ఉక్రెయిన్ పై రష్యా దాడికి మద్దతు ప్రకటించిన హిందూ సేన - అఖండ రష్యా ఏర్పాటు చేయాలని ఆకాంక్ష‌


ఉక్రెయిన్ పై రష్యా దాడికి మద్దతు ప్రకటించిన హిందూ సేన - అఖండ రష్యా ఏర్పాటు చేయాలని ఆకాంక్ష‌

ఉక్రెయిన్

01-03-2022

పుతిన్ నువ్వు యుద్దం చేయి, అఖండ రష్యా ఏర్పాటు చేయి మీ వెనక మేమున్నాం అని ప్రకటించింది హిందూ సేన. మళ్ళీ పాత సోవియట్ యూనియన్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించింది సోషలిజాన్ని వ్యతిరేకించే హిందూ సేన.

న్యూఢిల్లీ మండి హౌస్‌లోని రష్యన్ కవి అలెగ్జాండర్ పుష్కిన్ విగ్రహంపై హిందూ సేన పోస్టర్లు వేసి, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి మరియు "అఖండ్ రష్యా"కి మద్దతునిచ్చింది.

విగ్రహం క్రింద ఉన్న పీఠంపై ఒకేలాంటి రెండు పోస్టర్లు అంటించారు. ʹసోవియట్ యూనియన్ స్థాపనలో భారతీయ హిందువులు పుతిన్ మరియు రష్యాతో ఉన్నారు. జై హో అఖండ రష్యా. జై భారత్." అని పోస్టర్లలో ఉంది.

ఈ పోస్టర్లపై హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ, ʹమేము ఇలాంటి సమయాల్లో రష్యాకు మద్దతుగా మాత్రమే పోస్టర్లు వేస్తాము. ఏ యుద్ధం మంచిది కాదు, కానీ మనం రెండింటి మధ్య‌ ఎంచుకోవలసి వస్తే, మేము రష్యాకు మద్దతుగా నిలబడతాము, రష్యా ఎల్లప్పుడూ భారతదేశానికి నిజమైన స్నేహితుడిగా ఉంది… రష్యా వారి పాత సోవియట్ యూనియన్ ను మళ్ళీ స్థాపించాలని మేము ప్రార్థిస్తాము. అందుకోసం మద్దతు ఇస్తాము. వారి సరిహద్దులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందే.

NDMC (న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్) వైస్ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ʹఇది నా దృష్టికి రాలేదు, అయితే ఎవరైనా పోస్టర్లు వేయడం ద్వారా ప్రభుత్వ ఆస్తులను పాడుచేయకూడ‌దు. ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చిన వెంటనే మా డివిజన్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. పోస్టర్లు ఇంకా అలాగే ఉంటే, త్వరలో వాటిని తొలగిస్తాము. ʹ అన్నారు

ఫిర్యాదు చేయడం, చర్యలు తీసుకోవడం పోలీసుల విధి అని ఆయన అన్నారు. పోస్టర్లను ఇంకా చూడలేదని పోలీసు అధికారులు తెలిపారు.

indianexpress.com సౌజన్యంతో

Photo: Shuddhabrata Sengupta ఫేస్ బుక్ నుండి

Keywords : russia, Ukrain, war, hindu sena, akhanda rusiia, delhi
(2022-06-27 08:32:26)No. of visitors : 572

Suggested Posts


Condemn the negligent attitude of Indian government in bringing back Indian citizens! - CPI (Maoist)

The contradictions among the imperialists that are taking the humankind towards destruction reached an intense state and war began on Ukraine. The statements of Russia and the

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


ఉక్రెయిన్