మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్


మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్

మావోయిస్టు

09-03-2022

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, 72 ఏళ్ళ వయస్సు గల‌ అరుణ్ కుమార్ భట్టాచార్జీ ఎలియాస్ కాంచన్ దా ను అస్సాంలోని కాచర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.

జాయింట్ ఆపరేషన్‌లో ఉదర్‌బాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ తోట నుండి భట్టాచార్జీతో పాటు అతనిసహచరుడిని అరెస్టు చేసినట్టు కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రమణదీప్ కౌర్ తెలిపారు.

అస్సాంలో కార్యక్రమాలు ముమ్మరం చేసే ప్రయత్నంలో భాగంగా భట్టాచార్జీ రాష్ట్రంలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

అస్సాంలోని కాచర్, డిమా హసావో జిల్లాలు మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్ జిల్లాల ట్రై జంక్షన్‌కు సమీపంలో ఉన్న ప్రాంతంలో భట్టాచార్జీని అరెస్టు చేశామని అతనిని పట్టుకోవడానికి ఐదు పోలీసు బృందాలు కొద్ది రోజులుగా పనిచేస్తున్నాయని రమణదీప్ కౌర్ చెప్పారు.

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రా, ఒడిశాతో సహా పలు ప్రాంతాల్లో మావోయిస్టు సంస్థలకు కంచన్ దా నాయకత్వం వహించారు, అతనితో పాటు అరెస్టు చేసిన వ్యక్తిని సిపిఐ (మావోయిస్ట్) అస్సాం రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆకాష్ ఉరంగ్ అలియాస్ రాహుల్ అలియాస్ కాజల్‌గా గుర్తించాము ʹఅని కౌర్ చెప్పారు.

ʹరాష్ట్ర మావోయిస్టు పార్టీ కాంగ్రెస్‌ను నిర్వహించడానికి, స్థానిక కార్యకర్తలను నియమించుకోవడానికి, ఇక్కడ ఆయుధాలను కొనుగోలు చేయడానికి భట్టాచార్జీ ఇక్కడకు వచ్చారు. మేము అతని వద్ద నుండి ఒక ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, భారీ మొత్తంలో పత్రాలు, ₹ 3.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాము, ʹఅని కౌర్ తెలిపారు.

భట్టాచార్జీని అరెస్టు చేయడం తమకు పెద్ద విజయంగా గౌహతి పోలీస్ కమీషనర్ హర్మీత్ సింగ్ అన్నారు.

ʹఇది పెద్ద విజయం… డిసెంబర్‌లో అతని కదలికల గురించి మాకు సమాచారం వచ్చింది. అతను అంతకుముందు రెండు-మూడు ఆపరేషన్ల నుండి తప్పించుకున్నారు. కానీ నిన్న సాయంత్రం, అతను టీ తోటలో దాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు మేము అతన్ని అరెస్టు చేయగలిగాము, ʹఅని సింగ్ చెప్పారు.

Keywords : assam, maoist, bhattacharjee, arrest, kachar district, ʹBig catchʹ: Senior Maoist leader ʹKanchan Daʹ, 72, arrested in Assam
(2022-06-27 15:46:29)No. of visitors : 1240

Suggested Posts


ఇది సిరియా కాదు భారతదేశ చిత్రపటం! క్రూరత్వం కూడా సిగ్గుపడే సన్నివేశం

వీడియో మొదటి ఫ్రేమ్‌లో ఏడుగురు పోలీసులు కనిపిస్తారు. అంతకంటే ఎక్కువమంది ఉండవచ్చు. పోలీసులందరి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నారు. విభిన్న శబ్దాలు వస్తున్నాయి.

ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్

ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్‌ త్వరగా పూర్తవుతుందని అన్నారు...

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.

అస్సాం జనాభా 3.3 కోట్లకి పైమాటే. అందులో 3.29 కోట్ల మంది ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పత్రంలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3.11 కోట్ల మంది పేర్లు ముఖ్య జాబితాలో చేరాయి. మిగతావి తిరస్కరనకి గురయ్యాయి. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నలభై లక్షల ఏడు వేల ఏడు మంది పేర్లు ఉన్నాయి.

Assam: ఇళ్ళు ఖాళీ చేయాలని ప్రజలపై పోలీసుల దాడి ‍- పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి !

అస్సాంలో దరాంగ్‌ జిల్లా ధోల్పూర్‌ రణరంగంగా మారింది. 1970ల నుండి ధోల్పూర్ ఉంటున్న ప్రజలపై గురువారంనాడు దాడులు చేసిన పోలీసులు వాళ్ళ ఇళ్ళను కూల్చి వేశారు. అడ్డుచెప్పిన ప్రజలను లాఠీలతో చితకబాదారు. పోలీసులు ప్రజల వెంటపడి మరీ కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకవైపు ఇళ్ల కూల్చివేత, మరో వైపు తమ‌పై పోలీసుల దాడి స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు

అవును మేము గుండాలమే హిందువులు చర్చిలకు వెళ్తే దాడులు చేస్తాం....భజరంగ్ దళ్ నేత‌

ʹʹఅవును మేము గుండాలమే చర్చిలకు వెళ్ళే హిందువుల మీద దాడులు చేస్తాంʹʹ అని అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత మిథు నాథ్ రెచ్చిపోయాడు. కాచర్ జిల్లా సిల్‌చార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిథు నాథ్ ఈ విధమైన గుండా భాషను మాట్లాడాడు.

సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !

మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు 50 మందికి పైగా గాయపడ్డారు. అసోం, కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ కూడా గాయాలపాలయ్యారు. అస్సాం పోలీసులు తమపై గ్రైనేడ్లు ప్రయోగించడం వల్ల తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని మిజోరాం పోలీసులు తెలిపారు.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


మావోయిస్టు