ఇది మన పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
18-01-2022
సైనిక క్యాంపులు ఎత్తేయాలని దండకారణ్యంలో ఆదివాసులు చేస్తున్న పోరాటానికి ఎనిమిది నెలలు నిండాయి. ఇప్పటికీ వాళ్ల సమస్య పరిష్కారం కాలేదు. మామూలుగా ఇలాంటి పోరాటాలు నడుస్తున్నప్పుడు లోకం కోసమైనా ప్రభుత్వం ఉద్యమకారులతో సంపద్రింపులు జరుపుతుంది. కానీ ఈ పోరాటం విషయంలో అలాంటివేమీ లేదు.
2021 మే 17వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొదటి రెండు మూడు రోజుల్లోనే నెత్తుటి మడుగులో తడిసింది. ఐదుగురు ఆదివాసులను భారత ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. అయినా ఆదివాసులు వెనకడుగు వేయలేదు. క్రమంగా ఈ ఉద్యమం జార్ఖండ్ ప్రాంతానికి కూడా విస్తరించింది.
ఈ ఎనిమిది నెలలుగా ఆదివాసులు అనేక పోరాట రూపాలను చేపట్టారు. ప్రభుత్వ అణచివేతను ధిక్కరిస్తూ ఎక్కడికక్కడ వేలాది మంది ఆందోళనల్లో పాల్గొన్నారు. రోడ్ల మీదనే మకాం వేసి ఉద్యమం బలహీనపడకుండా ఎప్పటికప్పుడు కొత్త ఆందోళనలు చేపడుతున్నారు. తమ డిమాండ్ వెనుక ఉన్న న్యాయబద్ధతను వివరిస్తున్నారు. దీనిపై అక్కడి నుంచి ʹమూలవాసీ రచయితల వేదికʹ ఎన్నో ప్రకటనలు చేసింది. విశ్లేషణలు అందించింది. ఎప్పటికప్పుడు సమాచారం బైటికి చేరవేస్తూ ఉన్నది. బస్తర్ టాకీస్ అనే మీడియా సంస్థ కూడా ఇందులో తనవంతు పాత్ర పోషించింది. అందువల్ల పలు భాషల్లో జాతీయ స్థాయి గుర్తింపును ఈ పోరాటం పొందింది.

తెలుగులో కూడా విప్లవోద్యమ సమర్థకులు, అభిమానులు మొదటి నుంచీ ఈ పోరాటానికి గట్టి మద్దతు ఇస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఆపరేషన్ ప్రహార్`3ని వ్యతిరేకిస్తూ భారత విప్లవోద్యమానికి మద్దతుగా అంతర్జాతీయ సంఫీుభావ దినం సందర్భంగా ప్రపంచమంతా ఈ పోరాటం ప్రాచుర్యం పొందింది.
ఇంత జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ పోరాటంపై నిర్బంధం ప్రయోగించడం తప్ప సమస్యను పరిష్కరించడానికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి చట్ట పరిధిలో ఆలోచిస్తే ఆదివాసుల డిమాండ్ చాలా చిన్నది. కానీ చట్టానికి బైట దీనికి చాలా విస్తృతి ఉన్నది. అనేక రాజకీయ ఆర్థిక పోరాట వ్యూహాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్థి అంటే ఏమిటి? స్వావలంబన అంటే ఏమిటి? అనే విషయాల్లో పూర్తి భిన్న పంథాల సంఘర్షణ ఇందులో ఉన్నది.
అందుకే మిగతా పోరాటాల్లాగా అందరూ దీనికి మద్దతు ఇవ్వడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్నిటికీ మద్దతు ఇచ్చే(తప్పక ఇవ్వాల్సిందే) వాళ్లలో కొందరు ఈ విషయంలో మాత్రం ముందుకు రాలేదు. ఈ పోరాటానికి మద్దతు ఇస్తే అది అక్కడే ఆగదని వాళ్లకు తెలుసు. ఈ మాట అంటే .. ఈ పోరాటం ఆదివాసులకు జీవన్మరణ సమస్యే కావచ్చుగాని సమాజంలో దానికి అంత ప్రాధాన్యత లేదని కూడా సిద్ధాంతీకరించవచ్చు.
కానీ భారత పాలకులు మధ్య భారత దేశంలో సాగిస్తున్న యుద్ధంలో దానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిరావడం లేదు. సైనిక క్యాంపులను ఎత్తివేయాలనే ఆదివాసీ డిమాండ్‌కు తలొగ్గడమంటే విప్లవోద్యమ నిర్మూలనకు తాను చేపట్టిన సంపూర్ణ యుద్ధంలో వెనకడుగు వేయడమే. దేశవ్యాప్తంగా విప్లవోద్యమ స్థావరాలను దెబ్బతీయాలంటే తన సైనిక స్థావరాలను నెలకొల్పుకోవడం భారత రాజ్యానికి అవసరం. కాబట్టి ఎలాంటి చర్చలకు, సంప్రదింపులకు పాలకులు సిద్ధం కావడం లేదు.

