సాహిత్యం ద్వారా దండకారణ్యంలో వర్గపోరాట పరివర్తనా క్రమాన్ని చెప్పిన నర్మద -పాణి
10-04-2022
సుప్రసిద్ధ విప్లవ కథా రచయిత్రి నిత్య(నర్మద, నిర్మల) శనివారం ఉదయం మహారాష్ట్రలో చనిపోయింది. జూన్ 12, 2019 న తన సహచరుడు కిరణ్ తో పాటు హైదరాబాదులో అరెస్టయినట్లు పత్రికల్లో వచ్చింది. కాన్సర్ తో బాధపడుతున్న నర్మద వైద్యం కోసం వచ్చి అరెస్టయింది. అప్పటి నుంచి మహారాష్ట్ర జైలులో ఉన్నది. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది.
నిత్య చాలా కొద్ది కథలే రాసింది. అందులో చాయ్‌గ్లాస్ ఆమె ప్రాతినిధ్య కథ. నిజానికి అది దండకారణ్య సాహిత్యంలోనే పేరెన్నకగన్నది. చలనాన్ని, మార్పును అత్యంత కళాత్మకంగా, ప్రతిభావంతంగా చిత్రించిన కథ అది. మార్క్సిస్టు మేధావి ముదునూరి భారతి గారు సాహిత్యంలో సమాజ చలనాన్ని విశ్లేషించిన ఒక పత్రంలో నిత్య రాసిన చాయ్ గ్లాస్‌ను ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఎందరో సామాజిక పరిశీలకులు దండకారణ్యంలో వర్గపోరాట పరివర్తనా క్రమాన్ని చెప్పడానికి చాయ్‌గ్లాస్ కథను సాహిత్య సాధనంగా తీసుకున్నారు.
సాహిత్యంలో శిల్ప చర్చ చేయడానికి కూడా సాహిత్య విమర్శకులు ఆ కథను ఉదాహరణగా చెబుతారు. భారతదేశంలోనే అతిపెద్ద మహిళా ఉద్యమం దండకారణ్యంలో సాగుతున్నది. దానికి నాయకత్వం వహిస్తున్నది దండకారణ్య క్రాంతికారీ మహిళా సంఘం. దాని నాయకురాలు కా. నర్మద.
విప్లవోద్యమమే కళాభరితం. అందునా పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మహిళ భాగస్వామ్యం దాన్ని మరింత సౌందర్యాత్మకం చేస్తుంది. నర్మదలాంటి మహిళల నాయకత్వంలో.. విప్లవ, విప్లవ కథా నిర్మాణం కూడా ఒక కొత్త కళాత్మక ప్రపంచాన్ని దండకారణ్యంలో రూపుగట్టిస్తున్నాయి.
దండకారణ్య మహిళా రచయిత్రలు నైనా, సుజాత కథలతోపాటు నిత్య కథలను కూడా కలిపి విరసం సామాన్యుల సాహసం అనే సంకలనం గతంలో అచ్చేసింది. ఆ పుస్తకం వచ్చాక నర్మద చాయ్‌గ్లాస్ పాఠకులకు మరింతగా అందుబాటులోకి వచ్చింది.
ఆమె కథలకంటే ఎక్కువగా వ్యాసాలు రాసింది. అంతకంటే ఎక్కువగా పితృస్వామ్య వ్యతిరేకంగా మహిళా ఉద్యమం ఎలా ఉండాలో నిర్మించి చూపించింది. ఆమెకు నివాళి.
పాణి
Keywords : narmada, nirmala, cpi maoist, virasam, pani, martyr,
(2022-06-27 08:32:23)
No. of visitors : 518
Suggested Posts
0 results
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..