UP:బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్న జనం.... ప్రచారం వదిలేసి పారిపోయిన డిప్యూటీ సీఎం
24-01-2022
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అనేక చోట్ల అధికార బీజేపీ నాయకులుఅవమానాలపాలవుతున్నారు.
ఒకవైపు రైతుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ ఇతర వర్గాల నుండి కూడా నిరసనలు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. తాజాగా ఏకంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంకే అవమానం ఎదురైంది.
(deputy cm keshav prasadh mourya) యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తన సొంత నియోజకవర్గం sirathu సీరత్లో చుక్కెదురైంది. గులామిపూర్ గ్రామంలో మౌర్య తన ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. మౌర్య ఇళ్ళలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా మహిళలు ఆయన మొహం మీదే తలుపులు వేసేశారు. అనేక మంది గ్రామస్తులు మౌర్య కారును అడ్డుకున్నారు. ఆయనకు , బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఎంత చెప్పినా ప్రజలు వినకపోవడంతో మౌర్య గ్రామంనుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ వీడియో (social media) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా ఇదే గ్రామానికి చెందిన జిల్లా పంచాయతీ సభ్యురాలి భర్త రాజీవ్ మౌర్య గత వారం రోజులుగా కనిపించకుండా పోయారు. ఆ విషయమై పోలీసులు కనీసం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం మౌర్యను ప్రజలు ప్రశ్నించారు. నిరసన తెలిపారు.
మరో వైపు సియానా నియోజకవర్గ బీజెపి ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ లోధీకు కూడా తన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక ఆయన ప్రజల నిరసనలను ఎదుర్కొంటున్నారు. మాక్రి అనే గ్రామంలో తీవ్ర నిరసనలను ఎదుర్కొన్న ఆయన అక్కడే ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను నియోజక వర్గ అభివృద్ది చేయలేకపోయినందుకు తనను క్షమించాలని, తాను గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయబోనని ప్రజలు అర్దం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
ఇటీవలే మరో బీజేపీ ఎమ్మెల్యేకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. యూపీలోని ముజఫరనగర్ (muzafar nagar) నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ (vikram singh sainy) ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన మీటింగ్ హాజరయ్యేందుకు బుధవారం వెళ్ళారు. అతడిపై కోపంగా ఉన్న స్థానికులు ఎమ్మెల్యేకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా... వ్యవసాయ చట్టాలు తీసుకవచ్చి రైతుల మరణాలకు కారణమైన మోడీ ప్రభుత్వంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. అయితే అతడి కారును కూడా స్థానికులు వెంబడించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Keywords : uttar pradesh, keshav prasad mourya, dy,CM, sirat, UP Deputy CM Keshav Prasad Maura bitter Experience campaign in his own constituency ..
(2022-06-27 15:42:35)
No. of visitors : 267
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..