గత ముప్పై ఏళ్ల మధ్య భారత దేశ ఆదివాసీ పోరాటాల్లో సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం చాలా ప్రత్యేకమైనది. అనేక పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో ఆదివాసుల రక్షణగా పొందుపర్చబడిన పెసా చట్టం స్ఫూర్తిని కాపాడాలని ఆదివాసులు కోరుతున్నారు. తమ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు పెట్టడం అంటే ఆదివాసీ జీవితాన్ని కాలరాయడమే అంటున్నారు. ఈ డిమాండ్ అనేక ప్రాంతాలకు విస్తరించిందంటే దాని వెనుక ఉన్న న్యాయబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు అణచివేత, దాడులు, హత్యాకాండ కొనసాగిస్తున్నా ఆదివాసులు అత్యంత ప్రజాస్వామికంగా తమ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. రాజ్యాంగయంత్రంపై నిరంకుశ పెత్తనం సంపాదించుకున్న పాలకులు భారత ప్రజలు నిర్మించుకున్న రాజ్యాంగం ప్రకారమే వాళ్లపై యుద్ధం ప్రకటించాక ఇక అందులోని ఏ చట్టానికీ దిక్కులేదని తేలిపోయింది. అయినా ఆదివాసులు నిరాశ చెందడం లేదు. దేనికంటే వాళ్లకు తమ పోరాటం ఎంత విస్తృతమైనదో తెలుసు.
కొందరు పండితులు, పత్రికలు, మీడియా దీన్ని కేవలం సైనిక కోణంలోనే చూడవచ్చు. సైనిక సంఘర్షణగానే కుదించవచ్చు. కానీ పాలకులు చాలా స్పష్టంగా రాజకీయార్థిక సాంస్కృతిక యుద్ధ వ్యూహంగా దీన్ని నడుపుతున్నారు. ఆ రకంగా మేధావులకన్నా, పత్రికలకన్నా భారత పాలకులు తమ వైపు నుంచి విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి సక్రమంగా అర్థం చేసుకున్నట్లే. ఇంకో పోలికతో చెప్పాలంటే... మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటానికి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యత ఉన్నట్లే విప్లవోద్యమ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తివేయాలనే ఆదివాసీ పోరాటానికి కూడా అలాంటి ప్రాధాన్యత ఉన్నది. మౌలిక రంగమైన వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే దోపిడీ వ్యూహం ఆ చట్టాల వెనుక ఉన్నది. సరిగ్గా అంతక ముందు రెండున్నర దశాబ్దాల నుంచే సువిశాల భారత భూభాగంలోని సహజ వనరులన్నిటినీ కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం భారత పాలకులకు ఉన్నది. కార్పొరేట్ దోపిడీని అన్ని స్థాయిల్లో, అన్ని రూపాల్లో గుర్తించాలి. ఇందులో ఒకటి ప్రధానం, మరొకటి అప్రధానం అనుకోడానికి లేదు. ఆదివాసీ ప్రాంతాల సహజ వనరుల దోపిడీ ఆదివాసుల కష్ట నష్టాలకు సంబంధించిందే కాదు. వాళ్ల అస్తిత్వ సమస్య మాత్రమే కాదు. భారత ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించే ప్రక్రియలో సహజ వనరుల దోపిడీ అతి ముఖ్యమైనది. దాన్ని మరింత ముందుకు తీసికెళ్లడానికి పాలకులు తాజాగా ఆపరేషన్ ప్రహార్ ` 3 చేపట్టారు. దీని ప్రకారం మరిన్ని లక్షల సైనికులను ఉద్యమ ప్రాంతంలో దించాలనకుంటున్నారు. దీనికి అవసరమైన బేస్ ఏరియాలను నిర్మించే ముమ్మర పనిలో ఉన్నారు.
దీనికి వ్యతిరేకంగా ఆదివాసులు ఒక ప్రజాస్వామిక పోరాటం కొనసాగిస్తున్నారు. ఆదివాసులు కనీసం రెండున్నర దశాబ్దాలుగా ఒక పక్క యుద్ధాన్ని, మరో పక్క ప్రత్యామ్నాయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్లే సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా చట్టబద్ధ పోరాటాలనూ అందుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మనం రైతుల పోరాటమనే అనుకోలేదు. మరీ ముఖ్యంగా ʹఢల్లీి రైతులʹ పోరాటంగా ప్రచారమైనా అది దేశ వ్యాప్త రైతాంగ పోరాటం అనుకున్నాం. మనందరి పోరాటమని అందులో భాగమయ్యాం. అట్లా మధ్య భారత దేశంలో సైనిక క్యాంపులు ఎత్తివేయాలని ఆదివాసులు చేస్తున్న పోరాటాన్ని సొంతం చేసుకోలేమా?
-పాణి
Keywords : chattis garh, adivasi struggles, bastar, bhijapur, crpf camps, jarkhand
(2023-05-31 14:45:52)
No. of visitors : 375
Suggested Posts
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ... |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
more..