హిజాబ్ ధరించారని విద్యార్థినులను కాలేజీలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - ప్రభుత్వ ఆదేశాలు ఫాలో అవుతున్నానని వెల్లడి


హిజాబ్ ధరించారని విద్యార్థినులను కాలేజీలోకి రానివ్వని ప్రిన్సిపాల్ - ప్రభుత్వ ఆదేశాలు ఫాలో అవుతున్నానని వెల్లడి

హిజాబ్

03-02-2022

కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ గాళ్స్ కాలేజీలో ఎప్పటిలాగే గురువారం నాడు హిజబ్ ధరించి కాలేజ్ కు వచ్చారు ముస్లిం విద్యార్థినులు. అయితే ప్రిన్సిపల్, ఇతర అధికారులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. నుదట ధరించిన ఇస్లామిక్ హెడ్ స్కార్ఫ్‌ను తొలగిస్తేనే తరగతి గదుల్లోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి నిరాకరించిన విద్యార్థినులు అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ళుగా హిజబ్ ధరించే ముస్లిం విద్యార్థినులు ఈ కాలేజ్ కు వస్తుండగా ఇప్పుడు హటాత్తుగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వాళ్ళు ప్రశ్నించారు.

అయితే ఇది హటాత్తుగా జరిగిన సంఘటన కాదు. కుందాపూర్ బీజేపీ ఎమ్మెల్యే హాలాడి శ్రీనివాస్ శెట్టి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి 25 మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ వీరు ఇలా కాషాయ కండువాలు ధరించారు. పైగా విద్యార్థినులు హిజబ్ ధరించడాన్ని నిషేధించాలని వీరు డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సమక్షంలో హిజాబ్‌ను నిషేధించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ ఘటనపై సమాధానం చెప్పేందుకు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ నిరాకరించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం.. ప్రభుత్వ అధికారిగా.. డిపార్ట్‌మెంట్ ఆదేశాలను తాను అమలు చేయాల్సి ఉంటుందని చెప్పడం వినిపించింది. దీన్ని బట్టి విద్యాశాఖనే ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదంపై ముస్లిం విద్యార్థిని ఒకరు మాట్లాడుతూ.. బుధవారం నాటి సమావేశంలో హిజాబ్ లేకుండానే ముస్లింలు తమ పిల్లలను కళాశాలకు పంపాలని సూచించారని, అందుకు వారు నిరాకరించారని చెప్పారు. దీంతో తాము కాషాయ కండువాతో కళాశాలకు వస్తామని హిందూ విద్యార్థులు బెదిరించారని, వారి ఒత్తిడితో కాలేజీ అధికారులు హిజాబ్‌ను నిషేధించారన్నారు. ఇన్నేళ్లుగా తాము హిజాబ్ ధరించే వస్తున్నామని, కానీ ఒక్క రోజులోనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని, హిజాబ్‌ను నిషేధించినట్టు చెప్పారని వాపోయారు.

కాగా, ఎమ్మెల్యే శెట్టి నేతృత్వంలోని కాలేజ్ డెవలప్‌మెంట్ మానిటరింగ్ కమిటీ మాత్రం హిజాబ్‌ను నిషేధించాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉంది. దీనిపై విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వచ్చేవారం దీనిపై విచారణ జరగనుంది.

Keywords : karnataka, udupi, hijab denied, Students, Kundapur government pre-university college, Students wearing hijab denied entry in another college, principal says ʹfollowing govt ordersʹ
(2023-05-31 22:33:51)



No. of visitors : 453

Suggested Posts


ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు

కర్ణాటకలోని చిక్‌మగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు మతోన్మాదులు ఓ అమ్మాయిని వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. అందుకు కారణం ఆ అమ్మాయి సరదాగా ʹఐ లవ్‌ ముస్లిమ్స్‌ʹ అని వాట్సప్‌లో మెసేజ్ చేయడమే.

Support the struggle for human dignity and livelihood .

ix months back onwards 577 Adivasi families had legally occupied government land in siddapura near virajpet and constructed hutments in order to escape the bonded wage labour in the coffee estate....

War and Peace in the Western Ghats

The last two weeks have been the most traumatic in my life. At one go, these two weeks have shown how various forms of violence operate: the shrinking democratic space, the betrayal by the so-called mentors of our age, a government that has no control over the police and, above all, what domestic violence can do. Feminism declares

న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?

ʹఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు బాధితులు, సాక్షులైన మహిళలను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం

భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల

దక్షిణ కన్నడ జిల్లాలోని కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనానికి అంచున ఉన్న మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడిని, అతని తండ్రిని 2012లో కర్ణాటక పోలీసుల నక్సల్ వ్యతిరేక విభాగం అరెస్టు చేసింది.

స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాదిపై బీజేపీ దుర్మార్గ దాడి !

తమకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్న బీజేపీ నాయకులు.. స్వతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న వారినీ వదలడం లేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించిన‌

స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు బ్రాహ్మణిజం వ్యతిరేకం అన్నందుకు నటుడిపై కేసు

బ్రాహ్మణిజాన్ని విమర్షించినందుకు కన్నడ నటుడు చేతన్ పై కేసు నమోదయ్యింది. అతనిపై బసవనగుడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

మత మార్పిడికి పాల్పడుతున్నారంటూ ఓ దళిత కుటుంబంపై దాడి చేసిన మతోన్మాదులు

ఓ మతోన్మాద గుంపు దళిత కుటుంబంపై దాడి చేసి దారుణంగా కొట్టారు,హింసించారు. ఆ దళిత కుటుంబం ఇతరులను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ ఆ మతోన్మాద మూక ఈ దారుణానికి ఒడిగట్టింది.

దళిత యువకుడిపై తీవ్ర చిత్ర హింసలు...లాకప్ లో మూత్రం తాగించిన పోలీసులు

కర్నాటకలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కస్టడీలో ఉన్న దళిత యువకుడితో బలవంతంగా మూత్రం తాగించాడు. ఈ విషయంపై బాధితుడు పై అధికారులకు లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తమ వాకిట్లో అడుగు పెట్టారని దళిత యువకులపై అగ్రకుల మూక దాడి - ఆత్మహత్య యత్నం చేసిన దళితులు

తమ వీధిలోకి వచ్చారనే కోపంతో ఇద్దరు దళిత యువకులపై అగ్రకుల మూక దాడి చేయడంతో అవమానం భరించలేని ఆ యువకులు ఆతమహత్యకు ప్రయత్నించారు. కర్నాటక రాష్ట్రం యల్ బుర్గ తాలూకా హోసల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు.

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


హిజాబ్