కామ్రేడ్ సి. రామ్మోహన్‌కు విరసం నివాళి
09-03-2022
ప్రజా ఉద్యమాల స్నేహితుడు, పాలమూరు అధ్యయన వేదిక నాయకుడు కామ్రేడ్ సి. రామ్మోహన్ మృతికి విరసం నివాళి అర్పిస్తోంది. మంగళవారం (08-03-22) ఉదయం హైదరాబాద్‌లో తన 74వ ఏట అనారోగ్యంతో ఆయన మరణించారు. తొలితరం విరసం నాయకుల్లో ఆయన ఒకరు. కార్యవర్గ సభ్యునిగా సంస్థలో చాలాకాలం పనిచేశారు. అటు భావజాలానికీ, ఇటు కార్యక్షేత్ర సమస్యలకీ మధ్య ఆలోచనలు సాగించే ఆయన పూర్తిగా ఆచరణవాది. ఒక ప్రయాణమో, కొద్ది అడుగుల నడకో, కొంత సంభాషణో రామ్మోహన్‌తో సాగించినవారికి ఆయన వ్యక్తిత్వంలోని ఈ విలక్షణత అనుభవంలోకి వస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో 1985లో విరసం సాహిత్య పాఠశాల జరిగింది. పాలమూరు లేబర్ అనే అంశంపై ఈ పాఠశాలలో రామ్మెహన్ చేసిన ప్రసంగం సామాజిక సమస్యల అధ్యయనానికి ఒక నమూనా లాంటిది. మానవ జీవితానికి సంబంధించిన చాలా లోతైన అంశాలను ఆ పాఠం తడిమింది. విషయం, విశ్లేషణ వల్లనే కాకుండా.. వ్యక్తీకరణ వల్ల, ఆయనకు ఉన్న ఉపన్యాస సామర్థ్యం వల్ల కూడా గద్వాల పాఠశాల కొండగుర్తుగా రామ్మోహన్‌ను ఈరోజున అనేకమంది గుర్తు చేసుకొంటున్నారు.
గత కొన్నేళ్లుగా ఆయన విరసం నిర్మాణ సమావేశాలకు హాజరు కాలేకపోయినా, చివరి దాకా విరసం ఆశయాల కోసం, విప్లవ సాహిత్యోద్యమ కర్తవ్యాల కోసం దృఢమైన మార్క్సిస్టు లెనినిస్టుగా కొనసాగారు. అన్నిరకాల ఆధిపత్య, వివక్షపూరిత సంబంధాలకు ఆయన తొలినుంచీ వ్యతిరేకి. ఈ క్రమంలో ఫాసిజంపై ఆయనది తిరుగులేని పోరాటం. పాత సంస్థానాలతో నిండి ఉండే పాలమూరు ప్రాంతంలోని విద్యాలయాలు సంఘ్ పరివార్ శక్తుల ఆధిపత్యంలో ఉండేవి. అయితే.. ఈ శక్తులకు రామ్మోహన్ ఒక విలన్. తమ శ్రేణుల్లో ఆయన గురించి ఈ శక్తులు ఇలాంటి ప్రచారమే చేసేవి. తాను పాఠాలు చెప్పే విద్యాలయంలో తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకుని ప్రత్యామ్నాయ రాజకీయాలను రామ్మోహన్ ధైర్యంగా ప్రచారం చేసేవారు. ఇలా ప్రచారం చేయడం పాలకవర్గాలకూ, ఫాసిస్టులకూ కంటగింపుగా ఉండేది. ఈ నేపథ్యం నుంచే విరసంలోకి, అక్కడినుంచి పాలమూరు అధ్యయన వేదికలోకి ఆయన ప్రయాణం కొనసాగింది.
తొలినుంచీ సిద్ధాంత అధ్యయనాన్నీ, ఆచరణనూ మేళవించిన జీవన శైలి ఆయనది. పాలమూరు అధ్యయన వేదిక హైదరాబాద్ కమిటీ బాధ్యతల్లో భాగంగా అనేక క్షేత్రస్థాయి అధ్యయనాల్లో రామ్మోహన్ చురుగ్గా పాల్గొన్నారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆహ్లాదకర వాతావరణం ఆవరించేది. తాను చేసే చర్చల్లో, సాగించే ఆలోచనల్లో, కలబోసుకునే అభిప్రాయాల్లోని మృదుత్వం, పాటించే ప్రజాస్వామిక మర్యాదలే దీనికి కారణం. ఈ లక్షణమే ఆయనను వ్యక్తులకు, వేదికలకు స్నేహశీలిని చేశాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్‌లో ఒక టీచరుగా తన వృత్తిగత బాధ్యతగా మాత్రమే ఆయన కొనసాగలేదు. శ్రమ సంస్కృతి, పోరాట అవసరాన్ని పరిచయం చేస్తూ ఉపాధ్యాయులకు ఆరోగ్యకరమైన భావజాలాన్ని అందించడాన్నీ తన కర్తవ్యంగా పెట్టుకుని పనిచేశారు. నిబద్ధ ప్రజా ఆచరణతో కూడిన జీవితం గడిపిన ఆ ఆదర్శ కామ్రేడ్‌కు విరసం జోహార్లు అర్పిస్తోంది.
అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
రివేరా, కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం
08-03-22
Keywords : rammohan, virasam, martyr, teacher, mahabubnagar
(2022-06-27 08:32:13)
No. of visitors : 352
Suggested Posts
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ... |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..