Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల‌ పోరాటం


Andhrapradesh:తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం దశాబ్దాల‌ పోరాటం

Andhrapradesh:తమ

17-02-2022

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మలపాడు గ్రామ ప్రజలు 1997లో అనూహ్యమైన ఒక విజయాన్ని సాధించారు. మైనింగ్‌ కార్యకలాపాల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ప్రైవేటు కంపెనీకి వ్యతిరేకంగా సాగిన న్యాయపోరాటంలో వాళ్ళు విజయం పొందారు.

సుప్రీంకోర్టు 1993లో, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా యిచ్చిన తీర్పును కొట్టివేసింది. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఖనిజ సంపదను వెలికితీసే హక్కు కొండదొర తెగకు చెందిన ప్రజలకు మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలకు మాత్రమే వుందని, ప్రభుత్వం మద్ధతు యిచ్చినప్పటికీ ఈ ప్రాంతాలలో ప్రైవేటు మైనింగ్‌ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది.

ఈ వివాదంలో న్యాయపోరాటంలో స్థానికులకు సహాయంచేసిన ʹసమతʹ అనే సంస్థ పేరుమీద ఈ తీర్పుని ప్రజలందరూ సమతా తీర్పు అని పిలుస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తానే మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టాలనుకున్నా ముందుగా ఆదివాసీల ప్రయోజనాలను అది దృష్టిలో వుంచుకోవాలని కూడా న్యాయస్థానం చెప్పింది.

అయినప్పటికీ, రెండు దశాబ్దాల తరవాత, ఆంధ్రప్రదేశ్‌` ఒడిషా సరిహద్దు గ్రామాలలోని ప్రజలు తమ ప్రాంతాలలో దొరికే సున్నపురాయి నిధులపై యాజమాన్యం కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ సున్నపురాయిని ఇళ్ళ నిర్మాణంలోనూ, మట్టిని శుభ్రం చేయడంలోనూ, ఇళ్ళు తవ్వేటప్పుడు పునాదులను గట్టిపరచడానికీ, రంగుల తయారీకీ వాడతారు.

మైనింగ్‌ లైసెన్సులు యివ్వడానికి అధికారంగల ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (APMDC) 1977 నుండి, కొండదొర తెగకు చెందిన వ్యక్తులకు లేదా సహకార సంఘాలకు ఐదుసార్లు లైసెన్సులు మంజూరు చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమం నుండి ప్రజలను దూరంగా వుంచడానికి ఆ సంస్థ ప్రతిసారీ కొత్తకొత్త పద్ధతులను అనుసరించింది.

2006, 2012, 2018, 2019, 2021లలో టెండర్లను ప్రకటించారు. అయినా ఒక్క 2012లో మాత్రమే నాలుగు హెక్టార్ల భూమిలో తవ్వకాలు జరపడానికి ప్రజలు అనుమతించారు. అదికూడా వాళ్ళకు తగినంతగా నష్టపరిహారం చెల్లించాకనే.

ʹʹదుర్గా శాండ్‌స్టోన్‌ పరస్పర సహకార సంఘం మైనింగ్‌ కిందకు వచ్చిన భూములకుగాను ప్రజలకు సంవత్సరానికి రెండు లక్షలు చెల్లించింది. భూమిలేనివారికి సంవత్సరానికి లక్షరూపాయలు ఇచ్చింది. ఆ సంస్థ కొంతమందిని సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకు జీతాలుకూడా ఇచ్చిందిʹʹ అని కరకవలస గ్రామస్ధుడు లచ్చన్నరావు అన్నారు.

