జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !


జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !

18-01-2022

(జిందాల్ స్టీల్ వర్క్ ఉత్కల్ లిమిటెడ్ కోసం ఒడిశా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధింకియా చారిదేశ్ (మూడు గ్రామ పంచాయతీలు) ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. జనవరి 14న ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా ధింకియా గ్రామస్థులపై జరిగిన క్రూరమైన పోలీసు హింస, భయాత్పోతాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశం నలుమూలల నుండి అనేక మానవ హక్కుల సంస్థలు, విద్యార్థి, రైతు సంఘాలు, సామాజిక, రాజకీయ, స్త్రీవాద కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ధింకియా చారిదేశ్ ప్రాంతం నుండి పోలీసు బలగాలందరినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇప్పటి వరకు JSW విషయంలో పోస్కోకు వ్యతిరేకంగా ఉద్యమం నుండి ప్రజలపై పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిరసనకారులందరినీ విడుదల చేయాలని, పోస్కో ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని మొదట ఎవరి నుంచి సేకరించారో వారికే తిరిగి అప్పగించాలని ప్రకటనపై సంతకం చేసినవారు ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.)

రైతుల భూమికి దూరంగా వుండండి! ధింకియా చారిదేశ్ నుండి దూరంగా వుండండి!

జనవరి 14న జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ధింకియా గ్రామస్థులపై ఒడిశా పోలీసులు గంటల తరబడి సాగించిన క్రూరమైన పోలీసు హింసను దిగువ సంతకాలు చేసిన మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. జిందాల్ స్టీల్ వర్క్ ఉత్కల్ లిమిటెడ్ కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న భూ సేకరణకు వ్యతిరేకంగా ఆ ప్రాంత గ్రామస్తులందరూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

జనవరి 14న ఆ ప్రాంతంలో ర్యాలీకి తరలివస్తున్న వారిపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. మహిళలు, పిల్లలను వెంబడించి కొట్టడం, కింద పడి పోయిన గ్రామస్థులను పోలీసుల గుంపులుగా లాఠీలతో విపరీతంగా కొట్టడం, ప్రజలు సహాయం కోసం ఏడుస్తూండడం, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం లాంటి దృశ్యాలను ప్రాంతీయ టీవీ ఛానెల్‌లలో ఆ సాయంత్రం చూపించారు. ఈ ఘటనలో అనేక మంది గ్రామస్తులు గాయపడ్డారు. ఒడిశా పోలీసులు సృష్టించిన భీభత్సం, హింసల కారణంగా చాలా మంది చికిత్స చేయించుకోవడం కోసం బయటకు రాలేకపోయారు. వీరిలో కొందరి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. వ్యక్తులు తప్పిపోయినట్లు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. బహుశా వారు ఇంకా అడవిలోనో, తమలపాకుల తోటల్లోనో దాక్కుని వుంటారు.

ప్రజా ఉద్యమ నాయకుడు దేబేంద్ర స్వైన్‌తో సహా ఆరుగురిని, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు క్యాంపెయిన్ ఎగైన్స్ట్ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ (భువనేశ్వర్) (కల్పిత కేసుల వ్యతిరేక ప్రచారోద్యమం)నుండి నరేంద్ర మొహంతి, మురళీధర్ సాహూ, నిమై మల్లిక్, మంగులి కంది, త్రినాథ్ మల్లిక్ లను అరెస్టు చేసి, PC నంబర్ 21/22 GR-34/22 , IPC, CLA, PPDP చట్టాల సెక్షన్లు 307, 147, 148, 323, 294, 324, 354, 336, 325, 353, 332, 379, 427, 506, 186, 149కింద కేసు పెట్టారు. బంధువులకు ఎలాంటి సమాచారం యివ్వకుండా వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి, రహస్యంగా ఉంచి, జనవరి 15 తెల్లవారుజామున మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశ పెట్టారు. వారు వైద్య పరీక్షలు చేయమని కోరడానికి వీల్లేకుండా, లేదా పోలీసు లో వున్నప్పుడు వారి పట్ల జరిగిన దుర్వ్యవహారం ఎవరికీ తెలియకుండా వుండడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు.

గ్రామంలో వీధులు నిర్మానుష్యంగా వున్నాయి. ఆ మొత్తం ప్రాంతంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ పోలీసులను మోహరించారు. భయాందోళనలు, బెదిరింపులవల్ల గ్రామస్తులు తమ ఇళ్లలోనే వుండిపోయారు. చాలామంది తమ ఫోన్‌లను స్విచ్‌ ఆఫ్‌ చేసుకోవాల్సి వచ్చింది. చాలా మంది తమ ఇళ్లకు బయటి నుంచి తాళాలు వేసి వెనుక తలుపు ఉపయోగిస్తున్నారు.

