రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్

రోహిత్‌

17-01-2022

రోహిత్‌ వేముల వాళ్లమ్మను చూస్తే నాకు మణితర్నం తీసిని ʹఅమృతʹ సినిమాలోని చిన్న పాప గుర్తుకు వస్తది. తన మూలాల కోసం వెతుకులాడే ఆరాటం గుర్తుకు వస్తది. ʹఅబద్ధం చెప్పి పెంచాలాʹ అని అమృత పుట్టిన రోజునాడే పెంపుడు తండ్రి మాధవన్‌ నిజం చెబుతాడు. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న ఆ చిట్టి హృదయంలో ఒక్క సారిగా అలజడి రేగుతుంది. తానేవరో తెలిసాక అప్పటి వరకు వున్న ఆనందం అంతా ఒక్కసారి ఆవిరి కావడంతో ఆ చిట్టి హృదయం పడే వేదన వర్ణనాతితం. ఎందుకు నాన్న నిజం చెప్పారు. నన్ను ఇలాగే పెంచొచ్చు కదా అని ఆ చిట్టి తల్లి అడిగే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కంటనీరు తెప్పిస్తాయి. తనను పెంచినవాళ్లు ఎంత ప్రేమిస్తున్నా అసలు తల్లిదండ్రుల ఎవరో తెలుసుకోవాలని ఆ చిన్నది పడే ఆరాటం అందరినీ కలిచివేస్తది.

ఆ సినిమా విడుదలైనప్పుడు యూనివర్సిటీలో ఒక సెమినార్‌ నిర్వహించాం. ʹఈలంʹ ప్రత్యేక ఉద్యమాన్ని చర్చిస్తూనే, అసలు పిల్లలకు తన కన్నవాళ్ల గురించి నిజం చెప్పాలా, ఆ సినిమాలో చూపించినట్లు నిజం చెబితే జరిగే వచ్చే సమస్యలు ఎంటీ దాన్ని ఎలా ఎదుర్కొవాలి అని డిబెట్‌ జరిగింది. అప్పుడు యూనివర్సిటీలో సైకాలజీ పొఫెసర్ ʹʹనిజం చెప్పడం వల్ల అప్పటికి కాస్త ఇబ్బంది రావోచ్చేమో కానీ భవిష్యత్తులో ఏ సమస్య ఉండదు లేదంటే జీవితాంతం ఏదో దాస్తున్నాం అనే బాధ వెంటాడుతూ ఉంటుంది..సినిమాలో కరెక్టే చూపించారుʹʹ అంటూ చెప్పుకొచ్చింది.