మళ్ళీ ప్రారంభమైన దాడులు :

ప్రజల ప్రాథాన్యతను తగ్గించడానికి 16మార్చి 2021న మరొక ప్రయత్నం జరిగింది. ఆ రోజు APMDC 32.7 హెక్టార్లలో సున్నపురాయి తవ్వకాలకు సంబంధించిన టెండర్లను ప్రకటించింది. దీని ప్రభావం నిమ్మలపాడు గ్రామంతోపాటు పక్కనేవున్న కరకవలస, రాళ్లగరువు గ్రామాలపై కూడా వుంటుంది. భారీ యంత్రాల సహాయంతో మైనింగ్‌ చేసే అనుభవం వున్న కాంట్రాక్టర్లు మాత్రమే ఈ వేలంపాటలో పాల్గొనవచ్చునని టెండర్‌లో షరతు పెట్టిన కారణంగా తాము అందులో పాల్గొనడానికి అవకాశంలేకుండా పోయిందని వాదించి గ్రామస్ధులు కొద్దిరోజుల్లోనే హైకోర్టు నుండి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు.

గతంలో దుర్గా శాండ్‌స్టోన్‌ సొసైటీలో పనిచేసి, ఇప్పుడు తామే నేరుగా మైనింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనాలనుకున్న కొందరు గ్రామస్థులు శ్రీ అభయ గిరిజన పరస్పర సహకార లేబర్‌ సహకార సంస్ధను స్థాపించుకొని దాని తరఫున పై పిటీషన్‌ దాఖలు చేశారు.

ʹʹమా పెద్దలు ఎన్నడూ మైనింగ్‌లో పాల్గొనాలని అనుకోలేదు. అయితే ప్రభుత్వం మొండి పట్టుదల చూశాక మేంకూడా ఇందులో జోక్యం చేసుకోవడమే మేలని నిర్ణయించుకొన్నాంʹʹ అన్నారు ఆ సంస్థలో ఒక సభ్యుడైన చొంపి బాలరాజు.

ఆ వివాదస్పద నిబంధనను APMDC గత సంవత్సరం ఏప్రిల్‌లో తొలగించి, కొండదొర తెగకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లకు ఐదు సంవత్సరాలపాటు మైనింగ్‌ చేసుకునే లైసెన్సు ఇచ్చింది. కాని వాళ్ళెవరూ ఈ మూడు గ్రామాలకు చెందినవాళ్ళు కాదు.

ʹʹఈ కాంట్రాక్టర్లకి మైనింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. కేవలం కాగితంమీదనే వాటికి వాళ్ళు బాధ్యులు. ఇంతకాలంగా ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆ ప్రైవేటు వ్యక్తులు వీళ్ళద్వారా ఆ భూమిలో మైనింగ్‌ దోపిడీ చేస్తారుʹʹ అని సమత స్వచ్ఛంద సంస్థ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి వెబ్బాప్రగడ అంటున్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఈ కాంట్రాక్టును ప్రజల సహకార సంఘానికి యిచ్చివుండేదని ఆయన అంటున్నారు. కాంట్రాక్టర్లు నెలకు 4,000 మిలియన్‌ టన్నుల సున్నపురాయిని వెలికితీయగలరని, APMDC కి టన్నుకు 448రూపాయలు చెల్లించగలరని అంటున్నారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని పంచాయితీల చట్టం 1996లో నిర్దేశించినట్లుగా, ఈ లైసెన్సులు మంజూరు చేయడానికి ముందు ప్రభుత్వం ఈ మూడు గ్రామాలలోనూ గ్రామ సభలు నిర్వహించలేదనికూడా ప్రజలు ఆరోపిస్తున్నారు.

ʹʹమైనింగ్‌ జరపతలపెట్టిన ప్రాంతంలో 18 కుటుంబాలకు భూమి వుంది. వ్యవసాయ కూలీలుగా గాని, చట్టబద్ధమైన హక్కు లేకుండా తరతరాలుగా ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు కనీసం 130 వుంటాయి. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలనిʹʹ రెబ్బాప్రగడ అన్నారు.

