fuel price hike : షటప్, నా మాటలు నాకే గుర్తు చేస్తావా? ఎంత ధైర్యం ? -జర్నలిస్టుపై రాందేవ్ ఆక్రోషం


fuel price hike : షటప్, నా మాటలు నాకే గుర్తు చేస్తావా? ఎంత ధైర్యం ? -జర్నలిస్టుపై రాందేవ్ ఆక్రోషం

fuel

31-03-2022

ʹజస్ట్ షటప్ (నోరు మూసుకో). మళ్ళీ అడిగితే బాగుండదునువ్వు మర్యాదగల తల్లిదండ్రుల కొడుకువి అయితే . ఇలా మాట్లాడకుండా ఉండాలి.ʹʹ ఈ మాటలు రామ్ దేవ్ ఓ జర్నలిస్టును అన్న మాటలు. ఆయనకు అంత కోపంరావడానికి కారణం పెట్రోల్ ధరల గురించి గతంలో రాందేవ్ అన్న మాటలను గుర్తి చేయడమే కారణం.

హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఓ జర్నలిస్టు గతంలో రాందేవ్ మాట్లాడిన మాటలు గుర్తు చేశారు. ʹʹలీటర్‌కు 40 రూపాయలకు పెట్రోల్ 300 రూపాయలకే వంటగ్యాస్ హామీ ఇచ్చే పార్టీకే ఓటు వేయాలిʹʹ అని తన పాత వ్యాఖ్యను గుర్తు చేస్తూ, ప్రస్తుత ఇంధన ధర గురించి మీరు ఏమి చెబుతారని జర్నలిస్టు రాందేవ్ ను ప్రశ్నించారు. దాంతో రాందేవ్ కు బుస్సున కోపం పొడుచుకవచ్చింది. అంతే విలేకరిపై విరుచుకుపడ్డారు.

ʹఅవును, నేను చెప్పాను, ఇప్పుడు మీరేం చేయగలరు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉండకండి. నేను మీ ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిన మీ టేకేదార్ (కాంట్రాక్టర్)నా? ʹʹ ʹజస్ట్ షటప్ (నోరు మూసుకో). మళ్ళీ అడిగితే బాగుండదునువ్వు మర్యాదగల తల్లిదండ్రుల కొడుకువి అయితే . ఇలా మాట్లాడకుండా ఉండాలి.ʹʹ అన్నాడు రాందేవ్ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతకుముందు కార్యక్రమంలో, ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలు మరింత కష్టపడి పనిచేయాలని రాందేవ్ కోరారు. ʹఇంధన ధరలు తక్కువగా ఉంటే, తమకు పన్నులు రావు అని ప్రభుత్వం చెబుతోంది, అప్పుడు వారు దేశాన్ని ఎలా నడుపుతారు, జీతాలు ఎలా చెల్లిస్తారు, రోడ్లు ఎలా నిర్మిస్తారు? అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, నేను అంగీకరిస్తున్నాను... కానీ ప్రజలు కష్టపడి పని చేయాలి. నేను కూడా ఉదయం 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను.ʹʹ అని రాందేవ్ వక్కాణించారు.

అవును నిజమే ప్రజలే కష్టపడాలి. మరింత గా పని చేయాలి. పెట్టుబడిదారుల ఆస్థుల‌ను పెంచుతూనే ఉండాలి. ప్రభుత్వాలను పోషించాలి. వాళ్ళు మాత్రం ఆకలితో , అప్పులతో అలమటించాలి. అదేందని కనక మనం అడిగితే షటప్ అని రాందేవ్ లాంటి వాళ్ళు కండ్లెర్రజేస్తారు.

Keywords : baba ramdev, journalist, fuel price hike, "Shut Up, Wonʹt Be Good For You": Ramdev On Reporterʹs Fuel Price Question
(2022-06-27 15:46:27)No. of visitors : 364

Suggested Posts


అల్లోపతి పనికిమాలినదన్న రాందేవ్ - ఆయనపై చర్యలు తీసుకోవాలని IMA డిమాండ్

తన ఆరోగ్యం బాగా లేనప్పుడు అల్లోపతి వైద్యం చేయించుకొని బతికి బట్టకట్టిన రాందేవ్ బాబా అల్లోపతి వైద్యం పనికిమాలిన వైద్యమని కామెంట్లు చేశాడు. కరోనా కట్టడిలో అల్లోపతి విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమని, ఆ వైద్య విధానం పనిచేయకపోవడం వల్లనే ఇన్ని లక్షల ప్రాణాలు పోతున్నాయంటూ వ్యాఖ్యానించాడు.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


fuel