రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !

17-01-2022

గుడ్ మార్నింగ్.

మీరీ ఉత్తరం చదివేటప్పటికి నేనుండను. కోప్పడకండి. మీలో కొందరు నన్ను నిజంగా ప్రేమించారు, ఆప్యాయంగా చూసుకున్నారు, నాకు తెలుసు. నాకెవరిమీదా ఏ ఫిర్యాదూ లేదు. నాకెప్పుడూ నాతోనే సమస్యలున్నాయి. నా శరీరానికీ ఆత్మకూ దూరం పెరుగుతుండడం నేను గమనించాను. మొండిగా తయారయ్యాను. నేనెప్పుడూ ఒక రచయితను కావాలనుకున్నాను. కార్ల్ సాగన్ లాగా సైన్సు రచయితను కావాలనుకున్నాను. చివరికి, ఈ ఉత్తరం ఒక్కటి మాత్రమే రాయగలుగుతున్నాను.

నేను సైన్సునూ నక్షత్రాలనూ ప్రకృతినీ ప్రేమించాను. మనుషుల్ని కూడ ప్రేమించాను గాని వాళ్లు ప్రకృతి నుంచి ఎప్పుడో దూరమయ్యారని తెలుసుకోలేకపోయాను. మన అనుభూతులు ఇంకెవరో వాడిపారేసినవి. మన ప్రేమ కృత్రిమమైనది. మన నమ్మకాలు రంగుటద్దాలవి. మన సహజత్వం కృత్రిమ కళలోనే నిర్ణయమవుతుంది. గాయపడకుండా నిజంగా ప్రేమించడం అసాధ్యంగా మారిపోయింది.
మనిషి విలువ అతని తక్షణ గుర్తింపుకూ సమీప అవకాశానికీ కుదింపబడింది. ఒక వోటుగా, ఒక అంకెగా, ఒక వస్తువుగా తప్ప మనిషికి మనసుగా గుర్తింపే లేదు. నక్షత్ర ధూళితో నిర్మాణమైన ఉజ్వలమైన జీవిగా గుర్తింపే లేదు. ప్రతి చోటా అంతే. చదువులో. వీథిలో. రాజకీయాలలో. చివరికి చావులోనూ బతుకులోనూ కూడ.

ఇటువంటి ఉత్తరం నేనిదే మొదటిసారి రాస్తున్నాను. మొదటిసారి రాస్తున్న చివరి లేఖ. చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే క్షమించండి.
బహుశా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ పొరబడడం నా తప్పేనేమో. ప్రేమనూ బాధనూ జీవితాన్నీ మరణాన్నీ అర్థం చేసుకోవడంలో కూడ. అంత హడావిడేమీ లేదు కాని నేనెప్పుడూ తొందరపడుతూనే ఉన్నా. జీవితాన్ని మొదలుపెట్టేందుకు. కొంతమందికి ఎల్లవేళలా జీవితమే ఒక శాపం. నా పుట్టుకే నాకొక ప్రాణాంతక ప్రమాదం. నా బాల్యపు ఏకాకితనం నుంచి నేనెప్పుడూ తేరుకోలేను. గతానికి చెందిన ఏ ప్రశంసా ఎరగని ఆ చిన్నారి బాలుడి నుంచి.

ఈ క్షణం నాలో ఏ బాధా లేదు. విచారమూలేదు. కేవలం ఖాళీతనం నిండి ఉంది. నాగురించేమీ పట్టని నిర్వికార స్థితి. అదే చాల బాధాకరం. అందుకే ఈ పని చేస్తున్నాను.

అందరూ నన్నో పిరికివాడినని అంటారేమో. స్వార్ధపరుణ్ననీ తెలివితక్కువ వాణ్ననీ అంటారేమో. ఏమనుకున్నా సరే, నాకే పట్టింపూ లేదు. మరణానంతర కథల మీద, దయ్యాల మీద, ఆత్మల మీద నాకు నమ్మకం లేదు. నేను నమ్మేదేదైనా ఉంటే అది నేను నక్షత్రాల్లోకి ప్రయాణిస్తాననేదే. ఇతర లోకాల గురించి తెలుసుకుంటాననేదే.
ఈ ఉత్తరం చదువుతున్న వారు నాకేదైనా చేయాలనుకుంటే, నా ఫెలోషిప్ ఏడు నెలల బాకీ ఒక లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు రావాలి. అది నా కుటుంబానికి దక్కేలా చూడండి. నలభై వేలు నేను రాంజీకి ఇవ్వాలి. తనెప్పుడూ అడగ లేదు గాని అది తనకి ఇవ్వండి.
నా అంతిమయాత్ర మౌనంగా ప్రశాంతంగా జరిగేలా చూడండి. నేను అలా కనిపించి ఇలా మాయమైనట్టుగా ప్రవర్తించండి. నాకోసం కన్నీళ్లు కార్చకండి. జీవించడం కన్నా మరణించడంలోనే నా సంతోషం ఉందని అర్ధం చేసుకోండి.

"నీడల్లోంచి తారల్లోకి"

ఉమా అన్నా, ఈ పనికి నీ గదిని వాడుకుంటున్నందుకు మన్నించు.
ASA కుటుంబానికి, మిమ్ముల్ని నిరాశ పరుస్తున్నందుకు క్షమించండి. మీరు నన్నెంతో ప్రేమించారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
కడసారిగా ఒకసారి,
జై భీం

లాంఛనాలు రాయడం మర్చిపోయాను. నా ఈ ఆత్మహత్యకు ఎవరూ కారణంకాదు. ఈ పని చేయమని నన్నెవరూ పురికొల్పలేదు. ఇది నా నిర్ణయం, నేనే బాధ్యుడిని. నేను వెళ్లిపోయాక నా స్నేహితుల్ని గాని, శత్రువుల్ని గాని ఇబ్బంది పెట్టొద్దు.
(అనువాదం - ఎన్. వేణుగోపాల్, ఎడిటర్, వీక్షణం)

(ఇవ్వాళ్ళ రోహిత్ వేముల వర్ధంతి )
జనవరి 17 , 2016న రోహిత్ వేముల అమరుడయ్యారు

Keywords : Rohith vemmula, HCU, apparao, VC,
(2024-04-24 22:51:08)



No. of visitors : 632

Suggested Posts


తేనెపూసిన అగ్రహార కత్తులకు వెలివాడల జవాబు - వరవరరావు

ఈ నేరారోపణపూరిత కుట్రను ప్రతిఘటించడానికి, తేనె పూసిన కత్తికి జవాబు ఇవ్వడానికి ఇవ్వాళ మన మధ్య ఆ డెబ్బై మంది విద్యార్థుల నాయకుడు రోహిత్ లేకపోవచ్చు. కాని తన త్యాగంతో జనవరి 17 నుంచి రోజూ ఎంతో మంది రోహిత్లను అగ్రహారం వెలివాడలో రోహిత్ రూపొందిస్తున్నాడని మాత్రం మరచిపోకండి....

రోహిత్!.. ఓ యుద్ధ తరంగం..

వెలివాడలో యుద్ధగీతం ఇంకా వినిపిస్తూనే ఉంది.పల్లవికి తోడుగా లక్షలాది చరణాలు చేర్చబడుతూనే ఉన్నాయి.కోట్లాది గొంతులు గళమెత్తి పాడుతూనే ఉన్నాయి.బాష ఏదైనా భావమొక్కటే.చాలా సులువుగా అనువదించుకుని పాడుతున్నారు.ఒక పాటకి తోడుగా మరో పాటను...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రోహిత్