2012లో చెల్లించినట్లుగానే తమ భూమికి రాయల్టీ చెల్లించాలని, దానితోపాటు ఈ పథకం అమలులోకి వచ్చేంతవరకు ప్రతి సంవత్సరం కొంత డబ్బు చెల్లించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మైనింగ్‌ ఆగిపోయాక ఆ భూమిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి నిధిని కేటాయించాలని వారు కోరుతున్నారు. వీటితోపాటు భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, సెల్‌టవర్‌ ఏర్పాటు చేయాలని, 24గంటల వైద్య వసతి కల్పించాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

ʹʹమా కోర్కెలలో అత్యధికం అభివృద్ధికి సంబంధించినవి. నిజానికి అవి చేకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే మేం ప్రైవేటు మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు ప్రభుత్వం మమ్మల్ని శిక్షించింది. 1970లలో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సున్నపురాయి నిక్షేపాలను కనుగొన్నప్పటినుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పథకాలను ప్రభుత్వం నిర్వహించలేదుʹʹ అంటున్నారు ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న 60సంవత్సరాల పాండన.

అక్కడకు 40కిలోమీటర్ల దూరంలో బొబ్బిలిలో వున్న ఆసుపత్రి మాత్రమే అత్యంత దగ్గరలో వున్నట్లు లెక్క. ʹʹగ్రామాలలో శానిటేషన్‌ పనులు సక్రమంగా జరగకపోవడం మూలంగా మలేరియా, టైఫాయిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. బయటి వూళ్ళకు వెళ్ళడానికి సరైన రోడ్లులేవు. బయటవాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి అవసరమైన సెల్‌ కనెక్షన్‌కూడా లేదు అన్నారు బాలరాజు. సరైన విద్యావసతి లేకపోవడంతో చిన్న పిల్లలు కూడా ఇతర గ్రామాలకు వెళ్ళాల్సిన స్థితి వుంది.

తాము కేవలం ప్రభుత్వం భూముల్లో మాత్రమే మైనింగ్‌ చేస్తామని, అందుకు ప్రజలు అనుమతిని ఇవ్వాలని కాంట్రాక్టర్లు, APMDC డిసెంబర్‌ 2021లో ప్రతిపాదించారు. దీనికి సమాధానంగా ప్రజలు ఇలా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలకు ఎకరానికి ఒకటిన్నర లక్షల రూపాయలు చెల్లించాలి. మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి చుట్టపక్కల వున్న ప్రాంతాలలో ఏదైనా నష్టం వాటిల్లితే దానికికూడా కాంట్రాక్టరు పరిహారం చెల్లించాలి.

ʹʹమాజీ మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌ , ఈ కొత్త కాంట్రాక్టర్లలో ఒకడైన దురియా రుక్మాని మమ్మల్ని మాటల్లో పెట్టి ఒప్పించడానికి ప్రయత్నిస్తునాడు. అతడి మనుషులు ఉత్సవాలు జరిపిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా మా డిమాండ్లన్నిటికి ఒప్పుకొని చట్టబద్ధమైన ఒడంబడికమీద సంతకం చేసేదాకా మేం లొంగేదిలేదుʹʹ అని బాలరాజు అన్నాడు.

- షాగన్‌

(ʹడౌన్‌ టు ఎర్త్‌ʹ అనే పత్రికలో 2022 జనవరి 29న ప్రచురితమైంది.)

అనువాదం : సిఎస్సార్ ప్రసాద్

(vasanthamegham.com సౌజన్యంతో)

Keywords : andhrapradesh, nimmalapadu, mining, adivasi, Trible, struggle, court
(2022-06-28 08:38:04)No. of visitors : 306

Suggested Posts


లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపు

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల

తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?

ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో

మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్‌ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు.

నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...

సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే

గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట‌...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట‌ !

గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు.

విశాఖ‌ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు

12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై

డేటా చౌర్యంలో దోషులెవరు ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్‌ (6) ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌ (మార్చ్‌ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది.

రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌

ప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం

రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ‌

కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది.

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


Andhrapradesh:తమ