తమలపాకు తోటలలో వేతన కూలీలుగా పని చేసే లేదా చేపలు పట్టే దళిత కుటుంబాలు ధింకియాలో వందల సంఖ్యలో ఉన్నాయి. పోలీసుల దుర్మార్గాలకు చాలా మంది గురవుతున్నారు. దళిత కుటుంబానికి చెందిన ఏడుగురిని, శిబా మల్లిక్, శంకర్ మల్లిక్, కౌశల్య పర్బతి మల్లిక్, కుసుమ్ మల్లిక్, శరత్ మల్లిక్, సుజన్ మల్లిక్, జిని మల్లిక్‌లను జనవరి 6న అరెస్టు చేశారు.

జనవరి 15నాడు, లాఠీ ఛార్జ్ ఘటనపై దర్యాప్తు చేయడానికి, గ్రామస్తులకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న SKM-ఒడిశా బృందాన్ని, వారి సమర్థకులను త్రిలోచన్‌పూర్ వైపు, ధింకియా వెలుపల 50 నుండి 60 మందికి పైగా వున్న పురుషుల గుంపు అడ్డుకుంది. వీరిని ఆపి, తిట్టి, మానవ హక్కుల సమర్థకులు గ్రామానికి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపించారు. బెదిరించారు, అవమానించారు, అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. పోలీసుల‌ నుంచి మద్యం సేవించిన వాసన వస్తోంది.

ఆ బృందంలో మహేంద్ర పరిదా, ప్రఫుల్ల సమంత, జ్యోతి రంజన్ మహాపాత్రో, ప్రదీప్త నాయక్, సంతోష్ రథా, జాంబేశ్వర్ సమనత్రే, సుజాతా సహాని, రంజనా పాధి తదితరులు వున్నారు. తమ పట్ల జరిగిన దానిపై ముగ్గురు సభ్యులు అభయచంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మేము ఈ ప్రకటనను చేయగానే, పోలీసులు ప్రతి ఇంటి తలుపును తట్టి శాంతి కమిటీలు వేయడానికి ప్రజలను బయటకు రావాలని కోరినట్లు మాకు తెలిసింది. ప్రజల భూమిని దోచుకోవడాన్ని చట్టబద్ధం చేయడానికి శాంతి కమిటీలు ఒక ప్రత్యక్ష మార్గం.

ఏ విధంగానైనా JSW కోసం భూమిని సేకరించడాన్ని, అనేక మంది ప్రజలూ, ప్రగతిశీల సంస్థలు చేసిన విజ్ఞప్తులను విస్మరించడాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పక్షం వహిస్తోందో స్పష్టంగా తెలుస్తోంది .
కల్పిత కేసులు పెట్టి చేస్తున్న ఏకపక్ష అరెస్టులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు సమాచారం అందించాం.

బయటి వారు రాకుండా గ్రామస్తులు కంచెలు కట్టుకొన్నారు కాబట్టి పోలీసులను ఉపసంహరించుకోవాలని పలు పౌర సంఘాలు, సంస్థలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. పోలీసులను ఉపసంహరించుకోవాలని, సాధారణ పరిస్థితులు నెలకొనాలని పీయూసీఎల్ ఒడిశా డిమాండ్ చేసింది. ఒడిశా-ఎస్‌కేఎం గవర్నర్‌కు విజ్ఞప్తి పత్రాన్ని అంద చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల తరపున భయోత్పాతాన్ని, హింసను, బెదిరింపులను ఉపయోగించడంలో ఎంతగా సహకరిస్తుందో ముఖ్యమంత్రి మౌనం స్పష్టం చేస్తోంది. ప్రజాపోరాటం ద్వారా సాధించిన విజయాలను వెనక్కి నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ధింకియా చరిదేశ్‌లోని పరిస్థితి మరోసారి బహిర్గతం చేసింది. ప్రజా ఉద్యమానికి సంబంధించిన, మద్దతుదారులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇదంతా గ్రామస్తులకు తమ భూమిని, జీవనోపాధిని, జీవితాలను రక్షించుకునే సంపూర్ణ హక్కును వ్యవస్థాగతంగా తిరస్కరించడానికే అనేది స్పష్టం.

