విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన
19-01-2022
బీహార్ కు చెందిన విప్లవ సాహితీ-సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ గత సంవత్సరం డిశంబర్ 22 నాడు మరణించారు. ఆయనకు అరుణాంజలి ఘటిస్తూ సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రకటన పూర్తి పాఠం....
నక్సల్బరీ ప్రజ్వలనానికి స్పందించిన బిహార్ తొలితరం సాహితీ-సాంస్కృతికోద్యమ నాయకులు కామ్రేడ్ రాజ్ కిశోర్ తన 89వ యేట 2021డిసెంబర్ 22 ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి, ప్రత్యేకించి విప్లవ సాహితీ-సాంస్కృతికోద్యమానికి దాదాపు 4 దశాబ్దాల పాటు అవిరళ సేవలందించిన కామ్రేడ్ రాజ్ కిశోర్‌కు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ తలవంచి వినమ్రంగా అరుణాంజలి ఘటిస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల, అయన సహచర సాహితీ-సాంస్కృతిక మిత్రుల దుఃఖంలో పాలుపంచుకుంటోంది. కామ్రేడ్ రాజ్ కిశోర్ కలలు గన్న సమతా-సామ్యవాద సమాజం కోసం చివరి ఊపిరి వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నది. అందుకోసం భారత నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావాల్సిందిగా యావత్తు భారత పీడిత ప్రజలకు మా కేంద్రకమిటీ పిలుపునిస్తోంది.
కామ్రేడ్ రాజ్ కిశోర్ బిహార్‌లోని క్రాంతికారీ నవజన్ వాదీ సాంస్కృతిక్ సంఘ్ నాయకులుగా పనిచేసారు. ఆ రాష్ట్రంలో విప్లవ సాంస్కృతికోద్యమంలో తొలి నుండి పనిచేస్తూ విశేష సేవలు అందించారు. రాష్ట్ర విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమానికి మార్గదర్శక నాయకులుగా అభివృద్ధి చెందారు. ఆయన అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్-ఏఐఎల్ ఆర్సీ) వ్యవస్థాపక నాయకులు. క్రాంతికారీ నవజవాదీ సాంస్కృతిక్ సంఘ్ ను ఏఐఎల్ ఆర్ సీలో సభ్య సంఘంగా భాగం చేయడంలో ముఖ్యపాత్ర నిర్వహించారు. 1983లో ఢిల్లీలో జరిగిన ఏఐఎల్ ఆర్ సీ వ్యవస్థాపక మహాసభల్లో పాల్గొన్నారు. అల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (ఏఐపీఆర్ఎఫ్), రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్)లలో కూడా ఆయన చేరి పనిచేసారు.
ఏఐఎల్ ఆర్ సీ అధ్యక్షులుగా, ఏఐపీఆర్ఎఫ్, ఆర్డీఎఫ్ నాయకులుగా దేశమంతా పర్యటించారు. కామ్రేడ్ రాజ్ కిశోర్ తన పేరులో కుల చిహ్నమైన సింగ్ ను వదులుకుంటున్నానని, తనను రాజ్ కిశోర్
అని పిలవాలని బహిరంగ ప్రకటన చేసారు. ఆయన ప్రముఖ వక్త. బిహార్‌లోనూ, దేశవ్యాప్తంగా జరిగిన అసంఖ్యాకమైన సభల్లో, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. భారత పీడిత వర్గాలను, పీడిత సామాజిక సెక్షన్లను, పీడిత జాతులను మూడు మహా పర్వతాలు - సామ్రాజ్యవాదం, భూస్వామ్యం, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానం - ఎక్కి తొక్కుతున్నాయనీ, భారత ప్రజల మూలుగలను పీల్చి పిప్పి చేస్తున్నాయనీ, ఈ మూడు మహా పర్వతాలను కూలదోసి, దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో విప్లవాన్ని విజయవంతం చేయడంలో దేశంలో నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడమే దేశ ప్రజల విముక్తికి ఏకైక మార్గమనే భారత నూతన ప్రజాస్వామిక విప్లవ సందేశాన్ని విశాల ప్రజారాశులకు, మేధావులకు అందించిన ప్రముఖ విప్లవ మేధావి ఆయన.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐఎల్ ఆర్ సీ, ఏఐపీఆర్ఎఫ్ లపై నిషేధం విధించినా ఆయన ఏమాత్రం భయపడలేదు. తన విప్లవ లక్ష్యానికి మరింతగా అంటిపెట్టుకుని తన విప్లవాచరణను కొనసాగించారు. ఆర్డీఎఫ్ లో పని చేసే క్రమంలో దానిని కూడా నిరంకుశ ప్రభుత్వాలు నిషేధించాయి. విప్లవ భావాలు కలిగి వున్నందుకు ఆయన పలు మార్లు జైలుకు పోవాల్సి వచ్చింది. ఇవేవీ ఆయనలో విప్లవ భావాలను సడలించలేకపోయాయి. కామ్రేడ్ రాజ్ కిశోర్ ఒకటి రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నారు. పక్షవాతంతో కదలలేని స్థితిలో, కొద్దికాలంగా మాట కూడ రాని స్థితిలో కూడా చివరి శ్వాస వరకు విప్లవోద్యమ స్ఫూర్తిని ఎత్తిపట్టారు.
భారత పీడిత ప్రజలారా! సాహితీ-సాంస్కృతిక కార్యకర్తలారా! భారత విప్లవ మేధావి కామ్రేడ్ రాజ్ కిశోర్ దేశ ప్రజలకూ, భారత విప్లవానికి చేసిన సేవల్ని ఎత్తిపట్టండి. అయన చూపిన విప్లవ మార్గంలో విప్లవ సాహితీ-సాంస్కృతికోద్యమాన్ని కొనసాగించండి. భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయానికై దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో ముందుకు సాగండి. దేశంలో సమతా-సామ్యవాద సమాజ స్థాపన కోసం నడుం బిగించడమే అయనకు అర్పించే నిజమైన నివాళి.
అభయ్.
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
సీపీఐ (మావోయిస్టు)
Keywords : bihar, raj kishor, ailrc, aiprf, rdf, cpi maoist, cultural activist
(2022-05-26 08:48:30)
No. of visitors : 270
Suggested Posts
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం. |
| Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!CPI (Maoist) is about to celebrate its 17th Anniversary. The CC of our party gave a detailed revolutionary message almost one month back. On the occasion the CC conveys revolutionary |
| పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల పిలుపుభారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోబోతున్నది. మా పార్టీ కేంద్రకమిటీ దాదాపు నెల రోజుల క్రితమే సవివరమైన విప్లవ సందేశాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ తరపున యావత్ పార్టీ శ్రేణులకు; పీఎల్జీఏ కమాండర్లకు, యోధులకు; విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులకు, కార్యకర్తలకు; విప్లవ ప్రజా కమిటీల నాయకులకు, కార్యకర్తలకు; దేశం |
| బస్తర్ పై 12 గంటల పాటు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేసిన సైన్యం - సాక్ష్యాలతో బైటపెట్టిన మావోయిస్టు పార్టీదండకారణ్యంలోని సౌత్ బస్తర్‌లో మరోసారి ఏరియల్ బాంబు దాడి జరిగిందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం |