మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం


మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం

మోడీ

19-01-2022

ఔరంగజేబ్‌, శివాజీ పేర్లను ఉపయోగించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ ఖండించారు. అలాగే విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపట్ల మౌనం వహించడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ప్రసంగాలు చేసిన వారికి కనీస శిక్ష విధించేలా ప్రస్తుత చట్టాలను సవరించాలని అన్నారు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగ జేబుని ఆక్రమదారుడిగా చెడ్డ వ్యక్తిగా పేర్కొనడం, లౌకిక నేతగా శివాజీని పేర్కొనడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం సరికాదని జస్టిస్‌ నారిమన్‌ పేర్కొన్నారు. జనవరి 14న డిఎం. హరీష్‌ స్కూల్‌ ఆఫ్‌ లా ( ముంబయి) ప్రారంభోత్సవం సందర్భంగా నారిమన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది డిసెంబర్‌ 13న వారణాసిలో మోడీ మాట్లాడుతూ, ఆక్రమణదారులైన ముస్లింలకు వ్యతిరేకంగా మంచి హిందూ పాలకులను నిలబెట్టే లక్ష్యంతో బిజెపి పనిచేస్తోందని అన్నారు. ఆక్రమణ దారులు వారణాశి నగరంపై దాడులు చేశారని, ధ్వంసం చేసేందుకు యత్నించారని .. ఔరంగజేబు దాడులు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయని అన్నారు. బెదిరింపులతో పరిపాలనను మార్చాలని చూశారని .. మూఢత్వంతో మన సంస్కృతిని నాశనం చేయాలని చేయాలని చూశారని అన్నారు. అయితే ప్రపంచంతో పోలిస్తే.. భారత గడ్డ విభిన్నతను ప్రదర్శిస్తుందని.. మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు లాంటి వారు వస్తే.. మహారాష్ట్ర యోధుడు శివాజీ లాంటి వారు పుట్టుకొస్తారని మోడీ పేర్కొన్నారు. ఇలా మత విద్వేశాలు రెచ్చగొట్టేలా మోడీ మాట్లాడటం పట్ల నారిమన్ అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

మన రాజ్యాంగంలోని సోదరభావానికి ప్రధానమైన విలువ ఉందని, మన చర్యలు సోదరభావాన్ని పెంచేలా ఉండాలని నారిమన్‌ పేర్కొన్నారు. అక్బర్‌ లౌకికత్వాన్ని కాపాడటంలో ప్రసిద్ధి పొందారని, లేకుంటే బాబర్‌ను ఎంచుకోవచ్చని అన్నారు. సహనశీలతను, సోదరభావాన్ని పెంచేందుకు కృషి చేయాలంటూ బాబర్‌ హుమమూన్‌కి రాసిన లేఖను నారిమన్‌ ఈ సందర్భంగా చదివివినిపించారు. ప్రతి కమ్యూనిటీకి వారి సిద్ధాంతాల ప్ర కారం న్యాయం చేయాలని, ఆవులని బలి ఇవ్వకూడదని ఆ లేఖలో బాబర్‌ సూచించారు. దురదృష్టవశాత్తు అధికార పార్టీలోని ఇతర ఉన్నతస్థాయి అధికారులు కూడా విద్వేషపూరిత ప్రసంగాలను చేయడమే కాకుండా వాటిని ఆమోదిస్తున్నారని అన్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌ కార్యక్రమాన్ని ప్రస్తావించారు.

ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమే కాదు. క్రిమినల్‌ చట్టం ప్రకారం శిక్షార్హమని అన్నారు. ఐపిసిలోని 153(ఎ), 505(సి) ప్రకారం నేరంగా పరిగణించబడతాయని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారికి కనీస శిక్ష విధించేలా సంబంధిత‌ చట్టాల్లో సవరణలు చేయాలని పార్లమెంట్‌కి ప్రతిపాదించారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు కానీ ఆచరణలో ఇది సాధ్యం కాదని .. ఎందుకంటే శిక్ష విధించడం జరగదని అన్నారు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను పటిష్టం చేయాలనుకుంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి కనీస శిక్ష విధించేలా చట్టాలను సవరించాలని సూచించారు. తమ ప్రభుత్వానికి ఇబ్బందికరమని భావించిన యువత, విద్యార్థులు, కమెడియన్‌లు ఇలా ఎవరిపైనైనా దేశద్రోహ చట్టాన్ని ప్రయోగించి జైలు పాలు చేయడం పట్ల నారిమన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Keywords : R FNariman, narendra modi, varanasi, ourangajeb, shivaji
(2022-05-25 10:50:26)No. of visitors : 268

Suggested Posts


హిప్నాటిజం చేసి డబ్బులు దోచుకున్నాడు !

మోసం చేయడానికి ఉన్న అనేక మార్గాల్లో ఇప్పుడు హిప్నటిజం కూడా చేరింది. ఓ బ్యాంకు మేనేజర్ ను హిపటైజ్ చేసిన ఓ అగంతకుడు 93 వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు....

కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ

రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్‌ స్టేషన్‌ బయట గందరగోళం ప్రారంభమయ్యింది

హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె

పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా దభోల్కర్‌ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్‌) తెలిపింది.

LOOKING BACK AT 50 YEARS OF A PEOPLEʹS MOVEMENT

The Naxalbari movement began 50 years ago, and is still on. ʹNowhere else in the world will you find a continued class struggle that has lasted so many years,ʹ said Vara Vara Rao, the famous Telugu poet and writer, speaking on ʹ50 Years of Naxalbari, Looking Back, Looking Forwardʹ.....

చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు

ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో ప్రాజెక్టు పేరుతో చెట్లు కొట్టేయడానికి వ్యతిరేకంగా కొంత కాలంగా పర్యావరణ ప్రేమికులు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. నిన్న (10/05/2019) అర్దరాత్రి చెట్లు మెట్రో ప్రాజెక్టు అధికారులు వర్కర్స్ అక్కడికి చేరుకొని చెట్లు నరికివేయడం మొదలుపెట్టారు. దాంతో నిరసన తెలపడానికి పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిపై దుర్మ

Search Engine

జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
ప్రధానమంత్రికి 108 మంది మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ
సాంస్కృతిక జాతీయవాదపు అసలు రూపు బుల్డోజర్ - ఎన్.వేణుగోపాల్
Letʹs take advantage of the growing revolutionary conditions internationally, letʹs destroy imperialism - Maoist Party Central Committee statement ‌
పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం
జిగ్నేష్‌ మేవానీ మళ్ళీ అరెస్టు...బెయిల్ పొందిన వెంటనే మరో కొత్త కేసు
నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం
more..


మోడీ