దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కా. నర్మదకు విప్లవ జోహార్లు!


దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కా. నర్మదకు విప్లవ జోహార్లు!

దండకారణ్య

10-04-2022

కా. నిర్మల @ నర్మద శనివారం ఉదయం కేన్సర్ తో మరణించిందనే విషాద వార్త తెలిసింది. ఆమె మరణంతో భారత విప్లవోద్యమం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది. ఒక పంచాది నిర్మల, ఒక పద్మ, లలిత, అనురాధ గాంధి వంటి నాయకురాలిని కోల్పోయింది. ఒక నూతన భారత సమాజ నిర్మాణం కోసం, పీడిత ప్రజల వ్విముక్తిలోనే మహిళల విముక్తి ఉందని ప్రగాఢంగా నమ్మి తన జీవితాన్ని విప్లవోద్యమ నిర్మాణానికి అంకితం చేసిన ఒక గొప్ప విప్లవకారిణి 2018లో రొమ్ము కేన్సర్ బారిన పడి దాని చికిత్సకై హైదారాబాద్ నగరానికి వచ్చి అరెస్టు అయ్యి రెండేళ్లుగా మహారాష్ట్రలోని జైళ్ళలో నిర్బంధంలో ఉండి ఏప్రిల్ 9న తనువు చాలించింది. చాలా అరుదుగా కోర్టు ప్రదర్శించిన మానవతా దృక్పథం వల్ల గత ఏడాది కాలంగా జైలులో కాక, hospice care centre లో చికిత్స పొందుతూ మరణించింది.
కా. నిర్మల ఒక అరుదైన విప్లవకారిణి. చాలా లేటు వయసులో తన నలభైలలో, 1990 దశకం రెండవ భాగంలో దండకారణ్యంలోకి అడుగు పెట్టింది. గడ్చిరోలి లో ఆదివాసీలను విప్లవోద్యమంలో సంఘటిత పరిచే బాధ్యతలను చేపట్టింది. నలభైలలో కొత్తగా అడవి జీవితానికి,, దళ జీవితానికి అలవడటం అంత సులభమైన విషయం కాదు. అదీ ఒక మహిళకు. ఆమె చాలా త్వరగా అక్కడ డివిజన్ కమిటీ సభ్యురాలిగా నాయకత్వం చేపట్టడమే కాక, ఆ తరువాత గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, డి‌కే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా, అక్కడి సెక్రెటేరియట్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించింది. గడ్చిరోలిలో ఈమె ప్రవేశించిన నాటికే అక్కడ ఉద్యమం నిప్పులు చెరిగే నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది. అయినా రెండు దశాబ్దాల పాటు ఆ నిర్బంధం మధ్యనే, సి-60 దాడుల మధ్యనే, ఎందరో నేల కొరుగుతున్నా, కొందరు సరెండర్ అయి ద్రోహం చేసినా మొక్కవోని ధైర్యంతో ఒక డివిజన్ ఉద్యమానికి రాజకీయ సైనిక నాయకత్వం వహించడమే కాక, మొత్తం దండకారణ్య ఉద్యమానికే నాయకత్వం వహించే నాయకత్వ బృందంలో ఒక సభ్యురాలైంది. ఒక మహిళగా పితృస్వామ్యపు ఆటంకాలను, అడ్డంకులను ఎదుర్కొని సైనిక క్షేత్రపు ప్రాధాన్యత చాలా ఉన్న చోట అట్లా నాయకత్వంలోకి ఎదగటం అంతా సులభమైన విషయం కాదు. రెండున్నర దశాబ్దాల పాటు దండకారణ్యంలో, అంతకు ముందు ఇతర రంగాలలో ఆమె విప్లవోద్యమానికి చేసిన సేవలను మరింత వివరంగా ఆమె సన్నిహిత సహచరులు ప్రపంచానికి తెలియజేస్తారు కానీ ఆమె మరణం విప్లవోద్యమానికి ఒక తీరని లోటు. కేన్సర్ ఆమె ప్రాణాన్ని అర్ధాంతరంగా కబళించకపోయి ఉంటే మరింత ఉన్నత స్థాయిలో భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించవలసిన కామ్రేడ్. ఆ కామ్రేడ్ అకాల మరణానికి శోకతప్త హృదయంతో విప్లవాంజలి ఘటిస్తున్నాను. జైలు నిర్బంధంలో ఉన్న ఆమె సహచరుడు కా. సత్యనారాయణ కు సహానుభూతిని కూడా తెలియజేయలేని పరిస్థితి.
జోహార్ కామ్రేడ్ ఉప్పుగంటి నిర్మల.
దండకారణ్య విప్లవోద్యమ వియ్యుక్క (వేగు చుక్క) కా. నర్మదకు వినమ్ర విప్లవ జోహార్లు.
అమర్ హై కా. నర్మద.

- రవి నార్ల‌

Keywords : narmada, nirmala, cpi maoist, dandakaranyam, andhrapradesh, krishna district, martyr
(2022-06-28 14:44:57)No. of visitors : 731

Suggested Posts


విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెక్రటేరియట్ సభ్యురాలూ, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం (కేఏఎమ్ ఎస్) సీనియర్ నాయకురాలు కామ్రేడ్ నర్మద (ఉప్పుగంటి నిర్మలా కుమారి) ఏప్రిల్ 9వ తారీఖున ప్రభుత్వ నిర్బంధంలో తుదిశ్వాస వదిలిందనే సమాచారం మాకు ఆలస్యంగా తెలిసింది. కేఏఎంఎస్ ఆమెకు వినమ్ర నివాళి అర్పిస్తున్నది. ఆమె త్యాగాల దారిలో మరింత దృఢంగా ముందుకు సాగమని కేఏఎంఎస్ కార్

నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

అత్యంత సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు నిర్మల అలియాస్ నర్మదా దీదీ మహారాష్ట్ర జైలులో మరణించిన నేప‌థ్యంలో ఏప్రిల్ 25న దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అన్ని కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు.

ʹపూచిన చెట్టుకిందనే రాలిన పువ్వుʹ -ఎన్.వేణుగోపాల్

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


దండకారణ్య