అగ్రకులాల హింసలు,దాడులు,వివక్ష భరించలేక ఇస్లాంలోకి మారిన 40 మంది దళితులు


అగ్రకులాల హింసలు,దాడులు,వివక్ష భరించలేక ఇస్లాంలోకి మారిన 40 మంది దళితులు

అగ్రకులాల

అగ్రకులాల వాళ్ళు పెడుతున్న హింసలు, చేస్తున్న దాడులు, అణిచివేతలను భరించలేక ఎనిమిది దళిత కుటుంబాలకు చెందిన నలభై మంది ఇస్లాం మతాన్ని స్వీకరించారు.

తమిళనాడు తేని జిల్లా బోడినాయకనూర్ పట్టణానికి దగ్గరలోని దోంబిచేరి అనే గ్రామంలో నాలుగురోజుల క్రితం దళితులు ఇస్లామిక్ మత పెద్దల సమక్షంలో ఇస్లాం స్వీకరించారు.

అగ్రవర్ణ హిందువులు తమపై నిరంతరం దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన దళితులు ʹʹమమ్ములను స్థానిక రెస్టారెంట్లకు రానివ్వరు, టీ షాపుల్లో టీ, కాఫీ తాగడానికి అనుమతించరు, జుట్టు కటింగ్ చేయడానికి స్థానిక షాపులకు అనుమతించరు, మాపై దాడులు చేస్తుంటారు, మా బాలికలను ఆటపట్టిస్తూ ఉంటారు, వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, సైగలు చేస్తుంటారుʹʹ అని ఆరోపిస్తున్నారు.

మతం మారక ముందు వీరలక్ష్మి గా ఉండి ప్రస్తుతం రహీమా అని పేరు మార్చుకున్న మహిళ మాట్లాడుతూ, ʹమేము గతిలేని పరిస్థితుల్లో మతం మార్చుకున్నాము. అగ్రవర్ణ హిందువులు నడిచే వీధిలోనే మమ్మల్ని ఆటపట్టిస్తున్నారు, కొట్టారు, అవమానిస్తున్నారు, మమ్ములను వీధుల్లో నడవనివ్వడం లేదు. మా తల్లిదండ్రులు మరియు తాతలు ఈ అవమానానికి గురయ్యారు. ఈ అవమానాలు ఇక చాలని మేము నిర్ణయించుకున్నాము. మేము ఇప్పుడు ముస్లింలం. ఇప్పుడు మాకు ఎటువంటి సరిహద్దులు లేవు. అన్నారు

అగ్రవర్ణ హిందువులు తమపై క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నారని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దొంబుచేరి గ్రామంలో దళితులపై హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయని మతం మారిన ప్రజలు ఆరోపించారు.

న‌వంబర్ 2021లో దీపావళి వేడుకల్లో అగ్రవర్ణాల వ్యక్తులు తనను కొట్టారని, ఆ సంఘటన తర్వాత తాను ఇస్లాంలోకి మారాలని నిర్ణయించుకున్నానని రహీమా భర్త మహమ్మద్ ఇస్మాయిల్, (మతం మారక ముందు కలైకన్నన్ )చెప్పాడు. తాను మోటర్‌ బైక్‌ కొనుక్కోగా దళితులకు బైక్ ఎందుకంటూ తనను అగ్రవర్ణాల వ్యక్తులు కనికరం లేకుండా కొట్టారని, తమిళనాడులోని గ్రామాల్లో దళితులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.

తమిళ్ పులిగల్ పార్టీ తేని నార్త్ సెక్రటరీ మహమ్మద్ అలీ జిన్నా మాట్లాడుతూ తను పేరు గతంలో వరిముత్తు అని, పదిహేనేళ్ల క్రితం ఇస్లాంలోకి మారాన‌ని చెప్పారు. మతం మారడానికి కారణం దళితులపై అగ్ర‌కుల హిందువుల దౌర్జన్యాలే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. ʹʹవారు నడిచే వీధుల్లో నడవడానికి కూడా మాకు అనుమతి లేదు. ఇస్లాంలోకి మారిన తర్వాత నాకు గౌరవం లభిస్తోంది, మనిషికి ఇదే కావాలి.ʹʹ అన్నారాయన‌

అయితే అగ్రకులాల హింసలవల్లనే దళితులు మతం మారారన్న వాదనను హిందూ సంఘాలు ఖండించాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) వంటి ఇస్లామిస్ట్ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టి ఇస్లాంలోకి మారాలని బలవంతం చేస్తున్నాయని హిందూ మున్నాని నాయకుడు అర్జున్ సంపత్ అన్నారు.

ʹమేము దోంబుచేరి గ్రామ ప్రజల దగ్గరికి వెళ్తాము. వాళ్ళు మతం మారకుండా ఒప్పిస్తాము. కొద్ది రోజుల్లో అంతా చక్కబడుతుంది.ʹʹ అని అర్జున్ అన్నారు.

అంతా చక్కబడటం అంటే ఆ 40 మంది దళితులు తిరిగి హిందూ మతంలోకి చేరడమా లేక ఆ దళితులపై అగ్రకులం వాళ్ళ హింసలు, దాడులు, దౌర్జ‌న్యాలు, వివక్ష అంతరించడమా ?

Keywords : tamilanadu, teni district, Dombicheri village, Bodinayakanur town, Dalit families, converted, islam,
(2022-06-27 08:32:17)No. of visitors : 302

Suggested Posts


కరోనా కన్నా కులమే ప్రమాదకర‌ వైరస్...పా రంజిత్

కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు.

ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !

చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు.

వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌

నిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం...

కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket

A Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal

పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌

మొబైల్ షాపు న‌డుపుకునే ఇద్ద‌రు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య చేశారు. త‌మిళ‌నాడు తూతుకూడి జిల్లా శ‌తాంకులంలో ఫెనిక్స్‌ (31) చిన్న మొబైల్ షాపు న‌డుపుతుంటాడు.

న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌

తంజావూర్‌ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు.

లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య‌!

"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన. కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !

1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద

వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలు

పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్‌ అనే వ్యక్తి బుల్లెట్‌ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


అగ్రకులాల