ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
17-01-2022
నగలు దొంగతనం కేసును ఒప్పుకొమ్మని ఓ దళితుడిని విపరీతంగా చిత్రహింసలపాల్జేసి చంపేశారు పోలీసులు. ఇది జైభీం సినిమా కథ కాదు. తమిళనాడులో ఐదు రోజుల క్రితం జరిగింది. ఈ దుర్మార్గాన్ని న్యూస్ మినట్ నివేదించింది.
తమిళనాడులోని సేలం జిల్లాలోని కరుప్పూర్‌లో నివసిస్తున్న వికలాంగుడైన షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)కి చెందిన ప్రభాకర్, అతని భార్య అంశలను నమక్కల్ జిల్లాలోని మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసు అధికారుల బృందంఈ నెల 8వ తేదీన వారి ఇంటి నుండి ఎత్తుకెళ్ళారు. నగల చోరీ కేసులో వీళ్ళను పట్టుకెళ్ళినట్టు పోలీసులు చెప్పారు.
సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రభాకర్ సోదరుడు శక్తివేల్ సమాచారం ప్రకారం, పోలీసులు భార్యాభర్తలను ఎత్తుకెళ్లినప్పుడు వారిని శారీరకంగా హింసించారు,బూతులు తిట్టారు,జుట్టుపట్టుకొని లాక్కెళ్ళారు. గొడవ విని బైటికి వచ్చిన చుట్టుపక్కలవారిని పోలీసులు బెదిరించారు.
వాళ్ళిద్దరినీ కరుప్పూర్ స్టేషన్‌లో ఉంచుతామని పోలీసులు చెప్పారు. అనంతరం ప్రభాకర్ సోదరుడు శక్తి వేల్ ఆ స్టేషన్ కు వెళ్ళగా అక్కడ వాళ్ళిద్దరు లేరు. వాళ్ళిద్దరి కోసం రెండు రోజులుగా వెతికినా ఫలితం లేకపోవడంతో ప్రభాకర్ కుమారుడు జనవరి 10న మిస్సింగ్ రిపోర్టు ఇచ్చాడు.
జనవరి 12న ప్రభాకర్ కుటుంబ సభ్యులకు పోలీసుల నుండి ఓ ఫోన్ వచ్చింది. ప్రభాకర్ సేలంలోని ప్రభుత్వ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఉన్నారని వాళ్ళు చెప్పారు.
శక్తివేల్, ఇతర కుటుంబ సభ్యులు హాస్పటల్ వెళ్ళగా... ప్రభాకర్ భార్య అంశా ను సేలంలోని మహిళా జైలుకు పంపారని అక్కడే తెలిసింది. ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సేలం జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను మరణించాడు.
దీనిపై ప్రభాకర్ సోదరుడు శక్తివేల్ ఇచ్చిన పిర్యాదు మేరకు సేలం నగర పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
ది న్యూస్ మినట్ ప్రకారం... పోలీసు కస్టడీలో తీవ్ర చిత్రహింసలపాల్జేశారనే ఆరోపణల నేపథ్యంలో దంపతులను అదుపులోకి తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు పోలీసు అధికారులు - పూంకోడి, కులంతైవేల్, ఏ.చంద్రన్ లను ఉనతాధికారులు సస్పెండ్ చేశారు.
ఈ సంఘటనపై విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ ఓ వీడియో విడుదల చేసింది. అందులో మృతుడు ప్రభాకర్ భార్య మాట్లాడుతూ తమను పోలీసులు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంది. ప్రభాకర్‌కు దీర్ఘకాల వైకల్యం ఉన్నందున నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, చంద్రన్ అనే పోలీసు అధికారి తమ ఇద్దరినీ తీవ్రంగా కొట్టారని ఆమె తెలిపింది. తాము ఆభరణాలు దొంగతనం చేశామని, ఆ ఆభరణాలు తమ వద్దే ఉన్నాయని ఒప్పుకోవల్సిందిగా తీవ్రంగా హింసలు పెట్టారని ఆమె చెప్పింది.
Keywords : tamilanadu, Dalit Man, Custody death, Dalit Man With Disability Beaten, Found Dead in Police Custody
(2022-05-26 17:07:44)
No. of visitors : 449
Suggested Posts
| కరోనా కన్నా కులమే ప్రమాదకర వైరస్...పా రంజిత్కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు. |
| ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు. |
| వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథనిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం... |
| కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. |
| Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticketA Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal |
| పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాటలకందని హింస
మొబైల్ షాపు నడుపుకునే ఇద్దరు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. తమిళనాడు తూతుకూడి జిల్లా శతాంకులంలో ఫెనిక్స్ (31) చిన్న మొబైల్ షాపు నడుపుతుంటాడు. |
| న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేతతంజావూర్ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు. |
| వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద |
| లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య!"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన.
కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. |
| వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలుపోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
| ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ |
| సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్ |
| Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement |
| పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం |
| జిగ్నేష్ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు |
| నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
|
| విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం |
more..