దక్షిణ కొరియా ఉక్కు సమ్మేళనమైన పోస్కోను నిలువరించడంలో ధింకియా చరిదేశ్ ప్రజలు 2005 నుండి 2017 వరకు అనేక సంవత్సరాలు పోరాడి ఎలా విజయం సాధించారనేది అందరికీ తెలిసిందే. కానీ రాజ్యం మరోసారి వందల ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని తమలపాకులను, కూలీలను, మత్స్యకారులను పేదరికంలోకి నెడుతోంది. పోస్కో కోసం సేకరించిన భూమిని ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచడంతో పాటు, మరింత భూమిని JSWకి యివ్వాలనుకుంటోంది. ఆ కంపెనీకి ఇంకా పర్యావరణ అనుమతి లభించలేదు.

చివరగా, అతిముఖ్యమైన విషయం, JSW ప్రాజెక్ట్‌ లో వున్న ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ జెట్టీ, సిమెంట్ కర్మాగారం దుర్బలంగా ఉన్న ఒడిశా తీరప్రాంతంలో తరచుగా తుఫానులు రావడం, భూప్రాంతం తగ్గుముఖం పట్టడం వల్ల ఉపద్రవాల్ని సృష్టిస్తుంది. పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఖనిజాల తవ్వకాలు, ఉక్కు ఉత్పత్తి వల్ల కలిగే విధ్వంసాలకు సంబంధించిన అంశాలపై ఒడిశా ప్రభుత్వం మేల్కోవాలి.

మేము ఒడిశా ప్రభుత్వానికి ఈ క్రింది అంశాలపై విజ్ఞప్తి చేస్తున్నాం:

వెంటనే ఆ ప్రాంతం నుంచి పోలీసు బలగాలందరినీ వెనక్కి రప్పించాలి.

డిసెంబరు 4 నుండి ధింకియాలో జరిగిన సంఘటనలపై హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సిట్ విచారణ జరిపించాలి.

JSW విషయంలో ఇప్పటి వరకు పోస్కో వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ప్రజలపై పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలి.

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారందరినీ విడుదల చేయండి.

పోలీసుల భీభత్సంతో నేలమట్టం అయిన తమలపాకు తోటల యజమానులకు నష్టపరిహారం ఇవ్వాలి.

పోస్కో ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని తిరిగి ప్రజలకు అప్పగించాలి.

ప్రజల భూమి, జీవితాలు, జీవనోపాధిని రక్షించండి.

పెళుసుగా ఉన్న తూర్పు తీరప్రాంత పర్యావరణ స్థిరత్వాన్ని సమర్థించే ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని నిరోధించే ప్రయత్నాలను సులభతరం చేయాలి.

Biswapriya Kanungo, Advocate and Activist
Debaranjan – Ganatantrik Adhikar Suraksha Sangathan (GASS)
Pramodini Pradhan, PUCL Odisha
Shankar Sahu, All India Krantikari Kisan Sabha (AIKKS)
Srikant Mohanty, Chaasi Mulya Sangha
Mahindra Parida, AICCTU, Bhubaneswar
Bhalachandra Sadangi, New Democracy
Sudhir Pattnaik, Journalist and Social Activist
Ranjana Padhi, Feminist Activist and Writer
Sujata Sahani, Poet and Activist
Pramila Behera, AIRWO, Bhubaneswar
Sabyasachi, TUCI, Odisha
Tuna Mallick, Adivasi Bharat Mahasabha, Odisha
Hena Barik, Secretary, Basti Suraksha Manch, Bhubaneswar
Nigamananda Sadangi, Writer and Translator
Srimant Mohanty, Political Activist, Bhubaneswar
Pramod Gupta, Political Activist, Kolkakta
V Geetha, Feminist Historian and Writer, Chennai
Committee for Protection of Democratic Rights (CPDR) -Tamil Nadu
Saheli Womenʹs Resource Centre, New Delhi
PUCL, Maharashtra
Forum against Oppression of Women (FAOW), Mumbai
Swati Azad, Political Activist, Bhubaneswar
Nisha Biswas, WSS, Kolkata
Sujata Gothoskar, Labour Rights Activist, Mumbai
Arya, Labour Rights Activist, New Delhi
Venkatachandrika Radhakrishnan,Thozhilalar Koodam, Chennai
Venkat Narasimhan, Thozhilalar Koodam, Chennai
Alok Laddha, Teacher, Chennai
Santosh Kumar, Workers Unity, New Delhi
Anuradha Banerjee, Saheli, New Delhi
Shambhavi, General Secretary, Collective
Feminists in Resistance, Kolkata
Worker Peasant Student Unity Forum, Kolkata
Refraction, Kolkata
Revolutionary Studentsʹ Front, Kolkata
Inqilabi Studentsʹ Unity, Kolkata
Teachers Against Climate Crisis (TACC)

(groundxero.in సౌజన్యంతో)
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : odisha, jindal, Dhinkia, Jagatsinghpur district, POSCO, police attack on people
(2022-05-27 09:31:24)No. of visitors : 350

Suggested Posts


Successful bandh in Odisha

The bandh was convened to demand the immediate arrest of the accused for gang rape of a minor girl in Kunduli, control of violence against tribal women and a solution to the Mahanadi area. The movement of vehicles was affected in the five districts due to the bandh, according to the reports....

Maoist posters on Russian Revolution in Narayanpatna

Maoist posters resurfaced in Narayanpatna of Koraput district with the rebels appealing people to participate in the week-long centenary celebrations of the Russian Revolution from November 7-13 across the State....

మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ ‍-ఒడిశాలో అనేక చోట్ల ఎన్నికల వాయిదా

మల్కన్ గిరి, కోరాపూట్, గంజా‍ం, గణపతి, కొందమాల్ జిల్లాల్లో వందలాది గ్రామాల్లో పార్టీ ప్రచారం ముమ్మరంగాసాగుతోంది. అనేక గ్రామాల్లో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. చిత్రకొండ సమితిలోని 18 పైగా పంచాయితీల్లో, 2 జిల్లా పరిషథ్ జోన్లలో, కటాఫ్ ఏరియాలోని 9 పంచాయితీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు వేయకపోవడంతో అధికారులు అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు....

Maoist movement puts Odisha cops on toes

THE intelligence inputs on movement of a small group of Maoists in the tri-junction area of Angul, Nayagarh and Cuttack rural district, has put Odisha Police on alert. Cops have started combing operation in Angul district amid reports of Maoist movement at Satkosia-Narasinghpur border.

పోలీసు అరాచకాలను నిరసిస్తూ ఎస్పీ ఆఫీస్ ను ముట్ట‌డించిన ఆదివాసీలు

తమ గ్రామాలపై దాడులు, అరెస్టులు, స్త్రీలపై అత్యాచారాలు తక్షణం ఆపివేయాలని , కూంబింగ్ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది ఆదివాసులు ఒడీశా రాయగడ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అడవిపై ఆధారపడి జీవించే తమపై.....

Where is gau rakshaks - Vehicle in Amit Shahʹs convoy hits cow in Odisha

At a time when the incidents of lynchings in the name of ʹgau rakshaʹ are being reported from across the country, a vehicle in BJP president Amit Shahʹs motorcade hit a cow during his Odisha tour on Thursday, leaving the animal wounded and prompting a sarcastic....

Maoist posters warn informers in Odishaʹs Kalahandi district

A couple of Maoist posters appealing to the villagers not to become police informers was found at Lakhbahali near Pahadpadar village under Lanjigarh block of Kalahandi district on Thursday. The Maoists have also appealed to the locals to observe ʹSahid Divasʹ on Thursday....

మతం మారాడని ఓ బాలుడిని ముక్కలుగా నరికి చంపిన మతోన్మాదులు

ఓ కుటుంభం మతం మారిందన్న‌ కోపంతో మతోన్మాదులు ఓ 14 ఏళ్ళ బాలుడిని ముక్కలుగా నరికి చంపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కెండుగుడ అనే గ్రామంలో ఉంగా మద్కామి అతని కుమారుడు సమరూ మద్కామీ మూడు సంవత్సరాల‌ క్రితం క్రైస్తవ మతంలోకి మారారు.

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు

ఓడిశా లో ఓ బాలికపై పోలీసు స్టేషన్ లోనే ఇన్‌స్పెక్టర్ తో సహా పలువురు పోలీసులు కొన్ని రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. మార్చ్ 25 న సుందర్ గడ్ జిల్లా బిరమిత్రపూర్ లో జరిగిన ఓ ప్రదర్శనలో పాల్గొనడానికి 13 ఏళ్ళ బాలిక వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ ప్రదర్శన రద్దయ్యింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులు కూడా లేవు.

సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్

సీపీఐ మావోయిస్టు ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ దుబాసీ శంకర్ ఎలియాస్ మహేందర్ అరెస్టయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని బాయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేందర్ ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ తెలిపారు.

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


జిందాల్