అమృత వాళ్ల నాన్న ఆమె ఎవరో చిన్నప్పుడే నిజం చెప్పాడు కానీ రాధికమ్మకు ఆ అవకాశం లేకుండా పోయింది. అమృత సినిమాలో మాధవన్‌లా రాధికమ్మను పెంచిన పెంపుడు తల్లి అంజనీదేవి ఇంగ్లీషు ధారాలంగా మాట్లాడగలిగేంత ఉన్నత చదువు చదివింది కానీ నిజం దాచి ఆమెను పెంచిది. నిజానికి పెంచడం అంటే చేరదీసి బుక్కెడు భువ్వపెట్టి, ఉండటానికి కాసింత చోటు ఇచ్చిందే తప్ప ఎన్నడూ తన సొంత పిల్లల్లా చూడలేదు ఆ మహాతల్లి. ఆమె కళ్లముందే తన పిల్లలు స్కూల్‌కు వెళుతుంటే, రాధికమ్మ మాత్రం ఇంట్లో పనులంతా చేస్తూ కుటుంబ భారాన్నంత మోసింది. కాసింత చోటు ఇచ్చిన పాపానికి పుట్టెడు దు:ఖాన్ని మోసింది. పుట్టుకే సమస్య అయిన చోట, తన ఇష్టాలు ఇవీ అని చెప్పుకోలేని చోట, ఎవర్నో తీసుకొచ్చి ఇతన్ని పెళ్లిచేసుకో అంటే చేసుకోవడమే తప్ప ఇంకే అవకాశం లేని జీవితం ఆమెది. చేసుకున్న వాడు మంచివాడా అంటే అదీ లేదు. ఒక బాధ్యతారాహిత్యుడు. మగపెత్తనం తప్ప కుటుంబ బాధ్యత అంతే ఏంటో తెలియని మొగుడు. కాసింత ఆత్మగౌరవంతో ఆమె ప్రశ్నిసే చేయిచేసుకునే సగటు మగమహారాజు. ఇటువంటి ఆ మగాడికి తను కట్టుకున్న ఆమె తన కులం కాదు అని తెలిస్తే ఎలా ఉంటుంది.? అదే జరిగింది. పురుషాధిక్యతకు తోడు ఆమెకంటే ʹకాసింత పెద్ద కులంʹ అనే బలుపుతో అతను మరింత వేధించడం మొదలెట్టాడు. పుట్టుకే ప్రశ్నార్థకమైన చోట తన ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి ఎంత మూల్యం చెల్లించాలో అంతా చెల్లించింది ఆ తల్లి.
నిత్యం అనుమానాలు, కులం పేరుతో వేధింపులు, వీటికి భరించలేక విడిగా ఉంటూ తన ముగ్గురు పిలల్లన్ని పెంచిది. కష్ట నష్టాలు భరిస్తూనే చదువుకుంటే సమాజంలో లభించే హోదా, ఆత్మగౌరవం గురించి అర్థం చేయించింది. పిల్లలతోపాటే తను చదువుకోవడం మొదలెట్టింది. కొడుకు రోహిత్‌తో పాటూ తానూ డిగ్రీ పరీక్షలు రాసింది. ఎంత చదివిన, ఎంత దూరం వెళ్ళిన కులం వెంటాడుతూ ఉంటుంది అని అంబేద్కర్‌ అన్నట్లు ఆమె విడిగా ఉన్పప్పటికీ, ʹఇంట్లో పనిచేయడానికిʹ పెంచిన తల్లి ఆమెను పిలుస్తుంటే దు:ఖాన్ని దిగమింగుకొని పనిచేసింది. ఇటువంటి పరిస్థితిల్లో పెరిగిన పిల్లల మనస్థత్వం ఎలా ఉంటుంది...?
అదే రోహిత్‌ మరణవాంగ్మూలంలో ప్రతిధ్వనించింది. ʹపుట్టుకే నేరమైన చోట...ʹ అంటూ అతను తన దు:ఖాన్నంతా ఏకరువుపెడతాడు. కులం కారణంగా సొంత తండ్రే తమను వెలివేస్తే, నాలుగు అక్షరాలు నేర్చుకొని, మంచి ఉద్యోగం సంపాధించి కుటుంబాన్ని ఆదుకుంటూ, తనవంతుగా సమాజానికి ఏదో చేయాలని కలలుగన్న రోహిత్‌ మళ్లీ ʹకులంమేʹ అనునిత్యం అడ్డువస్తుంటే తను మాత్రం ఏం చేయగలడు...!?
ప్రతి మనిషి తన జీవితం కోసం తపన పడతాడు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా జీవించాలని కోరుకుంటాడు. కానీ అన్నీ దారులు మూసుకుపోతే, అయిన వాళ్ళు ముఖం చాటేసే ముఖం చాటేస్తే, అండగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో దూరంగా ఉంటే నిస్సహాతతో, నిస్పృహకు లోనైన ఏవరూ మాత్రం ఏం చేస్తారు. రోహిత్‌ అదే చేశాడు. ఒకవైపు కుల వేధింపులు, మరో వైపు అర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తల్లడిల్లిపోయాడు. ఒకానొక సమయంలో చదువును వదిలేసి ఇంటికి వెళ్ళి ఏదైనా బిజినెస్‌ చేసి కాసింత అర్థికంగా నిలబడదాం అని ఆలోచన కూడా చేశాడు. తన ముస్లిం స్నేహితుడికి ఫోన్‌ చేసి బిజినెస్‌ చేసి దున్నేద్దాం రాʹ అని కూడా అన్నాడు. కానీ ఎక్కడో ఒక చోట తన కులం గుర్తుకు వచ్చి ఉంటుంది. నిచ్చనమెట్ల కుల వ్యవవస్థలో నాలుగు పడగల హైందవనాగరాజు అన్ని వైపుల చుట్టుముట్టి తన చేయబోయే బిజినెస్‌ను ఎక్కడ దెబ్బకొడుతుందో అనే భయం వల్ల కావచ్చు ఆ ఆలోచన మొగ్గలోనే వదిలేసుకున్నాడు.

వీటన్నింటి మధ్య అతన తీసుకున్న నిర్ణయం మరణ వాంగ్మూలం..!
రోహిత్‌ తీసుకున్న ఈ నిర్ణయం కొందరికి పిరికి చర్యగా కనిపించవచ్చు. మరి కొందరికి క్షణికావేశంగా అనిపించవచ్చు. కానీ ఇది సమాజంపై అతడి నిరసన ప్రదర్శన. మనుషులు మనుషులుగా ఉండని చోట, మనిషికి, ప్రకృతికి దూరం పెరిగిన చోట, మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయిన చోట అతని ధిక్కార ప్రకటన ఇది. అతని ప్రకటనలో వేల వేల ప్రశ్నలు ఉన్నాయి. సాముహిక దళిత దు:ఖం ఉంది. ఇది అర్థం కావాలంటే మనిషిగా మారాలి. మనలోని మనిషితత్వాన్ని మేల్కోలపాలి. అది సాధ్యమా,..?
మళ్లీ రాధికమ్మ దగ్గరకు వద్దాం.
17-01-2022

రోహిత్‌ వేముల వాళ్లమ్మను చూస్తే నాకు మణితర్నం తీసిన ʹఅమృతʹ సినిమాలోని చిన్న పాప గుర్తుకు వస్తది. తన మూలాల కోసం వెతుకులాడే ఆరాటం గుర్తుకు వస్తది. ʹఅబద్ధం చెప్పి పెంచాలాʹ అని అమృత పుట్టిన రోజునాడే పెంపుడు తండ్రి మాధవన్‌ నిజం చెబుతాడు. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న ఆ చిట్టి హృదయంలో ఒక్క సారిగా అలజడి రేగుతుంది. తానేవరో తెలిసాక అప్పటి వరకు వున్న ఆనందం అంతా ఒక్కసారి ఆవిరి కావడంతో ఆ చిట్టి హృదయం పడే వేదన వర్ణనాతితం. ఎందుకు నాన్న నిజం చెప్పారు. నన్ను ఇలాగే పెంచొచ్చు కదా అని ఆ చిట్టి తల్లి అడిగే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కంటనీరు తెప్పిస్తాయి. తనను పెంచినవాళ్లు ఎంత ప్రేమిస్తున్నా అసలు తల్లిదండ్రుల ఎవరో తెలుసుకోవాలని ఆ చిన్నది పడే ఆరాటం అందరినీ కలిచివేస్తది.

ఆ సినిమా విడుదలైనప్పుడు యూనివర్సిటీలో ఒక సెమినార్‌ నిర్వహించాం. ʹఈలంʹ ప్రత్యేక ఉద్యమాన్ని చర్చిస్తూనే, అసలు పిల్లలకు తన కన్నవాళ్ల గురించి నిజం చెప్పాలా, ఆ సినిమాలో చూపించినట్లు నిజం చెబితే జరిగే, వచ్చే సమస్యలు ఎంటీ దాన్ని ఎలా ఎదుర్కొవాలి అని డిబెట్‌ జరిగింది. అప్పుడు యూనివర్సిటీలో సైకాలజీ పొఫెసర్ ʹʹనిజం చెప్పడం వల్ల అప్పటికి కాస్త ఇబ్బంది రావోచ్చేమో కానీ భవిష్యత్తులో ఏ సమస్య ఉండదు లేదంటే జీవితాంతం ఏదో దాస్తున్నాం అనే బాధ వెంటాడుతూ ఉంటుంది..సినిమాలో కరెక్టే చూపించారుʹʹ అంటూ చెప్పుకొచ్చింది.

అమృత వాళ్ల నాన్న ఆమె ఎవరో చిన్నప్పుడే నిజం చెప్పాడు కానీ రాధికమ్మకు ఆ అవకాశం లేకుండా పోయింది. అమృత సినిమాలో మాధవన్‌లా రాధికమ్మను పెంచిన పెంపుడు తల్లి అంజనీదేవి ఇంగ్లీషు ధారాలంగా మాట్లాడగలిగేంత ఉన్నత చదువు చదివింది కానీ నిజం దాచి ఆమెను పెంచిది. నిజానికి పెంచడం అంటే చేరదీసి బుక్కెడు బువ్వ పెట్టి, ఉండటానికి కాసింత చోటు ఇచ్చిందే తప్ప ఎన్నడూ తన సొంత పిల్లల్లా చూడలేదు ఆ మహాతల్లి. ఆమె కళ్లముందే తన పిల్లలు స్కూల్‌కు వెళుతుంటే, రాధికమ్మ మాత్రం ఇంట్లో పనులంతా చేస్తూ కుటుంబ భారాన్నంత మోసింది. కాసింత చోటు ఇచ్చిన పాపానికి పుట్టెడు దు:ఖాన్ని మోసింది. పుట్టుకే సమస్య అయిన చోట, తన ఇష్టాలు ఇవీ అని చెప్పుకోలేని చోట, ఎవర్నో తీసుకొచ్చి ఇతన్ని పెళ్లిచేసుకో అంటే చేసుకోవడమే తప్ప ఇంకే అవకాశం లేని జీవితం ఆమెది. చేసుకున్న వాడు మంచివాడా అంటే అదీ లేదు. ఒక బాధ్యతారాహిత్యుడు. మగపెత్తనం తప్ప కుటుంబ బాధ్యత అంతే ఏంటో తెలియని మొగుడు. కాసింత ఆత్మగౌరవంతో ఆమె ప్రశ్నిసే చేయిచేసుకునే సగటు మగమహారాజు. ఇటువంటి ఆ మగాడికి తను కట్టుకున్న ఆమె తన కులం కాదు అని తెలిస్తే ఎలా ఉంటుంది.? అదే జరిగింది. పురుషాధిక్యతకు తోడు ఆమెకంటే ʹకాసింత పెద్ద కులంʹ అనే బలుపుతో అతను మరింత వేధించడం మొదలెట్టాడు. పుట్టుకే ప్రశ్నార్థకమైన చోట తన ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి ఎంత మూల్యం చెల్లించాలో అంతా చెల్లించింది ఆ తల్లి.
నిత్యం అనుమానాలు, కులం పేరుతో వేధింపులు, వీటికి భరించలేక విడిగా ఉంటూ తన ముగ్గురు పిలల్లన్ని పెంచిది. కష్ట నష్టాలు భరిస్తూనే చదువుకుంటే సమాజంలో లభించే హోదా, ఆత్మగౌరవం గురించి అర్థం చేయించింది. పిల్లలతోపాటే తను చదువుకోవడం మొదలెట్టింది. కొడుకు రోహిత్‌తో పాటూ తానూ డిగ్రీ పరీక్షలు రాసింది. ఎంత చదివినా , ఎంత దూరం వెళ్ళినా కులం వెంటాడుతూ ఉంటుంది అని అంబేద్కర్‌ అన్నట్లు ఆమె విడిగా ఉన్పప్పటికీ, ʹఇంట్లో పనిచేయడానికిʹ పెంచిన తల్లి ఆమెను పిలుస్తుంటే దు:ఖాన్ని దిగమింగుకొని పనిచేసింది. ఇటువంటి పరిస్థితిల్లో పెరిగిన పిల్లల మనస్థత్వం ఎలా ఉంటుంది...?

అదే రోహిత్‌ మరణవాంగ్మూలంలో ప్రతిధ్వనించింది. ʹపుట్టుకే నేరమైన చోట...ʹ అంటూ అతను తన దు:ఖాన్నంతా ఏకరువుపెడతాడు. కులం కారణంగా సొంత తండ్రే తమను వెలివేస్తే, నాలుగు అక్షరాలు నేర్చుకొని, మంచి ఉద్యోగం సంపాధించి కుటుంబాన్ని ఆదుకుంటూ, తనవంతుగా సమాజానికి ఏదో చేయాలని కలలుగన్న రోహిత్‌ మళ్లీ ʹకులమేʹ అనునిత్యం అడ్డువస్తుంటే తను మాత్రం ఏం చేయగలడు...!?
ప్రతి మనిషి తన జీవితం కోసం తపన పడతాడు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా జీవించాలని కోరుకుంటాడు. కానీ అన్నీ దారులు మూసుకుపోతే, అయిన వాళ్ళు ముఖం చాటేసే ముఖం చాటేస్తే, అండగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో దూరంగా ఉంటే నిస్సహాయతతో, నిస్పృహకు లోనైన ఏవరూ మాత్రం ఏం చేస్తారు. రోహిత్‌ అదే చేశాడు. ఒకవైపు కుల వేధింపులు, మరో వైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తల్లడిల్లిపోయాడు. ఒకానొక సమయంలో చదువును వదిలేసి ఇంటికి వెళ్ళి ఏదైనా బిజినెస్‌ చేసి కాసింత ఆర్థికంగా నిలబడదాం అని ఆలోచన కూడా చేశాడు. తన ముస్లిం స్నేహితుడికి ఫోన్‌ చేసి బిజినెస్‌ చేసి దున్నేద్దాం రాʹ అని కూడా అన్నాడు. కానీ ఎక్కడో ఒక చోట తన కులం గుర్తుకు వచ్చి ఉంటుంది. నిచ్చనమెట్ల కుల వ్యవవస్థలో నాలుగు పడగల హైందవనాగరాజు అన్ని వైపుల చుట్టుముట్టి తన చేయబోయే బిజినెస్‌ను ఎక్కడ దెబ్బకొడుతుందో అనే భయం వల్ల కావచ్చు ఆ ఆలోచన మొగ్గలోనే వదిలేసుకున్నాడు.

వీటన్నింటి మధ్య అతన తీసుకున్న నిర్ణయం మరణ వాంగ్మూలం..!
రోహిత్‌ తీసుకున్న ఈ నిర్ణయం కొందరికి పిరికి చర్యగా కనిపించవచ్చు. మరి కొందరికి క్షణికావేశంగా అనిపించవచ్చు. కానీ ఇది సమాజంపై అతడి నిరసన ప్రదర్శన. మనుషులు మనుషులుగా ఉండని చోట, మనిషికి, ప్రకృతికి దూరం పెరిగిన చోట, మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయిన చోట అతని ధిక్కార ప్రకటన ఇది. అతని ప్రకటనలో వేల వేల ప్రశ్నలు ఉన్నాయి. సాముహిక దళిత దు:ఖం ఉంది. ఇది అర్థం కావాలంటే మనిషిగా మారాలి. మనలోని మనిషితత్వాన్ని మేల్కొలపాలి. అది సాధ్యమా,..?

మళ్లీ రాధికమ్మ దగ్గరకు వద్దాం.

ʹకులంʹ కారణంగా భర్త అనబడే మాగాడి నుండి విడిగా ఉండాల్సిరావడం. ఆ కులం కారణంగానే పనిమనిషిగా గుర్తింపుకునోచుకోవడం. ఆ కులం కారణంగా తన కొడుకు నిశ్రమించడం....ఎంత దు:ఖాన్ని భరించి ఉంటుంది ఆ తల్లి.
ఒక్కసారి ఆ తల్లి మౌనాన్ని బద్దలుకొట్టి, దు:ఖాన్నంతా మనముందు కుమ్మరిస్తే తట్టుకునే శక్తి మనకుందా...? రోహిత్ రాసిన ఉత్తరాన్ని చదివి, మనలో కూడా కాసింత మంచితనముందని అనుకున్నవాళ్లమంతా ముడుచుకొనిపోయాం కదా, మరీ ఆ తల్లి నోరు విప్పితే తట్టుకోగలమా?

రోహిత్‌ వాళ్లమ్మను మొదటి సారి నేను ఉస్మానియా మార్చురీ దగ్గరే చూడడం. ఆమెకు దూరంగా ఒక గదిలో కొడుకు మృతదేహం పోస్టుమార్టంకు సిద్ధంగా ఉంది. బహుశా ఏడ్వడానికి కూడా కన్నీరు ఇంకిపోయిందేమో ఎటువంటి భావోద్వేగాలకు అందకుండా ఆమె మౌనంగా ఒక పక్కన కూర్చోని ఉంది. ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు. ఒకవైపు యూనివర్సిటీలో ఆందోళన జరగుతోంది. ఇక్కడ మాత్రం పోలీసులు ఏవో కాయితాలు తీసుకొచ్చి ఆమెతో సంతకాలు చేయించుకుంటూ ఉన్నారు. మధ్య మధ్యలో ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడిస్తున్నారు పోలీసులు. కాసింత దూరంలో చూడటానికి వచ్చిన నాయకుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాగో ఘర్షణ పడి మందకృష్ణ మాదిగ, తమ్మినేని వీరభద్రం, కేవీపీఎస్‌ నాయకులు జాన్‌వెస్లీ పోస్టుమార్టం జరిగే దగ్గరకు వచ్చారు కానీ కాంగ్రెస్‌ నాయకులు మల్లు బట్టివిక్రమార్క ను మాత్రం రానివ్వకుండా అడ్డుకున్నారు. కాసింత ఘర్షణ వాతావరణ చోటుచోసుకుంది. ఎట్టకేలకు అయన్ని కూడా అనుమతించారు. రాధికమ్మను ఓదార్చాలి అని ఆ నాయకులు అనుకున్నారు కానీ ధైర్యం చాలక ఆమెకు కాసింత దూరంలోనే ఉండిపోయారు. వీటన్నింటి మధ్యే పోస్టుమార్టం పూర్తయింది. ఏదో జరుగుతుందని అర్థమవుతుంది పోలీసుల హడావుడి చూస్తుంటే. ఎందుకైనా మంచిదని ʹʹఆమెతో ఏం మాట్లాడారో ఒకసారి కనుక్కో నాకెందుకో డౌట్‌ వస్తుందిʹʹ
అని ఓయూ పిడిఎస్‌యూ నాయకురాలిగా ఉన్న సత్యకు చెబితే ఆమె మాట్లాడితే అప్పుడు కానీ అసలు నిజం తెలియలేదు...!

రాధికమ్మ కుటుంబం ఉప్పల్‌ ప్రాంతంలో ఒక ఇంట్లో గత కొంత కాలంగా అద్దెకు ఉంటున్నారు కాబట్టి పోలీసులు ఆ ఇంటి ఓనర్‌ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితిలో మీ ఇంటికి అతని శవాన్ని తీసుకురాకుండా చూడాలి. తీసుకొస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అతన్ని భయపెట్టారు. అందుకే అతను మా ఇంటికి శవాన్ని తీసుకురాకండి అని పోలీసు ఫోన్లో చెప్పాడు. మరి ఎక్కడి తీసుకెళ్లాలో కూడా పోలీసులే నిర్ణయించేసారు. అప్పటికే అంబర్‌పేట శ్మశానవాటికలో అన్నీ ఏర్పాటు పూర్తిచేశారు పోలీసులు. అంబులెన్స్‌లో శవం అక్కడకు వచ్చిన వెంటనే మిగతా వాటిని పక్కన పెట్టి వెంటనే దహన సంస్మరాలు కానిచ్చేయ్యాలని కూడా అక్కడున్న వాళ్ళకు స్ట్రిక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చి ఉన్నారు...! అదే చేశారు అక్కడి వాళ్లు.
కులం కారణంగా ʹపుట్టుక మొదలు అంతిమ సంస్కరాల వరకూ ఏదీ తన ప్రమేయం లేకుండా ఎవరో నిర్ణయించేస్తున్న చోట ఆ తల్లి మౌనంగా భరిస్తూనే వచ్చింది.
ఆమె చూసే చూపులో మీరు మనుషులేనా అని చీత్కారం ఉంది.
ఆ తల్లి మౌనంలో ఒక నిరసన ఉంది.
ఆ మౌనంలో ఒక ధిక్కారం ఉంది.
మనకు ధైర్యం ఉందా ఆమె కళ్లలోకి చూసేందుకు......!?

-ఎస్.ఏ.డేవిడ్

Keywords : Rohith vemula, HCU, Suicide, radhika, manuvadam,
(2024-04-19 22:01:02)



No. of visitors : 449

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రోహిత్‌