా కొనసాగించాలి.
* సీపీఎస్ ను రద్దు చేయాలి.
* 2.32 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ ప్రకటించాలి.
* సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసి వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి, జీతాలను 30వేలకు పెంచాలి.
గణేష్,
కార్యదర్శి,
ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).
Keywords : andhrapradesh, CPI Maoist, andhra odisha boarder committee, ganesh, YS Jagan
(2023-03-22 20:46:34)
No. of visitors : 609
Suggested Posts
| లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపువిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల |
| తిరుమలలో పోగుబడ్డ ఆస్తులెవరివి ?ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో |
| మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు. |
| నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే |
| గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట !
గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. |
| విశాఖ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు
12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై |
| డేటా చౌర్యంలో దోషులెవరు ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్ (6) ద్వారా ఎన్నికల
నోటిఫికేషన్ (మార్చ్ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది. |
| రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం |
| రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ
కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది. |
| Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల పోరాటం
న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు |